Uttarakhand CM Dhamo : విద్యా సంస్థల ముసుగులో పిల్లల్లో దేశవ్యతిరేకతను నింపుతున్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమ మదర్సాలపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వాల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, స్థానిక యంత్రాగాలకు తెలియకుండా పెద్ద సంఖ్యలో నిర్వహిస్తున్న మదర్సాలను మూసివేయాలని సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదేశాల నేపథ్యంలో.. రాష్ట్రంలో 136 మదర్సాలను సీల్ చేశారు. ఆ సంస్థలు ఎలా నిర్వహించారు, వాటిని నిధుల ఎక్కడి నుంచి అందాయి అనే విషయాలపై దర్యాప్తు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో పెద్ద ఎత్తున నమోదు కానీ మదర్సాలు నిర్వహిస్తున్నారు. అక్కడ కేవలం మత విద్యకే ప్రాథాన్యత ఇస్తున్న క్రమంలో.. విద్యార్థులు ఉద్యోగ, ఉపాధీ అవకాశాలకు దూరమవుతున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. పైగా.. చిన్నప్పటి నుంచే చిన్నారులకు బ్రెయిన్ వాష్ చేస్తూ.. దేశవ్యతిరేక కార్యక్రమాలకు సమాయత్తం చేస్తున్నారన్న విమర్శలూ చాలానే ఉన్నాయి. ఈ తరుణంలో.. చట్ట వ్యతిరేకంగా, రాష్ట్ర విద్యా శాఖ నుంచి కానీ, మదర్సా బోర్డులో కానీ నమోదవ్వని 136 మదర్సాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రభుత్వ వర్గాల అంచనా మేరకు రాష్ట్రంలో దాదాపు 450 రిజిస్టర్డ్ మదర్సాలు ఉండగా, 500 లకు పైగా ఎలాంటి గుర్తింపులు లేకుండా పనిచేస్తున్నట్లు భావిస్తున్నారు.
అక్రమ మదర్సాలు, అనధికార పుణ్యక్షేత్రాలు, ఆక్రమణలపై చర్యలు కొనసాగుతాయని ఉత్తరాఖండ్ సీఎం ప్రకటించారు. అలాగే.. ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని పట్టణాలలో నమోదు కాని మదర్సాలు వెలుస్తున్నాయి. ఇటువంటి అనధికార సంస్థలు తీవ్రమైన భద్రతా సమస్యను కలిగిస్తున్నాయంటూ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది ప్రారంభంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మదర్సాల గుర్తింపులు తనిఖీలు చేయాల్సింగా ముఖ్యమంత్రి వెరిఫికేషన్ డ్రైవ్‌కు ఆదేశించడంతో.. అన్ని జిల్లా యంత్రాంగాలు మదరసాలను సర్వే చేస్తున్నాయి. వాటి ఆర్థిక వనరులతో సహా వివిధ అంశాలను పరిశీలిస్తున్నాయి. ఈ పరిశీలనలో ఎలాంటి అనుమతులు లేని, ఉగ్రవాదానికి ఊతం కల్పించేలా మత బోధనలు చేస్తున్నట్లుగా గుర్తించి మదర్సాలు అనేక వెలుగు చూశాయి. వాటిలో.. ఉధమ్ సింగ్ నగర్‌లో 64 మదరసాలు, డెహ్రాడూన్‌లో 44, హరిద్వార్‌లో 26, పౌరి గర్హ్వాల్‌లో 2 మదర్సాలను ప్రభుత్వం సీజ్ చేసింది.
ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలపై జమియత్ ఉలేమా-ఇ-హింద్ వంటి సంస్థలు విమర్శలు చేస్తున్నాయి. రాష్ట్రంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మదర్సాలకు తొలుత నోటీసులు జారీ చేయాలని, అలా చేయకుండా నేరుగా మూసివేయడం చట్టవిరుద్ధమంటూ ప్రకటనలు జారీ చేశారు. ఇలాంటి పెద్ద ఎత్తున చేపట్టే ప్రత్యేక డ్రైవ్ ల సమయాల్లో ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని.. కానీ ఎలాంటి జీవోలు లేకుండానే తనిఖీలు నిర్వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Nagpur Violence : నాగ్ పూర్ అల్లర్ల నిందితుడి ఇంటిపై బుల్డోజర్ యాక్షన్ – దెబ్బ అదుర్స్ అంటున్న ప్రజలు
సీలు వేసిన మదర్సాల నుంచి పిల్లలను సమీపంలోని పాఠశాలలు, మదర్సాలకు బదిలీ చేస్తామని మదర్సా బోర్డు చైర్‌పర్సన్ ముఫ్తీ షామూమ్ ఖాస్మీ తెలిపారు. ఈ డ్రైవ్‌పై నివేదిక సమర్పించిన తర్వాత ఇక్కడ ఎంత మంది పిల్లలు చదువుతున్నారో పరిశీంచి, పిల్లలకు విద్యా హక్కుకు భంగం కలగకుండా చూసుకుంటామని అన్నారు. అయితే.. వాస్తవంలో మదర్సా విద్య, ప్రభుత్వ పాఠశాల మధ్య సమానమైన విద్యా అర్హత లేదుద. దీంతో.. ఈ అసమానతపై, విద్యా శాఖ పనిచేస్తుందని తెలిపారు. గుర్తింపు పొందిన మదర్సాలు రాష్ట్ర మదర్సా విద్య బోర్డుల పరిధిలోకి వస్తాయి, అయితే గుర్తింపు లేనివి దారుల్ ఉలూమ్ నద్వతుల్ ఉలామా, దారుల్ ఉలూమ్ దియోబంద్ వంటి పెద్ద సెమినరీలు సూచించిన పాఠ్యాంశాలను అనుసరిస్తాయని అధికారులు తెలుపుతున్నారు.