Cheating Husband: ప్రేమ, నమ్మకం అన్నివేళలూ ఒకరినొకరు అర్థం చేసుకునే బంధం. కానీ కొన్ని సమయాల్లో అదే నమ్మకానికి తూట్లుపడడం ఖాయం. వింతగా అనిపించొచ్చు కానీ, UK లో ఓ భార్య తన భర్త అసలు గుట్టును ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ద్వారా పసిగట్టింది. అవును అదే మీరు ప్రతి ఉదయం వాడే టూత్ బ్రష్ వల్లే అతను దొరికిపోయాడు. ఇది ఊహకంటే వాస్తవం. ఇప్పుడే చదవండి.. ఈ సంఘటన గురించి తెలుసుకున్నారో, మీ ఇంట్లో బ్రష్ చూసి మీరే షాక్ కు గురవుతారు.
పిల్లల కోసం తీసిన యాప్..
UK లో ఓ మహిళ తన పిల్లల పళ్ళు బాగా శుభ్రంగా ఉండాలన్న ఉద్దేశంతో ఒక స్మార్ట్ టూత్ బ్రష్ కొనుగోలు చేసింది. ఆ బ్రష్ కు ఒక మొబైల్ యాప్ కూడా ఉంది. ఆ యాప్ బ్రష్ చేసిన టైమ్‌లు, ఎంతసేపు బ్రష్ చేశారన్నది డేటాగా చూపుతుంది. తల్లి గమనిస్తుందనే భయంతో పిల్లలు, భార్య భయంతో భర్త ఎక్కువగా బ్రష్ చేసేవాడు.
శుక్రవారం శుక్రవారం అదే సమయం.. అదే డౌట్!
ప్రతి శుక్రవారం, మధ్యాహ్నం ఒకే టైమ్‌లో బ్రష్ యాక్టివిటీ కనిపిస్తోంది. ఆమె భర్త ఆ సమయానికి ఆఫీసులో ఉండాలి. కానీ టూత్ బ్రష్ మాత్రం ఇంట్లో పని చేస్తోంది. ఇది చూస్తే ఎవరికైనా డౌట్ వస్తుంది కదా? అదే అనుమానం ఆమెకు వచ్చింది.
ఆమె తన అనుమానాన్ని ధృవీకరించుకోవడానికి ఓ ప్రైవేట్ డిటెక్టివ్‌ను సంప్రదించింది. అతని పేరు పాల్ జోన్స్. మూడు నెలలు బ్రష్ యాప్ డేటాను గమనించాడు. ప్రతి శుక్రవారం.. భర్త పని మీద బయట ఉండాలసిన టైమ్‌లో బ్రష్ యాక్టివ్‌గా ఉంది. ఇంకేముంది అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఇంట్లోకి వస్తున్నది అతని ‘ఆఫీస్ ఫ్రెండ్’
వాస్తవం ఏమిటంటే.. అతను తన ఆఫీస్‌లో పని చేస్తున్నానని చెప్పి తన సహోద్యోగినిని ఇంటికి తీసుకొచ్చేవాడు. భార్య పిల్లలు లేనప్పుడు, ఇంట్లో మూడేళ్ల బంధాన్ని తుడిచిపెట్టేలా వ్యవహరిస్తున్నాడు. కానీ ఊహించని చోట అతను దొరికాడు.. అదే అతని టూత్ బ్రష్ డేటాతో.
Also Read: Vizag Best Place: విశాఖలో ఇక్కడికి.. నైట్ వెళ్లారో.. ఆ మూడ్ లోకి వెళ్లినట్లే!
పాల్ జోన్స్ ఏం చెప్పాడంటే..
పాల్ జోన్స్ ఈ కేసుపై మాట్లాడుతూ.. చాలామంది భార్యాభర్తలు బాహ్య లక్షణాలనే బాగా గమనిస్తారు. కానీ ఇప్పుడు చిన్న చిన్న పరికరాలు, డేటా లాగ్‌లు కూడా ఎంత తక్కువగా కనిపించినా పెద్ద నిజాలను బయటపెడతాయి. టూత్ బ్రష్ డేటా ఉంటే చాలు, మీ ఇంట్లో ఏమి జరుగుతుందో చెప్పగలదు అంటూ పెద్ద మాటే చెప్పాడు పాల్.
మీ ఇంట్లో బ్రష్‌కు యాప్ ఉంటే.. ఓ లుక్కేయండి!
ఇప్పుడు మీ ఇంట్లో ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ఉందా? దానికి యాప్ ఉందా? అది ఎప్పుడెప్పుడు యాక్టివ్ అవుతుందో తెలుసుకోండి. ఇది సరదాగా అనిపించొచ్చు, కానీ కొన్ని విషయాల్లో ఇది నిజాన్నే చెబుతుంది. డేటా నమ్మకమైనది. మనుషులు అబద్ధం చెప్పొచ్చు.. కానీ బ్రష్ చెప్పదు!
మొత్తానికి చిన్న పరికరం.. పెద్ద కుట్ర బయటపడింది!
సాధారణంగా పళ్ళు తోమడానికే బ్రష్ వాడతాం. కానీ ఈ కథలో, అదే టూత్ బ్రష్ ఒక అవిశ్వాసాన్ని బట్టబయలు చేసింది. టెక్నాలజీ దాచిన రహస్యాన్ని ఎప్పుడు బయటపెడుతుందో ఊహించడం కష్టం. ఇకపై టూత్ బ్రష్ ను కూడా జాగ్రత్తగా వాడాలి అంటున్నారు రసిక ప్రియులు.