Hyderabad News: బంగారం షాపు యజమానుల గుండెల్లో రైళ్లు పరుగెడు తున్నాయి. బుధవారం ఉదయం దేశంలోని పలు నగరాలు హైదరాబాద్, బెంగుళూరు, ముంబై, విజయవాడ నగరాల్లో బులియన్ మార్కెట్ వ్యాపారుల ఇళ్లు, బంగారు షాపులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఒక్కసారిగా దాడులు చేపట్టారు.
హైదరాబాద్ సిటీలో పలుచోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 10, సికింద్రాబాద్‌లో తనిఖీలు చేస్తున్నారు. అలాగే వరంగల్ సిటీలో ఐటీ బృందాలు సోదాలు చేస్తున్నాయి. బంగారం షాపులు, వాటి యజమానుల ఇళ్లు లక్ష్యంగా తనిఖీలు జరుగుతున్నాయి.
ముఖ్యంగా బంగారం కొనుగోలు, పన్ను చెల్లింపులో భారీగా అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఐటీ అధికారులు సోదాలకు దిగినట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. సికింద్రాబాద్ మహంకాళి స్ట్రీట్‌లో బంగారు వ్యాపారస్తుల ఇళ్లల్లో సోదాలు కొనసాగుతున్నాయి. అబిడ్స్‌లోని బంగారు షాపు కార్యాలయంలో సోదాలు జరిగాయి. ప్రమోటర్లకు సంబంధించిన నివాసాలపై ఏకకాలంలో సోదాలు జరిగాయి.
అలాగే మహంకాళి స్ట్రీట్ లోని పవన్ వర్మ అనే బంగారు షాపు యజమాని నివాసంలో తెల్లవారుజాము నుండి సోదాలు చేస్తున్నారు. చాలాకాలంగా బంగారు వ్యాపారం చేస్తున్నాడు పవన్ వర్మ. బంగారం క్రయ విక్రయాలతో పాటు ట్రేడింగ్ చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. ప్రతి సంవత్సరం తిరుపతి బులియన్ పేరుతో కోట్లాది రూపాయల వ్యాపారం చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
ALSO READ: ఇటు క్లాసు.. అటు మాస్.. జూబ్లీహిల్స్ బైపోల్‌లో హైఓల్టేజ్
అనేక నగరాల్లో బంగారు వ్యాపారం చేస్తోంది క్యాప్స్ గోల్డ్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ. దీపావళి సీజన్ సమీపిస్తుండటంతో కంపెనీ నిర్వహిస్తున్న లావాదేవీలు, రిటైల్ పథకాలకు సంబంధించిన రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలో చందా అంజయ్య పరమేశ్వర్-CAPగా పిలువబడే క్యాప్స్‌గోల్డ్ 1901 నాటి కంపెనీ. చందా అంజయ్య పరమేశ్వర్ స్థాపించారు.
హాల్‌మార్క్ సర్టిఫికేషన్‌తో దేశంలో బులియన్ వ్యాపారులలో ఒకటిగా ఎదిగింది ఆ కంపెనీ. దశాబ్దాలుగా కుటుంబం ఈ వ్యాపారం నడుపుతోంది. బంగారం, వెండి వ్యాపారాల్లో ఈ కంపెనీకి తిరుగులేదు. దక్షిణాదిలో రిటైల్ ఆభరణాల అవుట్‌లెట్‌లు ఉన్నాయి. ఆ కంపెనీకి చైర్మన్ నరసింహారావు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు సిటీలో ఆచారీవీధిలో బంగారు షాపు యజమానుల ఇళ్లపై సోదాలు చేశారు. సమీపంలోని జ్యువెలరీ షాపులోని రికార్డులను పరిశీలించారు.
హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు
15 బృందాలతో సోదాలు నిర్వహిస్తున్న ఐటీ
ప్రముఖ బంగారం షాపు యజమానుల నివాసాల్లో సోదాలు
బంగారం కొనుగోలు పన్ను చెల్లింపులో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు pic.twitter.com/lIfK7UovIU
— BIG TV Breaking News (@bigtvtelugu) September 17, 2025