Deepak Chahar’s sister Post: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 సీజన్ లో మ్యాచ్ లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఐపీఎల్ లో కొన్నేళ్లపాటు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రతినిత్యం వహించిన ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్.. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ లో సుదీర్ఘ అనుభవం ఉన్న ప్లేయర్లలో దీపక్ చాహర్ ఒకరు. 2016లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ తరఫున డెబ్ల్యూ చేశాడు చాహర్.
రాజస్థాన్ కి చెందిన చాహర్ దేశవాళీ క్రికెట్ లో రాణించి వెలుగులోకి వచ్చాడు. దీంతో అతడిని 10 లక్షల కనీస ధరకు 2016లో రైజింగ్ పూనే సొంతం చేసుకుంది. అప్పుడు ఆ జట్టులో ధోని కూడా ఆడాడు. ఆ సమయంలో అతడి ప్రతిభను గుర్తించి 2018లో సీఎస్కే కొనుగోలు చేసేలా చేశాడు ధోని. ఇక 20 లక్షలకు వేలంలో సీఎస్కే అతడిని కైవసం చేసుకుంది. 2022 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్.. దీపక్ చాహర్ కోసం ఏకంగా 14 కోట్లు వెచ్చించడం గమనార్హం.
అలా 2018 నుండి 2024 సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. ఇక 2025 ఐపీఎల్ మెగా వేళానికి ముందు దీపక్ చాహర్ ని చెన్నై రిలీజ్ చేయడంతో.. అతడిని ముంబై ఇండియన్స్ వేలంలో దక్కించుకుంది. కాగా ఆదివారం రోజు చెన్నై సూపర్ కింగ్స్ – ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగగా.. ఈ మ్యాచ్ లో ముంబై పై చెన్నై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ముంబై తరపున దీపక్ చాహర్ ఆల్ రౌండ్ ప్రదర్శన చేశాడు.
మొదట బ్యాటింగ్ లో 15 బంతులలో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. ఆ తర్వాత బౌలింగ్ లో రెండు ఓవర్లు వేసి 18 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఇక మ్యాచ్ అనంతరం అతడి సోదరి మాలతి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. దీపక్ చాహార్ పై వచ్చిన మీమ్స్ ని అతడి సోదరి మాలతి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.
దీపక్ చాహర్‌పై ఆసక్తికర పోస్ట్ చేసిన సోదరి:
అందులో తన సోదరుడిని కట్టప్ప తో పోల్చినట్టు ఉండడంపై ఆమె నవ్వులు చిందించింది. ఆ మీమ్ లో ముంబై జెర్సీతో ఉన్న దీపక్ ఫోటో కింద.. బాహుబలి సినిమాలో ప్రభాస్ ని కట్టప్ప వెన్నుపోటు పొడిచిన సీన్ ఉంది. దీనిని షేర్ చేసిన చాహర్ సోదరి.. నవ్వుతున్న ఎమోజీలను జత చేసింది. చాహార్ తన కెరీర్ లో ఏడేళ్లపాటు ఐపీఎల్ లో చెన్నైకి ప్రతినిత్యం వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన పాత జట్టుకు వ్యతిరేకంగా ఆడినందుకు .. తన సోదరుడిని హాస్యాస్పదంగా ట్రోల్ చేసింది. ఇక చాహర్ కి 2022 జూన్ నెలలో వివాహం జరిగిన విషయం తెలిసిందే. జయ భరద్వాజ్ ని పెళ్లాడాడు చాహర్. ఆగ్రాలో కుటుంబ సభ్యుల సంవత్సరంలో వీరి వివాహం జరిగింది.