CHRIS GAYLE: సౌత్ ఆఫ్రికా – జింబాబ్వే మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా సౌత్ ఆఫ్రికా తాత్కాలిక కెప్టెన్ వియాన్ ముల్డర్ తీసుకున్న ఓ నిర్ణయం ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ అయిన {400*} పరుగులను అధిగమించేందుకు అవకాశం ఉన్నప్పటికీ.. దానిని వదులుకున్నాడు వియాన్ ముల్డర్. తన స్కోర్ {367*} వద్ద ఉన్నప్పుడు అనూహ్యంగా ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేశాడు. టెస్టుల్లో బ్రియాన్ లారా అత్యధిక {400*} పరుగులు చేశాడు. ఈ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉన్నప్పటికీ.. ముల్డర్ మాత్రం ఆ అవకాశాన్ని తీసుకోలేదు.
Also Read: SKY – Wimbledon: కోహ్లీ బాటలో సూర్య ఫ్యామిలీ.. క్యూట్ ఫోటోలు వైరల్
“లారా” రికార్డ్ అందుకే బ్రేక్ చేయలేదు:
రెండవ రోజు ముగిసిన అనంతరం ఈ విషయంపై ముల్డర్ మాట్లాడుతూ.. ” వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా గతంలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ లో 400* పరుగులు చేశాడు. ఈ రికార్డ్ ఎంతో ప్రత్యేకం. అందుకే నేను ఈ రికార్డుని బ్రేక్ చేయాలనుకోలేదు. కొన్ని రికార్డులు అలా ఉంటేనే బాగుంటాయి. లారా రికార్డ్ కూడా అలాంటిదే. ఆ రికార్డు అలానే ఉండాలి. అందుకే ఇన్నింగ్స్ డిక్లేర్ చేశా. నాకు మరోసారి 400 పరుగులు చేసేందుకు అవకాశం వచ్చినా వదులుకుంటాను. మా జట్టు హెడ్ కోచ్ తో చర్చించిన తర్వాతే ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేశా” అని తెలిపాడు ముల్డర్.
ముల్డర్ భయపడ్డాడన్న గేల్:
ఇదే విషయంపై వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఓ రేడియో షో లో గేల్ మాట్లాడుతూ.. ” నాకు ఇలాంటి అవకాశం వస్తే 400 పరుగులు చేయడానికి కచ్చితంగా ప్రయత్నిస్తాను. ఎందుకంటే అలాంటి అవకాశాలు పదేపదే రావు. ముల్డర్ ఆ రికార్డు లారా పేరు పైనే ఉండాలని కోరుకున్నాడు. కానీ నా దృష్టిలో అది సరైన నిర్ణయం కాదు. బహుశా ఆ స్థితిలో అతడు ఒత్తిడికి, భయాందోళనకు గురై ఉంటాడు. అతడు భయపడి రికార్డ్ బ్రేక్ చేయకుండా తప్పు చేశాడు ” అని గేల్ చెప్పుకొచ్చాడు.
Also Read: Kohli – Avneet kaur: విరాట్ కోహ్లీని నీడలా వెంటాడుతున్న ఆ అందాల తార… షాక్ లో అనుష్క శర్మ
ఇక ముల్డర్ తీసుకున్న ఈ నిర్ణయం పై కొంతమంది ప్రశంసలు కురిపించినా.. మరికొందరు మాత్రం నిరాశకు గురయ్యారు. ఇక ఈ మ్యాచ్ లో కెప్టెన్ ముల్డర్ అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శన, అందులో ఓ మర్చిపోలేని ట్రిపుల్ సెంచరీ ఈ మ్యాచ్ కే హైలెట్ గా చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా వెనకబడి ఉన్న సౌత్ ఆఫ్రికా టెస్ట్ క్రికెట్ జట్టు బలంగా పుంజుకుంటుంది. ఈ రెండవ టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించడంతో.. వరుసగా పది టెస్ట్ విజయాలు సాధించింది. ఇది సౌత్ ఆఫ్రికా క్రికెట్ చరిత్రలో మొదటిసారి. ఇక ఈ మ్యాచ్ లో 367 పరుగులు చేసిన ముల్డర్.. 49 ఫోర్లు, నాలుగు సిక్స్ లు బాదాడు. ఇది ముల్డర్ కి మొదటి ట్రిపుల్ సెంచరీ. అలాగే సౌత్ ఆఫ్రికా కెప్టెన్లలో ఇది అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనలలో ఒకటిగా నిలిచింది.