TET Exam: తెలంగాణ టెట్ ఎగ్జామ్స్ కొనసాగుతున్నాయి. జనవరి 2 నుంచి టెట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. టీచర్ పోస్టుల భర్తీలో టెట్ మార్కులకు వెయిటేజీ ఉంటుంది. ప్రతి ఏడాది టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలంగాణలో టెట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో టెట్ పరీక్షలు రెండు సెషన్లలో ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకు పరీక్ష జరగుతున్నాయి.
ఈసారి మొత్తం టెట్ పరీక్షల కోసం మొత్తం 2,48,172 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులోనూ పేపర్-1కు 71,655 అప్లికేషన్లు రాగా… పేపర్-2కు 1,55,971 అప్లికేషన్లు వచ్చాయి. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 91 7075028882 / 85 నెంబర్లను సంప్రదించవచ్చు. ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఈ నెంబర్లు అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 5వ తేదీన టెట్ తుది ఫలితాలను ప్రకటిస్తారు.
Also Read: NPCIL Jobs: ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి.. లాస్ట్ డేట్ ఇదే..
అయితే.. తెలంగాణలో ఇవాళ నిర్వహిస్తోన్న టెట్ ఎగ్జామ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీలో సాయంత్రం 4:30 గంటలకు ముగియాల్సిన టెట్ ఎగ్జామ్ రాత్రి 7:30 గంటలు దాటినా కొనసాగింది. వివరాల ప్రకారం సెకండ్ సెషన్‌లో మధ్యాహ్నం 2గంటలకు మొత్తం 750 మంది పరీక్ష రాయాల్సి ఉండగా.. 467 మంది మాత్రమే0 హాజరయ్యారు. సర్వర్ డౌన్ కారణంగా 150 మంది అభ్యర్థులకు టెట్ పరీక్ష నిలిచిపోయింది. దీంతో పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థుల కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థులకు మద్దతుగా వారి కుటుంబ సభ్యులు శంషాబాద్- షాబాద్ రహదారిపై ధర్నా చేశారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు చాలాసేపు కష్టపడి.. సమస్యను సరిచేశారు. అనంతరం పరీక్షను మళ్లీ ప్రారంభించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.