E-Paper
Advertisement

వర్షాకాలంలో వైరల్ ఫీవర్, ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం.. ఈ 6 హెల్త్ టిప్స్ పాటించడం తప్పనిసరి

వర్షాకాలంలో వైరల్ ఫీవర్, ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం.. ఈ 6 హెల్త్ టిప్స్ పాటించడం తప్పనిసరి
Advertisement

వర్షాలు వేసవి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ సీజన్ మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకువస్తుంది. అయితే ఈ కాలంలో వైరస్‌లు, బ్యాక్టీరియా వేగంగా వ్యాపించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. గాలిలో తేమ పెరగడం, నీరు నిల్వ ఉండటం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే కొన్ని సాధారణ జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్యల నుంచి చాలా వరకు రక్షణ పొందవచ్చు.

చేతులు శుభ్రంగా ఉంచండి

వైరల్ ఇన్‌ఫెక్షన్లను నివారించడానికి చేతుల పరిశుభ్రత చాలా ముఖ్యమైనది. బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే, భోజనం చేసే ముందు, టాయిలెట్ నుంచి వచ్చని వెంటనే కనీసం 20 సెకన్ల పాటు సబ్బుతో చేతులు కడగాలి. సబ్బు, నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించాలి. శుభ్రం చేయని చేతులతో ముఖాన్ని తాకకుండా ఉండాలి.

తడిసిన బట్టలను వెంటనే మార్చండి

Advertisement

వర్షంలో తడిసిన తర్వాత ఎక్కువసేపు తడి బట్టలతో ఉండకూడదు. అలాంటి పరిస్థితి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి అనారోగ్యానికి దారితీయవచ్చు. ఇంటికి చేరుకున్న వెంటనే పొడి బట్టలు ధరించాలి. అవసరమైతే గోరువెచ్చని నీటితో స్నానం చేసి జుట్టును బాగా ఆరబెట్టుకోవాలి.

తాజా, పరిశుభ్రమైన ఆహారం మాత్రమే తినాలి

వర్షాకాలంలో బయట దొరికే కట్ చేసిన పండ్లు, స్ట్రీట్ ఫుడ్, ఎక్కువసేపు బయట ఉంచిన ఆహారాన్ని తినకుండా ఉండాలి. ఇంట్లో తాజాగా తయారుచేసిన ఆహారాన్నే తీసుకోవడం మంచిది. కాలానుగుణ పండ్లు, ఆకుకూరలు, పప్పులు, ధాన్యాలు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

శుభ్రమైన నీరు మాత్రమే తాగాలి

Advertisement

వర్షాకాలంలో దాహం తక్కువగా అనిపించినా శరీరానికి నీరు అవసరం తగ్గదు. రోజంతా తగినంత శుభ్రమైన నీటిని తాగాలి. వీలైతే మరిగించిన లేదా ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే ఉపయోగించాలి. ఈ జాగ్రత్త చాలా ముఖ్యం. ఎందుకంటే అధిక శాతం వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు నీటి ద్వారానే వస్తాయి.

తగిన నిద్రతో పాటు వ్యాయామం చేయండి

ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల పాటు నాణ్యమైన నిద్ర అవసరం. అలాగే రోజుకు కనీసం 20 నుంచి 30 నిమిషాలు నడక, యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేయాలి. ఈ అలవాట్లు శరీరాన్ని బలంగా ఉంచి ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తిని పెంచుతాయి.

Also Read: పిల్లలు జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా? ఈ రుచికరమైన హెల్తీ స్నాక్స్‌తో సమస్యకు చెక్

పరిశుభ్రతను అలవాటుగా మార్చుకోండి

ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నిల్వ ఉన్న నీటిలో దోమలు ఎక్కువగా పెరుగుతాయి. దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు నోరు, ముక్కును కప్పుకోవాలి. ఉపయోగించిన టిష్యూలను వెంటనే చెత్త బుట్టలో వేయాలి. ఈ చిన్న అలవాట్లు మీ ఆరోగ్యంతో పాటు ఇతరుల ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. ఇన్‌ఫెక్షన్లు, సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ ఇస్తాయి.

Related News

ఫిష్ ప్రియులు ‘కరిమీన్ పొల్లిచాతు’ ఇలా ట్రై చేయండి.. ఈ రుచిని అస్సలు మర్చిలేపోరు!

మటన్ ప్రియుల కోసం గుంటూరు స్పెషల్ గోంగూర మటన్.. తయారీ విధానం ఇదిగో!

నోరూరించే కోనసీమ పీతల పులుసు.. ఈ పల్లెటూరి పద్ధతిలో చేసుకుంటే లొట్టలేసుకుంటూ తింటారు!

అచ్చమైన పల్లెటూరి రుచిలో..ఘుమఘుమలాడే ఎండుచేపల కూర!

చికెన్ లవర్స్ కోసం స్పెషల్ డిష్..రుచికరమైన వైట్ మలయ్ చికెన్ కర్రీ

ఈవినింగ్ స్నాక్స్‌కు పర్‌ఫెక్ట్ ..తిన్నాకొద్దీ తినాలనిపించే గుమగుమలాడే మసాలా వడ

‘నేను బాగానే ఉన్నా’ అన్న ప్రతీసారీ నమ్మకండి.. పిల్లల ఆ ప్రవర్తన వెనుక పెద్ద రహస్యమే ఉంది!

హెల్దీ రిలేషన్‌షిప్ అంటే ఇదే.. మీ ప్రేమ, పెళ్లి బంధంలో ఈ 7 లక్షణాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×