Virat – Bengaluru Stampede: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందిన కేసు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకొని విచారణ చేయిస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఘటనకు కారణమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అకాడమీ పైన పోలీస్ కేసు నమోదు అయింది. ఇక లేటెస్ట్ గా… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించిన మార్కెటింగ్ హెడ్ నిఖిల్ ను అరెస్టు కూడా చేశారు కర్ణాటక పోలీసులు. ఇలాంటి నేపథ్యంలో సరికొత్త అంశం తెరపైకి వచ్చింది.
బెంగళూరు తొక్కిసలాటకు కారణం కోహ్లీనే ?
బుధవారం రోజున బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగింది. 18 సంవత్సరాల తర్వాత రాయల్ చాలెంజెస్ బెంగళూరు టైటిల్…. గెలవడంతో పర్మిషన్ లేకుండా పరేడ్ నిర్వహించినట్లు సమాచారం అందుతుంది. అయితే ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో…. సరికొత్త అంశం తెరపైకి వచ్చింది. ఈ తొక్క సలాటకు మూల కారణం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. విరాట్ కోహ్లీ లండన్ వెళ్లిపోతాడని… హడావిడిగా బెంగళూరు చిన్న స్వామి స్టేడియం దగ్గర పరేడ్ నిర్వహించినట్లు సమాచారం అందుతుంది.
బెంగళూరు పోలీసులపై ఒత్తిడి !
మంగళవారం రోజున రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టు అర్ధరాత్రి టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఇక టైటిల్ గెలిచిన తర్వాత… గురువారం రోజున విరాట్ కోహ్లీ కుటుంబం లండన్ కానున్నట్లు.. బెంగళూరు పోలీసులకు.. సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే… హడావిడిగా పరేడ్ నిర్వహించేందుకు పర్మిషన్ ఇవ్వాలని బెంగళూరు పోలీసుల వద్దకు వచ్చి… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బృందం అలాగే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ బోర్డు సభ్యులు… రిక్వెస్ట్ పెట్టారట. అయితే దానికి బెంగుళూరు పోలీసులు అస్సలు ఒప్పుకోలేదని తెలుస్తోంది.
ఆ సమయంలోనే విరాట్ కోహ్లీ విషయాన్ని తెరపైకి తీసుకువచ్చారట రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్య బృందం. విరాట్ కోహ్లీ లండన్ వెళ్తాడని.. గురువారం ప్రయాణం కానున్న నేపథ్యంలో బుధవారం కచ్చితంగా పరేడ్ ఉండాలని… ఒత్తిడి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే రాజకీయపరమైన ఒత్తిళ్లు కూడా బెంగళూరు పోలీసుల పైకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రాజకీయపరమైన ఒత్తిళ్లు కూడా రావడంతో పోలీసులు హడావిడిగా పర్మిషన్ ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. అక్కడ సిబ్బంది లేకపోయినా చిన్న స్వామి వద్ద కేవలం 5000 మంది పోలీసులను ఏర్పాటు చేశారట. కానీ అంచనాకు మించి చిన్నస్వామి స్టేడియం వద్దకు మూడు లక్షల మంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు రావడం… మనం చూసాం. ఈ నేపథ్యంలోనే… తొక్కిసలాట జరిగి 11 మంది మరణించారు. ఈ సంఘటన జరిగి 18 గంటలు ముగియకముందే… విరాట్ కోహ్లీ లండన్ వెళ్లిపోయాడు. ముందస్తుగా గురువారం వెళ్ళిపోవాలని ఫిక్స్ కావడంతో… నిన్నటి రోజున లండన్ ఫ్లైట్ ఎక్కింది విరాట్ కోహ్లీ ఫ్యామిలీ. దీంతో విరాట్ కోహ్లీని అరెస్టు చేయాలని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
So this news was true about Chokli
MDC Chokli has literally no shame 🙏💔 pic.twitter.com/cx0Rfnl9X6— . (@Devx_07) June 5, 2025