BigTV English

Champions Trophy High Alert: ఛాంపియన్స్ ట్రోఫీపై పాక్ ఉగ్రవాదుల కుట్రలు.. వారిని కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ ?

Champions Trophy High Alert:  ఛాంపియన్స్ ట్రోఫీపై పాక్ ఉగ్రవాదుల కుట్రలు.. వారిని కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ ?

Champions Trophy High Alert: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్… కు పెను ప్రమాదం పొంచి ఉంది. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో… ఉగ్రవాదులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ పాకిస్తాన్ దేశంలో జరుగుతున్న నేపథ్యంలో… ఆ దేశంలో ఉన్న ఉగ్రవాదులు… భారీ ప్లాన్ వేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూపులు… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ను టార్గెట్ చేసినట్లు పాకిస్తాన్ దేశానికి సంబంధించిన ఇంటలిజెన్స్ వర్గాలు అధికారికంగా ప్రకటించినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ దేశంలో మ్యాచ్లను వీక్షించడానికి… దాదాపు ఆరు దేశాల కంట్రీ కి చెందిన అభిమానులు వచ్చారు. అలా మ్యాచులు చూసేందుకు వచ్చిన విదేశీయులను… కిడ్నాప్ చేయాలని.. కొత్త ప్లాన్ వేశారట పాకిస్తాన్ టెర్రరిస్టులు.


Also Read: Pakistan on Virat Kohli: కోహ్లీ సెంచరీ చేయకుండా పాకిస్థాన్‌ కుట్రలు ?

ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ దేశంలో… అలర్ట్ అయిన అధికారులు…. హై అలెర్ట్ ప్రకటించారు. తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, ISISI, బలుచిస్తాన్ ఉగ్రవాదులు అందరూ కలిసి ఈ పథకం పన్నినట్లు తాజాగా తెరపైకి వచ్చింది. చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ పైన… ఈ ఉగ్రవాదుల కన్ను పడడంతో… పాకిస్తాన్ సర్కార్ కూడా హై అలెర్ట్ ప్రకటించింది. పాకిస్తాన్ దేశంలో క్రికెట్ మ్యాచ్లు చూసేందుకు వచ్చిన విదేశీయులను కాపాడేందుకు…. ప్రత్యేక బృందాలను కూడా స్టేడియాల వద్ద బరిలోకి దింపాయి. విదేశీ పౌరులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా… చూసుకోవాలని ఆదేశాలు కూడా వచ్చాయి. దీంతో పాకిస్తాన్ దేశానికి సంబంధించిన ఆర్మీ… నిద్రపోకుండా పనిచేసేందుకు సిద్ధమైంది.


ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఏదైనా చిన్న హడావిడి చేస్తే… టోర్నమెంట్ పూర్తిగా రద్దు అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా… పాకిస్తాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తోంది. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని కోరింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. దీంతో అలర్ట్ అయిన పాకిస్తాన్ సర్కార్… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని భరోసా కల్పిస్తోంది.

Also Read: Pak Fan In India Jersey: పాక్ ఓడిపోతుందని..జెర్సీ మార్చేసిన ఫ్యాన్..వీడియో వైరల్ !

అయినప్పటికీ ఉగ్రవాదుల నుంచి ఒక్కసారిగా కిడ్నాప్ పథకం బయటికి రావడంతో…. అక్కడికి వెళ్లిన విదేశీయులు గత గత వణికిపోతున్నారు. గతంలో స్టేడియం సమీపంలో బాంబులు పేలినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో శ్రీలంక క్రికెటర్లకు గాయాలు కూడా అయ్యాయి. అయితే ఆ విషయాన్ని గ్రహిస్తున్న విదేశీ ఫ్యాన్స్… వెంటనే పాకిస్తాన్ ఖాళీ చేసి తమ తమ దేశాలకు వెళ్ళిపోతున్నారు. మరి కొంతమంది దుబాయ్ షిఫ్ట్ అవుతున్నారు. ఇండియా మ్యాచ్ అయిన చూసి… ఇంటికి వెళ్దామని కొంతమంది ఫ్యాన్స్ దుబాయ్ కి చేరుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఈసారి హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తున్నారు. అంటే దుబాయ్ వేదికగా టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్ ఉంటుంది. మిగిలిన మ్యాచ్లన్నీ పాకిస్తాన్ దేశంలో జరుగుతాయి. పాకిస్తాన్లో ఇలాంటి ఉగ్ర దాడులు ఉంటాయని… ముందు జాగ్రత్తతో టీమిండియా హైబ్రిడ్ మోడల్ కు డిమాండ్ చేసింది.

 

Related News

Asia Cup 2025 : అభిషేక్ శర్మ రనౌట్… దుబాయ్ స్టేడియంలో ఏడ్చేసిన లేడీ

Team India : వెస్టిండీస్ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక..వైస్ కెప్టెన్ గా జ‌డేజా..షెడ్యూల్ ఇదే

IND Vs AUS : ఆస్ట్రేలియాతో సిరీస్… టీమిండియా కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్

Asia Cup 2025 : టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పై విమర్శలు…గంభీర్ పై సంజూ సీరియస్?

Pak vs Ban: ఇవాళే బంగ్లా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌…గెలిస్తే ఫైన‌ల్స్‌, ఓడితే ఇంటికే

BCCI: బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇక ఈ ఇద్ద‌రూ పాక్‌ క్రికెట‌ర్ల కెరీర్ క్లోజ్‌

IND vs BAN: పసికూన బంగ్లాదేశ్ పై పంజా…ఆసియా కప్ ఫైనల్స్ కు టీమిండియా..ఇంటికి శ్రీలంక

IND vs BAN: త‌డ‌బ‌డిన టీమిండియా…బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే ?

Big Stories

×