Gifts to Pawan Kalyan: సింగపూర్ నుండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అరుదైన కానుక అందింది. ఆ కానుకను చూసి పవన్ పడ్డ సంబరం అంతా ఇంతా కాదు. ఇంతటి అపూర్వ కానుక అందుకోవడం, ఆనందంగా ఉందంటూ పవన్ ట్వీట్ చేశారు. ఊహించని కానుకను అందుకోవడం ఎంతగానో ఆనందాన్ని ఇచ్చిందని, ఈ కానుకను భద్రపరచుకోనున్నట్లు పవన్ తెలిపారు. సింగపూర్ నుండి వచ్చిన కానుక ఏమిటి? పవన్ సంబరం వెనుక కారణాలేమిటో తెలుసుకుందాం.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఇష్టమైనవి ఏమిటో అందరికీ తెలిసిందే. అదేనండీ పవన్ ఎక్కడికి వెళ్లినా.. కొనుగోలు చేసే వాటిలో పుస్తకాలు ముందు వరుసలో ఉంటాయి. స్వయంగా పవన్ ఇదే మాటను ఎన్నో సార్లు చెప్పారు. తనకు ఏదైనా సందేహం కలిగినా వెంటనే సంబంధిత పుస్తకాన్ని చదివేస్తానంటూ పవన్ అంటుంటారు. కోటి రూపాయలు డబ్బులు ఇచ్చేందుకు వెనుకాడనని, తన వద్ద ఉన్న అమూల్యమైన పుస్తకాలను ఎవరికైనా ఇచ్చేందుకు మనసు ఒప్పుకోదన్నారు. దీనిని బట్టి పవన్ కు పుస్తకాలంటే ఎంత ప్రాణమో చెప్పవచ్చు.
అలాంటి పవన్ కు సింగపూర్ నుండి ఏకంగా రెండు పుస్తకాలు అందాయి. సింగపూర్ నుండి వచ్చిన ఆ పుస్తకాలను స్వీకరించిన పవన్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. one man view of the world, hard truths to keep Singapore going అనే పుస్తకాలను సింగపూర్ రిపబ్లిక్ కాన్సులేట్ జనరల్ ఎడ్గార్ పాంగ్, కాన్సుల్ వైష్ణవి లు పవన్ కళ్యాణ్ కు పంపించారు. లీ కువాన్ యూ అనే రచయిత రచించిన ఈ పుస్తకాలను అందుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని పవన్ అన్నారు.
ఒక సాధారణ మత్స్యకార గ్రామం నుండి ప్రపంచ శక్తి కేంద్రంగా సింగపూర్ కు చెందిన లీ కువాన్ యూ యొక్క దార్శనిక నాయకత్వం, దృఢ సంకల్పానికి నిదర్శనంగా పుస్తకాల గురించి పవన్ అభివర్ణించారు. ఈ అమూల్యమైన పుస్తకాలు పాలన, నాయకత్వంపై లోతైన గుణాన్ని అందిస్తాయని పవన్ ట్వీట్ చేశారు. పుస్తకాలను స్వీకరించడం గౌరవంగా ఉందని, సింగపూర్, ఆంధ్రప్రదేశ్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. మొత్తం మీద పవన్ కు సింగపూర్ నుండి అమూల్యమైన సందేశాలతో పుస్తకాలు వచ్చాయని చెప్పవచ్చు.
Also Read: హోదా ఇవ్వకపోతే రాజీనామా? రోజా కామెంట్స్ అర్థం అదేనా?
ఇలా పవన్ తనకు అందిన కానుకల గురించి వివరించగా, పవన్ ట్వీట్ కు అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. జ్ఞానం పొందాలంటే పుస్తకాల ద్వారానే సాధ్యమవుతుందని తమ నాయకుడు ఎన్నో సార్లు చాటి చెప్పారని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సంధర్భంగా విజయవాడ పుస్తక మేళాలో పాల్గొన్న పవన్ చేసిన కామెంట్స్ ను అభిమానులు షేర్ చేస్తూ.. ప్రతి అభిమాని, పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని, అప్పుడే దేశం గర్వించదగ్గ స్థాయికి వెళ్తారన్న పవన్ కామెంట్స్ ను మరికొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
"One man's courage makes a majority" and Lee Kuan Yew is the perfect symbol of this, turning a nation’s aspirations into reality through sheer will and leadership. Singapore’s journey from a simple fishing village to a global powerhouse is a testament to the visionary leadership,… pic.twitter.com/GxXqCdmc9l
— Pawan Kalyan (@PawanKalyan) February 24, 2025