Kohli – Avneet kaur: ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతడి భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ.. ఈ వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ లను వీక్షించేందుకు హాజరయ్యారు. జూలై 7 సోమవారం రోజున 24 గ్రాండ్ స్లామ్స్ వీరుడు నోవాక్ జొకోవిచ్ వింబుల్డన్ మ్యాచ్ చూసేందుకు ఈ ఇద్దరు హాజరయ్యారు. ఈ క్రమంలో సెంటర్ కోర్టు రౌండ్ ఆఫ్ 16 లో జరిగిన ఉత్కంఠ భరితమైన పోరులో డి మినౌర్ పై.. జొకోవిచ్ విజయం సాధించాడు.
Also Read: Sara Tendulkar: కొత్త ప్రియుడుతో విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న సచిన్ కూతురు సారా… షాక్ లో గిల్!
జొకోవిచ్ కి కోహ్లీ ప్రశంసలు:
ఇక ఈ మ్యాచ్ అనంతరం జోకొవిచ్ ని కోహ్లీ ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. ” ఇలాంటి అద్భుతమైన మ్యాచులు జోకోవిచ్ కే సాధ్యం. నేను కొంతకాలంగా నోవాక్ తో టచ్ లో ఉన్నాను. మేము మెసేజ్ లు చేసుకుంటాం. ఈ వింబుల్డన్ ఫైనల్స్ లో నోవాక్, కార్లోస్ ఫైనాన్స్ లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. బహుశా నోవాక్ ఈ టైటిల్ గెలవాలని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు విరాట్. ఇక విరాట్ – అనుష్క ఈ వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ కి హాజరైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వీరి ఫోటోలు మాత్రమే కాకుండా.. ఈ వింబుల్డన్ చాంపియన్షిప్ నీ వీక్షించేందుకు అవనీత్ కౌర్ కూడా హాజరైంది. దీంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కోహ్లీని నీడలా వెంటాడుతున్న అందాల తార?
కొద్ది రోజుల క్రితం నటి అవనీత్ కౌర్ ఫోటోకి.. విరాట్ కోహ్లీ ఇంస్టాగ్రామ్ లో లైక్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విరాట్ కోహ్లీ ఓ అమ్మాయి ఫోటోకు లైక్ చేయడం ఏంటి..? అని అంతా ఆశ్చర్యపోయారు. ఇది కూడా అనుష్క శర్మ పుట్టినరోజునే చోటు చేసుకోవడంతో విరాట్ కోహ్లీ ఈ వివాదంలో ఇరుక్కున్నాడు. దీంతో ఆమెపై కోహ్లీ మనసు పారేసుకున్నాడా..? అని తప్పుగా కూడా అర్థం చేసుకున్నారు. ఇది కాస్త వైరల్ గా మారడంతో.. దీనిపై కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు. ఇది ఇంస్టాగ్రామ్ అల్గారిథమ్ తప్పు కారణంగా జరిగిందని, దీని వెనుక మారెలాంటి ఉద్దేశం లేదని పేర్కొన్నాడు.
అంతే కాకుండా ఈ విషయంపై ఎలాంటి ఊహగానాలు ప్రచారం చేయవద్దని కూడా కోరాడు. అయితే ఇప్పుడు అవనీత్ కౌర్.. విరాట్ కోహ్లీ హాజరైన వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ కి హాజరు కావడంతో.. ఈమె విరాట్ కోహ్లీని ఫాలో అవుతుందని, నీడలా కోహ్లీ నీ వెంటాడుతుందని, అనుష్క శర్మ షాక్ లో ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అవనీత్ కౌర్ విషయానికి వెళితే.. ఈమె భారతీయ టెలివిజన్, సినీ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతోంది. ఈ ముద్దుగుమ్మ డ్యాన్స్ ఇండియా డ్యాన్స్, లిటిల్ మాస్టర్స్, జలక్ దిక్లాజా 5, సావిత్ర ఏక్ ప్రేమ్ కహాని, హమారీ సిస్టర్ దీదీ వంటి టెలివిజన్ రియాలిటీ షోల ద్వారా పాపులారిటీ సంపాదించింది. ఇక రాణి ముఖర్జీ నటించిన మర్దని మూవీ ద్వారా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. పలు సినిమాలలోను నటించి మంచి పేరు సంపాదించింది.