BigTV English

Samantha: బిగ్ స్కాం… చిక్కుల్లో పడ్డ సమంత

Samantha: బిగ్ స్కాం…  చిక్కుల్లో పడ్డ సమంత

Samantha: సమంత గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. చాలామందికి ఇప్పటికీ ఒక ఫేవరెట్ హీరోయిన్. సమంత చేసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ ఫిక్స్ గాని. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దాదాపు స్టార్ హీరోస్ అందరితో కూడా నటించి మంచి సూపర్ హిట్స్ అందుకుంది. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమంత, తన పర్ఫామెన్స్ తో కుర్ర కారును సైతం మాయ చేసింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్లో కూడా సినిమాలు చేసి మంచి పేరు సాధించుకుంది. సమంత నటించిన ఫ్యామిలీ మెన్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సమంతా లోని నెక్స్ట్ లెవెల్ పర్ఫామెర్ ను బయటకు తీసింది ఆ సిరీస్. ఆ తర్వాత సమంత లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడం మొదలుపెట్టింది. అయితే అవి ఊహించిన సక్సెస్ ని తీసుకురాలేదు. ఇక మధ్యలో తనకున్న హెల్త్ ఇష్యూస్ వలన కొన్ని ప్రాజెక్ట్స్ రిజెక్ట్ చేసింది సమంత. అయితే సమంత ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడం వలన ఆ అవకాశాల్లో కొన్ని రష్మిక కు కూడా చేరాయి.


తెలుగులో చివరిగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన శాకుంతలం, శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఖుషి సినిమాలలో సమంత కనిపించింది. ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయాయి. ప్రస్తుతం సమంత ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటివరకు దీని గురించి సరైన అప్డేట్ కూడా రాలేదు. ప్రస్తుతం సమంత సామ్ బాలీవుడ్ లోనే ఫుల్ బిజీ అవుతోంది. లేటెస్ట్ గా అమెజాన్ ప్రైమ్ నిర్మించిన క్రేజీ సిరీస్ ‘సిటాడెల్ : హనీ బన్నీ’తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక ప్రస్తుతం సమంత నెట్ఫ్లిక్ సంస్థకి ఒక సిరీస్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సిరీస్ కి బ్రేకులు పడ్డాయి. సమంత నటిస్తున్న ‘రక్త్ : భ్రమండ్’. సమంత డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఈ సిరీస్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నెట్ ఫ్లిక్స్ లాంటి పెద్ద సంస్థ ఈ సిరీస్ ను నిర్మిస్తుండటం విశేషం. దర్శకుడు రహి అనిల్ బర్వే తెరకెక్కిస్తున్నారు. ఆదిత్య రాయ్ కపూర్, నటి వామికా గబ్బి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొన్నటి వరకు ఈ సిరీస్ షూటింగ్ సాఫీగానే సాగింది. కానీ బడ్జెట్ లో లెక్కలు తారుమారావడంతో ఈ సిరీస్ ను ఆపినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్కాన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించి కేవలం 26 రోజులు మాత్రమే షూటింగ్ అయింది. అయితే సినిమాకి సంబంధించి సగం బడ్జెట్ ఆల్రెడీ ఖర్చయిపోయిందట. ఒకసారి మళ్లీ పకడ్బందీగా ప్లాన్ చేసి షూట్ కి వెళ్లాలని చిత్ర యూనిట్ బ్రేకులు వేసింది. అయితే నెట్ఫ్లిక్స్ సంస్థ దీనికోసం ఎంతవరకైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది అని తెలుస్తుంది. ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేసిన తప్పిదం సమంతాకు చిక్కులు తీసుకొచ్చింది.


Also Read : Akkineni family: అక్కినేని కుటుంబంలో మరో శుభకార్యం.. ఫ్యాన్సులో ఖుషి..!

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×