Mohammed Shami: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి కాంగ్రెస్ నాయకురాలు షామా మహమ్మద్ చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. షామా మొహమ్మద్ చేసిన ట్వీట్ పై సోషల్ మీడియాలో విమర్శలు, ఇటు బిజెపి నేతల కౌంటర్లతో ఫిట్నెస్ పాలిటిక్స్ పీక్స్ కి చేరాయి. మరోవైపు ఆమె చేసిన వ్యాఖ్యలపై బీసీసీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక కీలక టోర్ని మధ్యలో ఉన్నప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొంది.
Also Read: IPL Tickets Scam: SRH ఫ్యాన్స్ కు షాక్..ఐపీఎల్ టికెట్స్ సోల్డ్ ఔట్ !
వ్యక్తిగత ప్రచారం కోసం ఇలాంటి కామెంట్స్ చేయడం మానుకోవాలని బీసీసీఐ సూచించింది. ఇదిలా ఉంటే.. తాజాగా టీమిండియా క్రికెటర్ మొహమ్మద్ షమీ ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. మొహమ్మద్ షమీపై జమాత్ నేత షాబుద్దీన్ రిజ్వి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనియాంశంగా మారాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో మొహమ్మద్ షమీ ఎనర్జీ డ్రింక్ తాగారు.
ఇది గమనించిన ముస్లిం సంస్థలు మండిపడుతున్నాయి. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన వేల ఉపవాసం చేయకుండా షమీ పాపం చేశాడని.. అతడిని అల్లా తప్పకుండా శిక్షిస్తాడని రజ్వి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ తప్పు చేసిన షమీ దేవుడికి సమాధానం చెప్పాలని కీలక వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు తీవ్ర స్థాయిలో అగ్రహం వ్యక్తం చేశారు.
షమీ ఎంజాయ్ చేయడానికి దుబాయ్ వెళ్లలేదని.. అతడు జాతీయ జట్టు కోసం కష్టపడుతున్నాడని, జట్టు ఫైనల్ కి వచ్చిన వేల ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని మండిపడుతున్నారు. మరోవైపు రజ్వి వ్యాఖ్యలపై షమీ కుటుంబ సభ్యులు కూడా స్పందించారు. భారత జట్టు ఓటమిని కోరుకునే వారే ఇలా మాట్లాడతారని, అలా అయితే పాకిస్తాన్ ఆటగాళ్లలో చాలామంది ఉపవాసం ఉండడం లేదని మండిపడ్డారు.
దేశం కోసం ఆడుతున్న వ్యక్తి పట్ల ఇలా మాట్లాడడం సరైనది కాదని అన్నారు షమీ కుటుంబ సభ్యులు. అయితే రోహిత్ శర్మ పై వివాదాస్పద ట్వీట్ చేసిన షామా మొహమ్మద్.. మహమ్మద్ షమీ కి మాత్రం మద్దతు తెలిపింది. షమీని టార్గెట్ చేసిన మౌల్విపై కూడా విరుచుకుపడింది. తాజాగా షామా మొహమ్మద్ మాట్లాడుతూ.. ” ఇస్లాంలో ఉపవాసాలకు మినహాయింపు ఉండదు. ముఖ్యంగా ప్రయాణాలు చేసే వారికి, శారీరకంగా అలసిపోయే కార్యకలాపాలలో నిమగ్నమైన వారికి మినహాయింపు ఉండదు.
ఇస్లాంలో రంజాన్ సందర్భంగా తెలుసుకోవలసిన చాలా ముఖ్యమైన విషయం ఉంది. మనం ప్రయాణించేటప్పుడు ఉపవాసం ఉండనవసరం లేదు. మహమ్మద్ షమీ పర్యటనలో ఉన్నాడు. అతడు ఇంట్లో లేడు. చాలా దాహం వేసే ఆట ఆడుతున్నాడు. అందువల్ల క్రీడలు వాడుతున్నప్పుడు ఉపవాసం ఉండాలని ఎవరు గట్టిగా చెప్పరు. మీ పని చాలా ముఖ్యం. ఇస్లాం చాలా శాస్త్రీయ మతం” అంటూ షమీని సమర్థించారు షామా మొహమ్మద్.
#WATCH | Delhi | On Indian cricketer Mohammed Shami, Congress leader Shama Mohamed says, "…In Islam, there is a very important thing during Ramzan. When we are travelling, we don't need to fast (Roza), so Mohammed Shami is travelling and he's not at his own place. He's playing… pic.twitter.com/vdBttgFbRY
— ANI (@ANI) March 6, 2025