Chris Woakes : టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs England) మధ్య నిన్న నాలుగవ టి20 ( India tour of England, 2026) బ్రిస్టల్ వేదికగా (County Ground, Bristol) జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో కూడా టీమిండియా అత్యంత దారుణంగా ఓడిపోయింది. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో చిత్తు అయింది. నిన్నటి మ్యాచ్ లో టీమిండియా 158 పరుగులు చేస్తే… ఇంగ్లాండ్ 13 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ చేసింది. అంత భయంకరంగా ఇంగ్లాండ్ ఆటగాళ్లు రెచ్చిపోయారు. ఎలాంటి బంతులు వేసిన అవలీలగా సిక్సర్లు లేదా బౌండరీలు కొట్టేశారు. ఈ క్రమంలో తొలిసారిగా ఇంగ్లాండ్ గడ్డపై టి20 సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది. అయితే టీమిండియా వరుస ఓటమిల నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ క్రిస్ వోక్స్ (Chris Woakes) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గెలుపు కోసం మా ముందు టీమిండియా బిక్షాటన చేస్తోందంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇంగ్లాండ్ తో ఆడాలంటేనే టీమిండియా గజ గజ వణికిపోతోందని బాంబ్ పేల్చారు. దీంతో వోక్స్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇంగ్లాండ్ చేతిలో టీం ఇండియా వరుస మ్యాచ్ లలో ఓడిపోయిన తరుణంలో మాజీ క్రికెటర్ క్రిస్ వోక్స్ సంచలనం వ్యాఖ్యలు చేశారు. టీమిండియా గెలుపు కోసం పోరాడుతూనే ఉందని హేళన చేశారు. ఇంగ్లాండ్ పైన గెలిచేందుకు భిక్షాటన చేస్తోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొనేందుకు గజగజ వణికిపోతున్నారని చురకలు అంటించారు. గతంలో టీమిండియా పై తాను చాలా మ్యాచులు ఆడాను అని వెల్లడించారు. కానీ అప్పుడు టీమిండియా చాలా బలంగా ఉండేదని తెలిపారు. గతంలో కంటే ఇప్పుడు టీమిండియా చాలా బలహీనంగా కనిపిస్తోందని హేళన చేశారు.
ఒక్క మ్యాచ్ గెలుపు కోసం చాలా కష్టపడుతున్నారని వివరించారు. కానీ ఇంగ్లాండ్ మైదానాలలో ఆడలేక పోతున్నారని పరువు తీశారు. గెలుపు కోసం ఇంగ్లాండును బతిలాడాల్సిన పరిస్థితి వచ్చిందని దారుణంగా కామెంట్ చేశారు. ఇంత జరుగుతున్న బీసీసీఐ ఏం చేస్తుందో తనకు అర్థం కావడం లేదని సెటైర్లు పిలిచారు. టీమిండియా మళ్లీ విజయాల బాట పట్టాలంటే గౌతం గంభీర్, శ్రేయస్ అయ్యర్ ను పక్కకు పెట్టాలని డిమాండ్ చేశారు. సంజు శాంసన్ ను పర్మనెంట్ కెప్టెన్ చేయాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ క్రిస్ వోక్స్ (Chris Woakes) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాగా ఇంగ్లాండ్ సిరీస్ లో 3-0 తేడాతో టీమిండియా సిరీస్ కోల్పోయింది.