BigTV English

Pak Fan In India Jersey: పాక్ ఓడిపోతుందని..జెర్సీ మార్చేసిన ఫ్యాన్..వీడియో వైరల్ !

Pak Fan In India Jersey: పాక్ ఓడిపోతుందని..జెర్సీ మార్చేసిన ఫ్యాన్..వీడియో వైరల్ !

Pak Fan In India Jersey: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 Tournament )
నేపథ్యంలో… పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా  ( Pakistan vs Team India)  మధ్య ఆదివారం రోజున మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో… 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ టీం పైన టీమిండియా విజయం సాధించింది. విరాట్ కోహ్లీ విరోచిత పోరాటంతో… టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. టీమిండియా ( Team India ) మిడిల్ ఆర్డర్ అలాగే టాప్ ఆర్డర్… ఇద్దరూ రాణించడంతో… 42 ఓవర్లలోనే… టీమిండియా విజయం సాధించింది. పాకిస్తాన్ 241 పరుగులు చేయగా… ఆ లక్ష్యాన్ని విరాట్ కోహ్లీ ( Virat Kohli) అవలీలగా చేదించాడు.


Also Read: Hardik Pandya Watch: పాక్ మ్యాచ్ లో ఖరీదైన వాచ్ తో పాండ్యా..ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ?

ఈ మ్యాచ్ పూర్తిగా వన్ సైడ్ గా ఉన్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ విరోచిత పోరాటంతో…. టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో ఓ ఆసక్తికర సంఘటన.. చోటుచేసుకుంది. పాకిస్తాన్ జట్టుకు సంబంధించిన ఓ వీరాభిమాని… చేసిన ఘనకార్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాకిస్తాన్.. మంచి ఊపులో ఉన్నంతసేపు… వాళ్ల టీమ్ జెర్సీని ధరించి ఎంజాయ్ చేశాడు సదర్ ఫ్యాన్.


ఎప్పుడైతే విరాట్ కోహ్లీ… బ్యాట్ జులిపించాడో… అప్పుడు టీమిండియా వైపు విజయం వెళ్లింది. ఇది గమనించిన పాకిస్తాన్ కు చెందిన అభిమాని… వెంటనే తన జెర్సీని ( Pak Fan In India Jersey ) తీసేశాడు. అనంతరం టీమిండియా జెర్సీని ధరించి… రోహిత్ శర్మ సేనకు జై కొట్టాడు. ఇక ఈ సంఘటన చూసినా అక్కడే ఉన్న ఫ్యాన్స్.. ఫిదా అయిపోయారు. పాకిస్తాన్ వాడు మన టీమిండియా కు ఫ్యాన్ అయిపోయాడు అని… అందరూ అంటున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దింతో ఈ వీడియోని చూసిన నెటిజెన్స్… రకరకాలుగా స్పందిస్తున్నారు. పాకిస్తాన్ ప్లేయర్ల ఆట నచ్చక… ఇలా చాలామంది ఫ్యాన్స్ చేస్తున్నారని అంటున్నారు. మరికొందరైతే విరాట్ కోహ్లీ దెబ్బకు.. పాకిస్తాన్ ఫ్యాన్స్ పిచ్చోళ్ళు అవుతున్నారని కూడా చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా… ఈ మ్యాచ్ లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ…. పలు రికార్డులను బద్దలు కొట్టాడు. పాకిస్తాన్ జట్టు పైన వన్డేలలో 778 పరుగులు చేసిన క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. అలాగే ఈ మ్యాచ్లో 14 వేల పరుగులను వన్డేలలో పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఈ రికార్డు ను కేవలం 287 ఇన్నింగ్స్ లలో పూర్తి చేసుకున్నాడు. ఇదే 14,000 రికార్డును సచిన్ టెండుల్కర్ 350 ఇన్నింగ్స్ లో చేయడం జరిగింది. ఇది ఇలా ఉండగా… పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ జట్ల పైన గెలిచిన… టీమిండియా… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్లో సెమిస్ చోటును దాదాపు ఖరారు చేసుకున్నట్లఐంది. నెక్స్ట్ మ్యాచ్ గెలిచినా… గెలవకపోయినా పెద్ద ఫరక్ పడదు. సెమిస్ మాత్రం కచ్చితంగా వెళుతుంది టీమిండియా.

Also Read: Ind vs Pak: దుబాయ్‌ లో కుప్పకూలిన పాక్‌.. టీమిండియా టార్గెట్‌ ఎంతంటే ?

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Sports Today (@sportstodayofficial)

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×