Watch Video: బిగ్ క్రికెట్ లీగ్ టి-20 టోర్నీలో భాగంగా సూరత్ లోని లాల్ భాయ్ కాంట్రాక్టర్ స్టేడియంలో యూపీ బ్రిజ్ స్టార్స్ – ఎంపీ టైగర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. యూపీ బ్రిజ్ స్టార్స్ టీమ్ కి చెందిన బ్యాటర్ చిరాగ్ గాంధీ ఈ మ్యాచ్ లో 98 పరుగుల వ్యక్తిగత స్కోర్ తో సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు. ఆ సందర్భంలో ఎంపీ టైగర్స్ స్పిన్నర్ పవన్ నేగి బౌలింగ్ చేసిన ఓ డెలివరీ మిస్ అయ్యి స్టంప్స్ ని తాకింది. వెంటనే మధ్యప్రదేశ్ టైగర్స్ ప్లేయర్స్ సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు.
Also Read: Sanju Samson: శాంసన్‌కు మరో షాక్… మళ్లీ తొక్కేస్తున్నారు కదరా ?
కానీ ఆశ్చర్యం ఏంటంటే.. ఆ బంతి వికెట్లను తాకినప్పటికీ బెయిల్స్ కింద పడలేదు {Watch Video}. వికెట్ పక్కకు జరిగినప్పటికీ ఆశ్చర్యకరంగా బెయిల్స్ ఎగిరి వికెట్ల పైనే పడ్డాయి. కానీ కింద పడలేదు. దీంతో ప్రేక్షకులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత ఆన్ ఫీల్డ్ ఎంపైర్లు చాలా సేపు చర్చించి.. క్రికెట్ రూల్స్ ప్రకారం బెయిల్స్ కింద పడకపోతే బ్యాటర్ అవుట్ అయినట్టు పరిగణించరు. కాబట్టి అంపైర్లు చర్చల అనంతరం చిరాగ్ గాంధీకి తన ఇన్నింగ్స్ ని కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
దీంతో బాల్ స్టంప్స్ ని తాకినా బెయిల్స్ కదలని వీడియో {Watch Video} సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకున్న చిరాగ్ గాంధీ 58 బంతులలో 12 ఫోర్లు, 4 సిక్స్ లతో 101 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కానీ తన జట్టును గెలిపించలేకపోయాడు. లాల్ భాయ్ కాంట్రాక్టర్ స్టేడియం లో జరిగిన ఈ మ్యాచ్ లో మధ్యప్రదేశ్ టైగర్స్ 71 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ టైగర్స్ 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది.
అనంతరం బ్యాటింగ్ కి దిగిన యూపీ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి కేవలం 168 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. క్రికెట్ నిబంధనలను రూపొందించిన మెరీల్ బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) రూల్స్ ప్రకారం.. ” స్టంప్స్ పై ఉన్న కనీసం ఒక్క బెయిల్ అయినా కింద పడాలి. లేదంటే ఒక్క స్టంప్ అయినా గ్రౌండ్ లోపలి నుంచి బయటకు రావాలి” అలా అయితేనే అవుట్ గా పరిగణిస్తారు.
Also Read: Ravichandran Ashwin Retirement: క్రికెట్ కు అశ్విన్ వీడ్కోలు
క్రికెట్ రూల్స్ లో 29.22 ప్రకారం.. “బెయిల్ కదిలినంత మాత్రాన అది పడిపోయినట్లు కాదు. కానీ బెయిల్ కింద పడే సమయంలో రెండు స్టంప్స్ మధ్య ఇరుక్కుపోతే మాత్రం అవుట్ ” గా పరిగణిస్తారు. క్రికెట్ చరిత్రలో చాలా అరుదుగా చోటు చేసుకునే ఈ సంఘటనని ఓ అద్భుత ఘటనగా గుర్తించి.. ఈ మ్యాచ్ ని అభిమానులు ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇందుకు సంబంధించిన వీడియోని మీరు కూడా ఒకసారి చూసేయండి.
 
ONE OF THE CRAZIEST MOMENT IN CRICKET HISTORY 🤯
– Stumps rattled but bails didint came down. pic.twitter.com/sc4CQbwxQV
— Johns. (@CricCrazyJohns) December 17, 2024
;