Hyderabad news: హైదరాబాద్ సిటీలో దారుణం జరిగింది. అల్లారు ముద్దుగా కొడుకుని పెంచాల్సిన కన్నతండ్రి, అత్యంత పాశవికంగా చంపేశాడు. బాలుడి మృతదేహాన్ని మూసీ కాలువలో పడేశాడు. పైకి ఏమీ తెలీదన్నట్టుగా బాబు కనిపించలేదంటూ డ్రామా క్రియేట్ చేశాడు. అడ్డంగా బుక్కయ్యాడు. అసలేం జరిగింది? ఇంకా లోతుల్లోకి వెళ్తే..
హైదరాబాద్ సిటీలోని పాతబస్తీ బండ్లగూడ ప్రాంతంలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. కొన్నాళ్లుగా నివాసం ఉంటున్నాడు మహమ్మద్ అక్బర్. అతడికి రెండేళ్లన్నరేళ్ల కొడుకు ఉన్నాడు. అల్లారు ముద్దుగా బాలుడ్ని పెంచాల్సిన తండ్రి యముడిగా మారాడు. అనారోగ్యంతో కొన్నాళ్లుగా బాలుడు బాధపడుతున్నట్లు సమాచారం. ఈ సమస్య గురించి గట్టెక్కాలంటే ఒక్కటే మార్గమని భావించాడు.
చివరకు కొడుకుని చంపేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావించాడు. మనసులో వచ్చిన ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేశాడు. బాలుడి ఇంట్లోనే చంపేసి, మృతదేహాన్ని సంచిలో పెట్టాడు. రాత్రివేళ సంచిని తీసుకెళ్లి నయా పుల్ బ్రిడ్జి పైనుంచి మూసీ కాలువలో పడేశాడు కన్న తండ్రి. పైకి ఏమీ తెలియదన్నట్లుగా బాబు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇంట్లోవారి నుంచి ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా తెలివిగా గేమ్ మొదలుపెట్టాడు. అయితే అక్బర్ మాటలపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో తమదైన శైలిలో పోలీసులు విచారణ చేపట్టారు. చివరకు నిజం ఒప్పుకున్నాడు తండ్రి అక్బర్. బాలుడి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టిన బండ్లగూడ పోలీసులు-హైడ్రా-NDRF టీమ్స్. మూసీ కాలువ అంతా గాలింపు ముమ్మరం చేశాయి.
ALSO READ: గుంటూరు విషాదం.. పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి
పైకి మాత్రం బాలుడికి అనారోగ్యం సమస్యలని చెబుతున్నాడు నిందితుడు. ఇరుగుపొరుగు మారు మాత్రం ఫ్యామిలీ సమస్యలు కారణమని అంటున్నారు. గత రాత్రంతా మూసి నదిలో గాలించారు పోలీసులు. ఎక్కడా బాబు మృతదేహం లభించలేదు. ఇవాళ మరోసారి మూసీ అంతటా గాలిస్తున్నారు పోలీసులు. మరి పోలీసుల విచారణలో అక్బర్ ఇంకెన్ని విషయాలు బయట పెడతాడో చూాడాలి.
అమానుషం.. కొడుకును చంపేసి మూట కట్టి మూసీలో పడేసిన తండ్రి
హైదరాబాద్ పాతబస్తీ-బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం
అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న కొడుకుని హత్య చేసిన తండ్రి మహమ్మద్ అక్బర్
అనంతరం బాలుడి మృతదేహాన్ని సంచిలో తీసుకెళ్లి నయా పుల్ బ్రిడ్జి పైనుంచి మూసీలో పడేసిన… pic.twitter.com/Z1AhJRxK1S
— BIG TV Breaking News (@bigtvtelugu) September 14, 2025