China Basketball Player: ప్రేమలో ఉన్న యువతి యువకులు తమ ప్రియమైన వ్యక్తుల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడటాన్ని మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం, వ్యతిరేక శక్తుల్ని ఎదిరించడం, మరేదైనా సరే.. తమకు చేతనైనంత కృషి చేస్తారు. ప్రేమ కోసం, ప్రేమించిన వారి కోసం ఒక్కొక్కరు ఒక్కో రకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తాము ప్రేమించిన వారిని తమ వైపు ఆకర్షించుకునేందుకు వివిధ రకాల తంటాలు పడుతూనే ఉంటారు.
Also Read: Gary Hall Jr Olympic Medals: 10 పతకాలు కాలి బూడిద… ఒలింపిక్ స్విమ్మర్ కు ఎన్ని కష్టాలో !
ప్రేమ.. మనిషి చేత ఎంతటి పనైనా చేయిస్తుంది. అందుకే అంటారేమో.. నిజమైన ప్రేమికులు ప్రపంచంతోనైనా పోరాడేందుకు సిద్ధపడతారని. ప్రేయసి కోసం ప్రియుడు చేసే కొన్ని కొన్ని పనులు అప్పుడప్పుడు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. తన గర్ల్ ఫ్రెండ్ కోసం ఓ బాస్కెట్ బాల్ ప్లేయర్ చేసిన ఈ వింత పని నెట్టింట వైరల్ గా మారింది. మ్యాచ్ కి ముందు ఆమెతో గడిపేందుకు ఏకంగా సూట్ కేస్ లోనే ఆమెను పెట్టి దొంగ చాటుగా టీమ్ డార్మెటరీలోకి తీసుకువెళ్లాడు.
అయితే ఈ విషయం బయటకి రావడంతో అతడు సస్పెండ్ కి గురయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చైనీస్ బాస్కెట్ బాల్ ప్లేయర్ ఝాంగ్ జింగ్ లియాంగ్ గత కొంతకాలంగా ఓ అమ్మాయితో రిలేషన్ షిప్ లో ఉన్నాడు. అతడు ఓ మ్యాచ్ ఆడడానికి వెళ్లాల్సిన సందర్భంలో తన గర్ల్ ఫ్రెండ్ ని సూట్ కేసులో పెట్టి తన టీమ్ డార్మిటరీ లోకి ఎవరు చూడకుండా దొంగ చాటుగా తీసుకువెళ్లాడు. ఈ విషయం ఎక్కడా బయటపడలేదు కానీ.. ఈ విషయాన్ని అతని గర్ల్ ఫ్రెండ్ స్వయంగా సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడంతో అతడు దొరికిపోయాడు.
తాను సూట్ కేస్ లోనే పడుకోవడంతో పాటు కొన్ని హోమ్ వర్క్ షీట్స్ తో ఉన్నట్లు ఫోటో దిగి పోస్ట్ చేసింది అతని గర్ల్ ఫ్రెండ్. కానీ తన పొరపాటున తెలుసుకుని వెంటనే ఆ పోస్ట్ ని డిలీట్ చేసింది. ఈ ఏడాది జనవరి 5వ తేదీన జరిగిన ఓ మ్యాచ్ సమయంలో అతడు ఇలా చేసినట్లు తెలిపింది. అయితే ఈ విషయం బయటకి రావడంతో ఝాంగ్ ప్రాతినిథ్యం వహిస్తున్న (Guangzhou loong lions) క్లబ్ అతడిని సస్పెండ్ చేసింది. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో అతడి నుంచి వివరణ కోరింది.
Also Read: Mohammed Shami: ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్..షమీ,నితీష్ కు ఛాన్స్… వైస్ కెప్టెన్ గా అక్షర్ పటేల్!
అయితే తన ప్రేయసికి హోంవర్క్ విషయంలో హెల్ప్ చేసేందుకు, నైట్ స్టడీస్ కోసం ఇలా సూట్ కేసులో తీసుకువెళ్లినట్లు అతడు తెలిపాడు. ఈ విషయాన్ని క్లబ్ ఓ స్టేట్మెంట్ ద్వారా రిలీజ్ చేసింది. అతడు చేసిన ఈ నిర్వాకం వల్ల అతడిని బ్యాన్ చేయాలని నిర్ణయించుకున్నామని.. అతడు ప్రారంభ మ్యాచ్ లకు దూరంగా ఉండేలా తక్షణమే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మొత్తానికి ప్రేయసి కోసం అతడు చేసిన ఈ సాహసం అతడి కెరీర్ పైనే ప్రభావాన్ని చూపించింది.
On January 8, 2025, Chinese basketball player Zhang Xingliang from Guangzhou was suspended for violating club regulations after hiding his girlfriend in a suitcase and bringing her back to the dormitory to study English overnight before a game. pic.twitter.com/qnxtrADt8Q
— Share Chinese Douyin(TikTok) videos (@cz8921469_z) January 9, 2025