BigTV English

Covid: బీ కేర్‌ఫుల్.. కరోనా కేసుల మళ్లీ పెరుగుతున్నాయి: డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్

Covid: బీ కేర్‌ఫుల్.. కరోనా కేసుల మళ్లీ పెరుగుతున్నాయి: డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్

World Health Organisation: కరోనా కేసుల కథ ముగిసిందని అనుకుంటున్నారా? ఇక కొవిడ్ బయాలేవీ లేవని భావిస్తున్నారా? అయితే, మీరు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు చదవాల్సిందే. గత కొన్ని వారాలుగా 84 దేశాల్లో కరోనా కేసుల శాతం పెరుగుతూ వస్తున్నదని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. త్వరలోనే మరింత ప్రమాదకర కరోనా వేరియంట్లు ఉనికిలోకి వచ్చే ముప్పు ఉన్నదని వివరించింది. కొవిడ్-19 ఇంకా మనతోనే ఉన్నదని డబ్ల్యూహెచ్‌వోకు చెందిన డాక్టర్ మారియా వాన్ కేర్ఖోవ్ తెలిపారు.


‘మా నిఘా వ్యవస్థ సమాచారం ద్వారా తెలిసిందేమంటే.. 84 దేశాల్లో కరోనా కేసు రిపోర్టులు కొన్ని వారాలుగా పెరుగుతూ వస్తున్నాయి’ ఆమె వివరించారు. ‘మొత్తంగా, టెస్టు పాజిటివిటీ శాతం పదికి మించే ఉన్నది. ప్రాంతాన్ని బట్టి ఇది మారుతున్నది. యూరప్‌లో పాజిటివిటీ శాతం 20కిపైనే ఉన్నది’ అని కార్ఖోవ్ చెప్పారు. అమెరికా, యూరప్, పశ్చిమ పసిఫిక్ ప్రాంతాల్లో కరోనా కొత్త వేవ్‌లు వచ్చినట్టు డబ్ల్యూహెచ్‌వో ఈ ప్రకటనలో వివరించింది. వేస్ట్ వాటర్ సర్వెలెన్స్ మరో ఆందోళకర విషయాన్ని చెబుతున్నట్టు పేర్కొంది. బయట రిపోర్ట్ అవుతున్న కేసులకు రెండు నుంచి 20 రెట్లు అధికంగా ఈ వైరస్ సర్క్యులేషన్‌లో ఉన్నట్టు వేస్ట్ వాటర్ సర్వెలెన్స్ వివరిస్తున్నట్టు వెల్లడించింది.

సాధారణంగా శీతాకాలంలో జలుబు ఎక్కువగా వ్యాపిస్తుంది. ఇలాంటి కాలంలోనే కరోనా వైరస్ వ్యాప్తి కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ, ఇప్పుడు రుతువులకు అతీతంగా వైరస్ వ్యాప్తి చెందుతున్నదని డబ్ల్యూహెచ్‌వో వివరించింది. చాలా దేశాల్లో కరోనా కేసుల పెరుగుదల కనిపిస్తున్నదని, ఒలింపిక్స్‌లో కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్టు పేర్కొంది. ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి వచ్చిన కనీసం 40 మంది క్రీడాకారులకు కోవిడ్ లేదా శ్వాసకోశ సమస్యలు ఉన్నట్టు తేలిందని వివరించింది.


Also Read: Jammu Kashmir: అనంత్‌నాగ్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు సైనికులు మృతి

కాబట్టి, ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ ముప్పును నివారించే జాగ్రత్తలు పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. గత 12 నెలల్లో కరోనా టీకా డోసు వేసుకుని ఉండాలని తెలిపింది. ముఖ్యంగా కరోనా ప్రభావం అత్యధికంగా ఉండే రిస్క్ గ్రూపులకు చెందినవారైతే ఈ జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలని సూచించింది.

Related News

Putin Kim Jinping: ఒకే వేదికపై పుతిన్, కిమ్, జిన్ పింగ్.. చైనాలో ఈ ముగ్గురు ఏం చేయబోతున్నారంటే?

H1B New Rules: గ్రీన్ కార్డ్స్, వీసాలపై ట్రంప్ బాంబ్.. ఇండియన్స్ పై ఎలాంటి ప్రభావం పడుతుందంటే?

Nuke India: ‘ట్రంపును చంపాలి.. ఇండియాపై అణు బాంబు వెయ్యాలి.. అమెరికా షూటర్ గన్ పై సంచలన నినాదాలు

Kartarpur Corridor: పొంగిన రావి నది.. మునిగిన కర్తార్‌పూర్ కారిడార్.. నీటిలో వందలాది మంది

Minneapolis shooting: మినియాపొలిస్‌లో రక్తపాతం.. చర్చి స్కూల్‌పై రైఫిల్ దాడి.. అసలేం జరిగిందంటే?

Trump Statement: భారత్, పాక్ కి నేనే వార్నింగ్ ఇచ్చా.. మరింత గట్టిగా ట్రంప్ సెల్ఫ్ డబ్బా

Big Stories

×