BigTV English

Vinesh Phogat: వినేష్ ఫోగట్ అప్పీలుపై తీర్పు రేపటికి వాయిదా

Vinesh Phogat: వినేష్ ఫోగట్ అప్పీలుపై తీర్పు రేపటికి వాయిదా

Paris Olympics 2024: భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ సిల్వర్ మెడల్ కోసం దాఖలు చేసిన అప్పీల్‌పై కోర్టు తీర్పు రేపటికి వాయిదా పడింది. శనివారం రాత్రి 9.30 గంటల్లోపు తీర్పు వస్తుందని ముందు చెప్పారు. కానీ, ఈ తీర్పు రేపటికి వాయిదా పడింది. రేపు సాయంత్రం 6 గంటల్లోపు వినేష్ ఫోగట్ అప్పీల్ పై నిర్ణయాన్ని క్రీడా ఆర్బిట్రేషన్ కోర్టు వెల్లడించనుంది.


వినేష్ ఫోగట్ అప్పీలుపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్(సీఏఎస్) అడ్ హక్ డివిజన్ నిర్ణయాన్ని రేపు సాయంత్రం 6 గంటల వరకు వాయిదా వేశారు. వినేష్ ఫోగట్ వర్సెస్ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వివాదంపై నిర్ణయాన్ని వెల్లడించనుంది. హేతుబద్ధమైన ఆదేశాలను తదుపరి తేదీన జారీ చేస్తారు.

అయితే, ఈ తీర్పును రేపే వెల్లడించకపోవచ్చని తెలుస్తున్నది. పారిస్ ఒలింపిక్స్ క్రీడలు ముగిసిన రెండు రోజుల తర్వాత ఆగస్టు 13వ తేదీ వెల్లడించవచ్చునని ఐవోఏ వర్గాలు వివరించాయి.


Also Read: Covid: బీ కేర్‌ఫుల్.. కరోనా కేసుల మళ్లీ పెరుగుతున్నాయి: డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్

ఒలింపిక్ మహిళ రెజ్లింగ్ క్రీడల్లో ఫైనల్‌లోకి చేరిన వినేష్ ఫోగట్ 200 గ్రాముల అధికంగా బరువు ఉన్నారన్న కారణంతో ఆమెపై అనర్హత వేటు వేశారు. ఫైనల్‌లో ఓడినా వినేష్‌కు సిల్వర్ మెడల్ లభించేది. కానీ, అనర్హత వేటు కారణంగా ఏ మెడల్‌ కూడా ఆమెకు దక్కలేదు. ఈ నేపథ్యంలోనే ఆమె కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ కోర్టులో తనకు సిల్వర్ మెడల్ అయినా అందించాలని అప్పీల్ దాఖలు చేశారు.

Related News

Asia Cup : ఆసియా కప్ లో ఎక్కువ మ్యాచ్ లు గెలిపించిన తోపు కెప్టెన్లు వీళ్లే… ధోనినే రియల్ మొనగాడు

CSK Vs RCB : అరేయ్ ఏంట్రా ఇది… గణపతి విగ్రహాలతో CSK vs RCB మ్యాచ్… వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే

Oshane Thomas : ఒకే ఒక్క బంతికి 15 పరుగులు, మరోసారి 22 పరుగులు… ఎవడ్రా ఈ థామస్.. ఇంత చెత్త బౌలింగ్ ఏంటి

Virender Sehwag son : సెహ్వాగ్ కుమారుడి బ్యాటింగ్ చూశారా.. తండ్రిని మించిపోయి ఆడుతున్నాడుగా.. ఇదిగో వీడియో

Mohammed Shami : నేను రిటైర్మెంట్ ఇవ్వను.. ఆసియా కప్ 2025 లో ఆడి తీరుతా.. బీసీసీఐకి షమీ వార్నింగ్

Ind vs Pak : “బై కాట్” సోనీ స్పోర్ట్స్‌.. టీమిండియా అభిమానులు సీరియస్

Big Stories

×