Watch: మన ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఏ మూలకు వెళ్లినా.. ఏ గల్లి కి వెళ్లినా… క్రికెట్ మాత్రం కచ్చితంగా ఆడతారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇండియాలో క్రికెట్ ఆడతారు. క్రికెట్ ఆడడమే కాకుండా చూసే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. భారతదేశంలో… జాతీయ క్రీడ హాకీ అయినప్పటికీ… క్రికెట్ అంటేనే పడి చచ్చిపోతారు జనాలు. అంతలా జనాల రక్తాల్లోకి క్రికెట్ ఎక్కిపోయింది. అందుకే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లు చాలా సక్సెస్ అవుతున్నాయి. దానికి తగ్గట్టుగానే భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా గ్రౌండ్ స్థాయి క్రికెటర్లను కూడా… పైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. భారత ప్రభుత్వం కూడా క్రికెట్కు ప్రాధాన్యత ఇచ్చి అందరికీ ప్రోత్సాహాలు ఇస్తుంది.
Also Read: PBKS vs MI, Qualifier 2: ముంబై VS పంజాబ్ మ్యాచ్ కు వర్షం పడితే.. విజేత ఎవరు
ఇదెక్కడి సెలబ్రేషన్స్ రా… బట్టలు విప్పి మరి
ఒకపక్క ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో… ఇండియా వ్యాప్తంగా గల్లీ క్రికెటర్లు రెచ్చిపోతున్నారు. సమ్మర్ కావడంతో దేశవ్యాప్తంగా క్రికెట్ కూడా… విపరీతంగా ఆడుతున్నారు జనాలు. అయితే ఇలాంటి నేపథ్యంలో… ఓ బౌలర్ చేసిన రచ్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వికెట్ తీసిన ఆనందంలో… బట్టలు విప్పి మరి బ్యాటర్ పైకి రెచ్చిపోయాడు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఇండియాలో ప్రాంతం అయితే తెలియదు కానీ కొంతమంది యువ క్రికెటర్లు క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఈ సందర్భంగా… రెండు జట్లుగా విడిపోయి మ్యాచ్ ఆడారు. అయితే ఈ నేపథ్యంలోనే బౌలర్ వేసిన బంతికి 17 నెంబర్ జెర్సీ ఉన్న కుర్రాడు అవుట్ అయ్యాడు. నేరుగా వికెట్లకు వేయడంతో.. వికెట్ ఎగిరిపోయింది. అయితే.. వికెట్ కోల్పోయిన తర్వాత నిరాశలో ఉన్న బ్యాటర్ పైకి ఆ బౌలర్ రెచ్చిపోయాడు. తన షర్టు విప్పి మరి… అతని పైకి గొడవకు దిగాడు. ఇక చేసేదేమీ లేక బ్యాటర్ కూడా రివర్స్ కావాల్సి వచ్చింది.
ఏంట్రా నువ్వే బట్టలు విప్పుతావా? నేను కూడా విప్పి చూపించాలా అన్న రేంజ్ లో… కౌంటర్ ఇచ్చాడు బ్యాటర్. దీంతో అక్కడ ఉన్న వాళ్లంతా నవ్వుకున్నారు. అరే గల్లి క్రికెట్ లో ఇలాంటి గొడవలు ఏంట్రా అన్నట్లు రియాక్షన్స్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అన్న రేంజ్ లో… క్రికెట్ ఆడుతున్నారు ఏంట్రా అని ఫైర్ అవుతున్నారు జనాలు. బౌలర్ను పాకిస్తాన్ దేశస్తుడిగా భావిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. పిచ్చి లేసిన వాడిలా బౌలర్ బిహేవ్ చేస్తున్నాడని… మండిపడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్.
Also Read: RCB Fan: RCB టైటిల్ గెలవకపోతే.. సూ**సైడ్ చేసుకుంటా.. లేడీ సంచలన వీడియో
What kind of celebration is this ?😅
A must watch video 😂 pic.twitter.com/yFnVbozbQ5— Richard Kettleborough (@RichKettle07) May 31, 2025