BigTV English

Hardik Pandya’s Wife Removes Pandya Surname: పాండ్యాకు షాక్ మీద షాక్… ఇంటిపేరు తీసేసిన భార్య

Hardik Pandya’s Wife Removes Pandya Surname: పాండ్యాకు షాక్ మీద షాక్… ఇంటిపేరు తీసేసిన భార్య

Hardik Pandya’s Wife Removes Pandya Surname: ఏ ముహూర్తానా ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఉంటానని ఒప్పుకున్నాడో తెలీదు కానీ, అప్పటి నుంచి అతనికి మనశ్శాంతి లేదు. వివాదాల్లో మునిగి తేలుతున్నాడు. స్టేడియంలోకి అడుగుపెట్టగానే వేలాదిమంది అభిమానుల నిరసనలు ఒకవైపు, మరోవైపున ముంబై జట్టు అట్టడుగుకి పోవడంతో పరువు పోయి మరోవైపు…వీటన్నింటితో మానసికంగా కుంగిపోయి ఉన్నాడు. అంతేకాదు అది ఆటపై కూడా ప్రభావం చూపించింది. దీంతో గాయం నుంచి కోలుకుని… ఐపీఎల్ ఘోరంగా విఫలమయ్యాడు. కాకపోతే పాత రికార్డు ఘనంగా ఉండటంతో టీ 20 ప్రపంచకప్ నకు ఎంపికయ్యాడు.


ఇదంతా ఇలా ఉండగా మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా పాండ్యా ఇంట్లో కూడా కలతలు మొదలయ్యాయి. అవి ఎంత దూరం వెళ్లాయంటే పాండ్యా భార్య నటాషా స్టాంకోవిచ్ కు మధ్య వివాదాలు మొదలైనట్టు వార్తలు వస్తున్నాయి. పాండ్యా భార్య సినీ నటి కూడా కావడంతో ఆమెకు చాలామంది ఫాలోవర్లు ఉన్నారు. తనేం చేసినా వెంటనే ట్రెండింగులోకి వెళ్లిపోతోంది.

ప్రస్తుతం ఇన్ స్టాలో నటాషా తన పేరు చివర ఇంటిపేరు పాండ్యాను తొలగించింది. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని నెట్టింట చిలవలు-పలవలు అల్లేస్తున్నారు. ఐపీఎల్ సమస్యలు, చికాకులను ఇంట్లో తెచ్చి పెడుతూ ఉంటాడు. అందుకే విసుగెత్తిపోయిన భార్య వళ్లు మండి ఇంటి పేరు తీసేసిందని కొందరంటున్నారు.


రోహిత్ అభిమానులు దూకుడు మరీ ఎక్కువగా ఉంది. బహుశా వారేమైనా నటాషాను కూడా బయట ఇబ్బంది పెడుతున్నారా? తనకి ప్రశాంతత ఉండటం లేదా? అందరూ పాండ్యాను దోషిగా చూస్తున్నారా? అనే ప్రశ్నలు నెట్టింట వినిపిస్తున్నాయి. ఈ చికాకులన్నీ పడలేకే పాండ్యాకు దూరంగా ఉండటానికి నటాషా నిర్ణయించుకుందా? అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇంటిపేరుతో వదిలెయ్యలేదు. హార్దిక్ తో ఉన్న అన్ని ఫొటోలను సోషల్ మీడియాలోంచి తీసి పారేసింది. ఈ నేపథ్యంలో త్వరలోనే వీరిద్దరూ విడాకులు తీసుకుంటారని మరికొందరు అత్యుత్సాహంతో కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరికి 2020లో పెళ్లయ్యింది. అదే సంవత్సరంలో వీరికి ఒక కొడుకు జన్మించాడు. ఆ అబ్బాయికి అగస్త్య పాండ్యా అని నామకరణం చేశారు.

మార్చి 4న నటాషా పుట్టినరోజునాడు కూడా వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలు వచ్చాయి. కానీ వాళ్లు కలిసే ముందడుగు వేశారు. అవన్నీ ఉత్తుత్తి వార్తలని తర్వాత కొట్టి పారేశారు. ఈ విషయంపై హార్దిక్ పాండ్యా నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. కాకపోతే హార్దిక్ పాండ్యాకు చాలామంది అమ్మాయిలతో ఎఫైర్స్ ఉన్నాయనే విమర్శలున్నాయి. అవన్నీ భరించలేక నటాషా విడిపోతుందనే వార్తలు వస్తున్నాయి.

Also Read: ఇది నిజమేనా? మిథాలి రాజ్ తో.. శిఖర్ ధావన్ పెళ్లి?

అయితే ఫ్లాష్ బ్యాక్ లో వీరిద్దరూ ఒక నైట్ క్లబ్ లో కలిశారు. అప్పటివరకు పాండ్యా అంటే ఒక క్రికెటర్ అనే సంగతి నటాషాకు తెలీదు. తర్వాత వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. ప్రస్తుతం అది ఎటువైపునకు దారితీస్తుందో కాలమే నిర్ణయించాలి.

Tags

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×