Rahul Athiya Blessed with baby Girl: టీమిండియా వికెట్ కీపర్ కమ్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తండ్రి అయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ లో మొదటి మ్యాచ్ కి దూరంగా ఉన్న రాహుల్.. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. కేఎల్ రాహుల్ భార్య, బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి సోమవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది {Rahul Athiya Blessed with baby Girl}. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కూతురు పుట్టిందని ట్వీట్ చేశాడు కేఎల్ రాహుల్.
మరోవైపు అతియా శెట్టి కూడా ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేసింది. డెలివరీ సమయంలో భార్య దగ్గర ఉండేందుకు లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ కి దూరంగా ఉన్నాడు కేఎల్ రాహుల్. అథియా ప్రెగ్నెన్సీ వార్తని 2024 నవంబర్ 8న ఈ దంపతులు అనౌన్స్ చేశారు. త్వరలోనే అథియా బిడ్డకు జన్మనివ్వబోతుందని.. తమ బిడ్డ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నామని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం నేరుగా తన భార్యని చూసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో అతియా ప్రెగ్నెంట్ కావడంతో ప్రేమగా ఆమె ఒడిలో పడుకుని ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటోని షేర్ చేసిన పది రోజుల్లోనే ఇప్పుడు ఆమె పండంటి ఆడబిడ్డ కు జన్మనిచ్చిందనే శుభవార్తని తన అభిమానులకు తెలియజేశాడు కేఎల్ రాహుల్.
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురైన అతియా శెట్టి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఆమెకి ఇంస్టాగ్రామ్ మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఈమె 2015 లో “హీరో” అనే మూవీ తో డెబ్యు చేసింది. ఆ తరువాత మరో రెండు సినిమాలలో నటించింది. 2023 జనవరి 23న క్రికెటర్ కేఎల్ రాహుల్ ని పెళ్లాడింది. సీక్రెట్ గా లవ్ ఎఫైర్ నడిపించిన ఈ ఇద్దరు.. 2021 లో తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు.
కుటుంబ సభ్యులను ఒప్పించి 2023 జనవరి 23న వివాహం చేసుకున్నారు. ఇక అతియా ప్రసవం కోసమే కేఎల్ రాహుల్ ఈ ఐపిఎల్ సీజన్ లోని తొలి మ్యాచ్ కి దూరం అయ్యాడు. ఇక గత మూడు సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ కి ఆడిన కేఎల్ రాహుల్ ని.. ఐపీఎల్ 2025 మెగా వేలంలో 14 కోట్లకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఆ తరువాత ఢిల్లీ కెప్టెన్సీ పగ్గాలు ఇచ్చేందుకు ఆశ చూపించినప్పటికీ.. తాను సాధారణ ప్లేయరుగా ఐపిఎల్ ఆడేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపాడు.
దీంతో ఢిల్లీ కెప్టెన్సీ బాధ్యతలను అక్షర్ పటేల్ కి అప్పగించింది ఢిల్లీ క్యాపిటల్స్. ఇక నేడు లక్నోతో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేపట్టిన లక్నో బ్యాటర్లు వీర విహారం చేస్తున్నారు. ప్రస్తుతం 19వ ఓవర్ మూడవ బంతి వద్ద లక్నో 8 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది.