Big Stories

Balineni: బాలినేని ముందు జగన్ తగ్గారా? నెగ్గారా?.. ఒంగోలు వార్ ముగిసినట్టేనా?

jagan balineni

Balineni: జగన్మోహన్‌రెడ్డి మహా ఖతర్నాక్ అంటారు. ఎంతటివారైనా ఆయన ముందు జీహుజూర్ అనాల్సిందేనంటారు. అలాంటిది.. ఆయన్ను ధిక్కరించి.. పార్టీలో నెగ్గుకురావడమంటే మాటలా? కానీ, బాలినేని సాధించారు. పట్టుబట్టి.. పంతం నెగ్గించుకున్నారు. ఒంగోలు డీఎస్పీని ఎట్టకేళకు బదిలీ చేయించుకున్నారు. మరి, ఇంతటితో వివాదం ముగిసిపోయినట్టేనా? బాలినేని మళ్లీ జగన్‌ బలగంగా మారిపోతారా? అలకలు, అసంతృప్తులు, రాజీనామాలు పక్కన పెట్టేసినట్టేనా? ఇది టీకప్పులో తుఫానా? రానున్న రాజకీయ తుఫాను హెచ్చరికా?

- Advertisement -

బావాబావమరిదిల ఆధిపత్య పోరుతో పార్టీ అధినేత జగన్ నలిగిపోతున్నారు. బలమైన నేత బాలినేనిని కాదనుకోలేరు. తనవాడైన వైవీ సుబ్బారెడ్డి ప్రధాన్యమూ తగ్గించలేరు. ఇద్దరినీ సమానంలో చూసుకోవాలనుకున్నా.. వాళ్లలా చూడనివ్వటం లేదు. ఇద్దరిలో ఏ ఒక్కరే.. అనేట్టు తరుచూ కోల్డ్‌వార్‌కు దిగుతున్నారు. జగన్ ముందు పంచాయితీలు పెడుతున్నారు.

- Advertisement -

బాలినేని వర్సెస్ వైవీ పోరులో.. ఇప్పటివరకైతే వైవీ సుబ్బారెడ్డిదే అప్పర్ హ్యాండ్. అందుకే బావమరిదిలో అంతటి అసహనం. తన మంత్రి పదవి పీకేయించారనే ఫ్రస్టేషన్. సురేష్ పోస్టు అలానే ఉంచారనే ఆవేశం. అప్పటినుంచీ రగిలిపోతున్న బాలినేని కోపాగ్నిలో.. ఎప్పటికప్పుడు ఆజ్యం పోసే ఘటనలు. ప్రోటోకాల్ పేరుతో పోలీసులు అడ్డుకోవడం, ఒంగోలు డీఎస్పీ పోస్టింగ్‌లో తన పేరు చెల్లుబాటుకాకపోవడంతో.. ఇన్నేళ్లు వైఎస్ కుటుంబాన్ని నమ్ముకుని ఉన్నందుకు ఇదేనా ప్రతిఫలం అనుకునే వరకు వచ్చింది వివాదం. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసే వరకూ దారి తీసింది.

మరొకరైతే ఉంటే ఉండు.. పోతే పో.. అనేవారే జగన్. కోటంరెడ్డిలా వేటు వేసేవారే. కానీ, అక్కడున్నది బాలినేని. ఓవైపు బంధువు, మరోవైపు ఉమ్మడి జిల్లాల్లో చక్రం తిప్పగల సత్తా ఉన్న నాయకుడు. అంతఈజీగా వదులుకోలేరు. ఆయన్ను కాదని జిల్లాలో రాజకీయం చేయలేరు. అందుకే, తనశైలికి భిన్నంగా ఎప్పటికప్పుడు బాలినేనిని బుజ్జగించే ప్రయత్నమే చేశారు జగన్. కానీ, ఈయన వింటేగా!

మరోవైపు, గోనె ప్రకాశరావు గిల్లడంతో ఇక తట్టుకోలేకపోయారు. గోనెతో వైవీనే మాట్లాడించారని ఆరోపించారు. తాను పార్టీ మారేది లేదని తేల్చిచెప్పారు. వైఎస్ కుటుంబ విధేయుడినంటూ నొక్కిచెప్పారు. మీడియా ముందుకొచ్చి మరీ ఏడ్చారు. బాలినేని అంతటి నాయకుడి కళ్లలో నీళ్లు తిరగడం చూసి.. సీఎం జగన్ సైతం కరిగిపోయినట్టున్నారు. పాపం.. పోనీలే అనుకున్నట్టున్నారు. ఒంగోలు డీఎస్పీ అశోక్‌వర్థన్‌ను బదిలీ చేసి.. బాలినేనికి బహుమతిగా ఇచ్చారు. ఏ డీఎస్పీ పోస్టింగ్ కోసం అయితే బాలినేని హర్ట్ అయ్యారో.. ఇప్పుడా ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. మరి, బాలినేని కూల్ అవుతారా? డీఎస్పీ ట్రాన్స్‌ఫర్‌తో సరిపెట్టుకుంటారా? తనపై కుట్ర చేశారని భావించిన వైవీ, సజ్జలను.. జగన్ ముఖం చూసి వదిలేస్తారా? ఎప్పటిలానే పార్టీలో కలిసిపోతారా? జిల్లా నేతలను కలుపుకొనిపోతారా? ఎంతైనా.. జగన్‌ను ధిక్కరించి.. జగనే తలవంచేలా చేసిన పొలిటికల్ హీరో మా వాసన్న..అంటున్నారు అభిమానులు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News