Pakistan on Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 Tournament ) నేపథ్యంలో.. పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ ఆదివారం రోజున జరిగింది. ఈ కీలక మ్యాచ్లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. పాకిస్తాన్ జట్టును మట్టి కనిపించిన టీమ్ ఇండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా….చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో… సెమీ ఫైనల్ బెర్త్ ను ఖరారు చేసుకున్నట్లయింది. అటు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ వైదొలిగే ప్రమాదం వచ్చి పడింది.
Also Read: Chiranjeevi in Ind vs Pak match: దుబాయ్ మ్యాచ్ కు చిరు, టీడీపీ నేతలు…అభిషేక్ శర్మతోనే సిట్టింగ్ !
టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ( Virat Kohli ) ఒక్కసారిగా భయంకరమైన బ్యాటింగ్ చేసి చెలరేగడంతో… పాకిస్తాన్ కు ఆ గతి పట్టడం జరిగింది. అయితే ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ పైన కుట్రలు పన్నింది పాకిస్తాన్ టీం. విరాట్ కోహ్లీ సెంచరీ చేయకుండా.. గేమ్స్ ఆడింది. విరాట్ కోహ్లీ 90 పరుగులకు చేరుకున్న తర్వాత… కొత్త కుట్రకు తెర లేపారు పాకిస్తాన్ ప్లేయర్లు. పాకిస్తాన్ టీం పైన పది పరుగుల వరకు చేస్తే టీమిండియా ( Team India ) విజయం సాధిస్తుంది. అదే సమయంలో విరాట్ కోహ్లీ 90 పరుగులకు చేరుకున్నారు.
మెల్లి మెల్లిగా స్ట్రైక్ తీసుకుంటూ… సెంచరీ పూర్తి చేసుకుందామని అనుకున్నాడు విరాట్ కోహ్లీ ( Virat Kohli Century). అయితే ఇది గమనించిన పాకిస్తాన్ బౌలర్లు… ఎక్కువగా వైడ్లు వేశారు. దీంతో… టీమిండియా టార్గెట్ తక్కువ అయిపోయింది. అటు విరాట్ కోహ్లీ సెంచరీ చేజారే… ప్రమాదం వచ్చి పడింది. అయితే చివరికి… 96 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు… రెండు పరుగులు చేస్తే టీమిండియా గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో నేరుగా విరాట్ కోహ్లీ సెంచరీ కోసం ప్రయత్నించి ఫోర్ కొట్టాడు. ఈ తరుణంలోనే 111 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఈ దెబ్బకు పాకిస్తాన్ ప్లేయర్లు ఉలిక్కిపడ్డారు. పాకిస్తాన్ ప్లేయర్లు ఎన్ని స్కెచ్ లు వేసినా.. విరాట్ కోహ్లీ మాత్రం…చాక చక్యంతో సెంచరీ చేసుకుని.. టీమిండియాను గెలిపించాడు.
Also Read: Hardik Pandya Watch: పాక్ మ్యాచ్ లో ఖరీదైన వాచ్ తో పాండ్యా..ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ?
దుబాయ్ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ కాకుండా అడ్డుకున్నది షాహిన్ ఆఫ్రిది. టీమిండియా విజయం సాధించే నేపథ్యంలో ఒకే ఓవర్ లో ఏకంగా మూడు వైడ్లు వేయడం జరిగింది. దాంతో విరాట్ కోహ్లీ సెంచరీ చేయకుండా.. మ్యాచ్ విజయం సాధిస్తామని టీమిండియా ఫ్యాన్స్ ఆందోళన చెందారు. కానీ విరాట్ కోహ్లీ తెలివిగా ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే పాకిస్తాన్ ఆటగాడు షాహిన్ ఆఫ్రిది చేసిన ఈ పనిపై.. సోషల్ మీడియా భగ్గుమంటుంది. ఇలాంటి కుట్రలు ఎందుకు చేసావని షాహిన్ ఆఫ్రిదిని ట్రోల్ చేస్తున్నారు.