Fire Accident: విలువైన కార్లు కాలి బూడిదైన ఘటన హరియాణా రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఓ కార్ల వర్క్ షాప్ లో ఈ ఘటన చోటు చేసుకుందని, వాటి విలువ రూ. కోట్లలోనే ఉంటుందని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వస్తున్న వార్తా కథనాల ప్రకారం.. గురుగ్రామ్ లోని సెక్టార్ 41ఏరియా మోతీ విహార్ ప్రాంతంలోని బెర్లిన్ మోటార్ వర్క్ షాపులో శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Also Read: వయనాడ్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. ఏం చెప్పారంటే?
ఆ సమయంలో వర్క్ షాప్ లో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే, ఖరీదైన కార్లు దగ్ధమయ్యాయి. సుమారు 16 లగ్జరీ కార్లు వర్క్ షాప్ లో పార్క్ చేశారని, అవన్నీ కూడా కాలి బూడిదయ్యాయని అక్కడి అగ్నిమాపక శాఖ అధికారులు పేర్కొన్నారు. వాటితోపాటు పలు పాత వాహనాలు కూడా దగ్ధమైనట్లు ఆయన తెలిపారు. ప్రమాదానికి సంబంధించి తమకు సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశామన్నారు.