BigTV English

Croatia vs Morocco FIFA 2022 : మూడో స్థానం క్రొయేషియాదే

Croatia vs Morocco FIFA 2022 : మూడో స్థానం క్రొయేషియాదే

Croatia vs Morocco FIFA 2022 : ఫిఫా వరల్డ్‌కప్‌లో మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో మొరాకోపై క్రొయేషియా 2-1 గోల్స్ తేడాతో గెలిచింది. గత వరల్డ్‌కప్‌లో రెండో స్థానంలో నిలిచిన క్రొయేషియా, ఈ వరల్డ్‌కప్‌లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. అటు క్వార్టర్స్ దాకా ఎన్నో సంచలనాలు సృష్టించిన మొరాకో… సెమీస్ సహా మూడో స్థానం కోసం జరిగిన పోరులోనూ చతికితబడింది.


మ్యాచ్ ఆరంభం నుంచే క్రొయేషియా-మొరాకో హోరాహోరీగా తలపడ్డాయి. తొలి పదినిమిషాల్లోనే రెండు జట్లు చెరో గోల్‌ చేశాయంటే… ఎంత దూకుడుగా ఆడాయో అర్థం చేసుకోవచ్చు. క్రొయేషియా ఆటగాడు మాస్క్‌మెన్‌ మ్యాచ్‌ ఏడో నిమిషంలో అద్భుతమైన హెడర్‌తో గోల్‌ చేసి జట్టుకు ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత రెండు నిమిషాలకే మొరాకో షాకిచ్చింది. తొమ్మిదో నిమిషంలో లభించిన ఫ్రీకిక్‌ను మొరాకో ఆటగాడు అచ్చాఫ్‌ దరి హెడర్‌తో గోల్‌గా మలిచాడు. దాంతో 1-1 గోల్స్ తో రెండు జట్లు సమానంగా నిలిచాయి. ఇక మ్యాచ్‌ 42వ నిమిషంలో క్రొయేషియా ఆటగాడు మిస్లావ్ అద్భుతమైన కిక్‌తో గోల్‌ కొట్టి… తొలి అర్ధభాగం ముగిసేసరికి క్రొయేషియాను ఆధిక్యంలో నిలిపాడు.

మ్యాచ్ మొత్తం మీద బంతి క్రొయేషియా నియంత్రణలోనే ఎక్కువ సేపు ఉన్నా… మొరాకోకు కూడా గోల్స్ చేసే అవకాశాలు బాగానే వచ్చాయి. కానీ ఆ జట్టు ఆటగాళ్లు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. క్రొయేషియా 12 షాట్లు కొట్టగా.. మొరాకో 9 మాత్రమే కొట్టింది. క్రొయేషియా ఆటగాళ్లు 487 పాస్‌లు ఇవ్వగా… మొరాకో 472 పాస్‌లు ఇచ్చింది. రెండో అర్ధభాగంలో రెండు జట్లు ఎంత ప్రయత్నించినా గోల్ కొట్టలేకపోయాయి. దాంతో… మ్యాచ్‌ చివరిదాకా 2-1 గోల్స్ ఆధిక్యాన్ని నిలబెట్టుకున్న క్రొయేషియా… విజేతగా నిలిచింది. మూడో స్థానం దక్కించుకున్న ఆ జట్టుకు రూ. 223 కోట్లు.. నాలుగు స్థానంలో నిలిచిన మొరాకో జట్టుకు రూ.206 కోట్లు ప్రైజ్ మనీ లభిస్తుంది.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×