BigTV English

Indian Railways: సీట్లు ఎన్ని ఉంటే టికెట్లు అన్నే.. రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్!

Indian Railways: సీట్లు ఎన్ని ఉంటే టికెట్లు అన్నే..  రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్!

Railway’s New Plan: భారతీయ రైల్వే నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చుతుంది. ఇందుకోసం ఏకంగా 13 వేలకు పైగా రైళ్లను నడుపుతుంది. తక్కువ ఖర్చుతో ఆహ్లాదకరమైన ప్రయాణం చేసే అవకాశం ఉండటంతో ఎక్కువ మంది రైల్లో వెళ్లేందుకు ఇష్టపడుతారు. రైలు ప్రయాణం చేయాలనుకునే వాళ్లు చాలా వరకు ముందుగానే టికెట్లను బుక్ చేసుకుంటారు. కానీ, రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో అంటే పండుగలు, కుంభమేళా లాంటి ప్రత్యేక సందర్భాల్లో  కన్ఫర్మ్ టికెట్లు పొందడం అంత ఈజీ కాదు. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ప్రయాణీకులకు కన్ఫర్మ్ టికెట్లను మాత్రమే అమ్మాలని భావిస్తున్నట్లు సమాచారం.


సీట్ల సంఖ్యకు అనుగుణంగా టికెట్ల అమ్మకాలు

ఆయా రైళ్లలో ఎన్ని సీట్లు ఉంటాయో.. అన్ని మాత్రమే టికెట్లు అమ్మాలని ఇండియన్ రైల్వే భావిస్తోంది. అంటే, టికెట్ తీసుకున్న ప్రతి ఒక్కరికీ కచ్చితంగా సీటు లభిస్తుంది. తాజాగా పార్లమెంట్ లో రైల్వేకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ, రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రయాణీకుల సౌలభ్యాన్ని పెంచడానికి, అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య ఆధారంగా టికెట్లు కేటాయించబడతాయి అన్నారు. అంటే, సీట్లు లేనప్పుడు టికెట్లు ఇవ్వరు. సో, టికెట్ లేని వాళ్లు రైలు ఎక్కే అవకాశం లేదు. ఒకరి సీటులో మరొకరు కూర్చునే సమస్య ఉండదు. ఎవరైనా అలా కూర్చుంటే టికెట్ లేదని ఈజీగా గుర్తు పట్టవచ్చు. వారికి రైల్వే అధికారులు పెద్ద మొత్తంలో జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఇకపై వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కూడా సీట్లు ఉన్నంత వరకు ఇవ్వనుంది. సీట్లు లేకపోతే, వెయిటింగ్ లిస్టు వారికి టికెట్ ఇవ్వదు.


కొత్త విధానంతో బోలెడు లాభాలు

రైల్వేశాఖ తాజా నిర్ణయంతో ఇకపై రైళ్లలో రద్దీ సమస్యకు శాశ్వతంగా చెక్ పడుతుంది. టికెట్ లేకుండా రైలు ఎక్కే పరిస్థితి ఉండదు. ఇప్పటికే కన్ఫర్మ్ టికెట్ ఉన్నవారినే రైల్వేస్టేషన్ లోకి అనుమతించే విధానాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో తొక్కిసలాటకు ఎలాంటి ఛాన్స్ ఉండదు. ఇక టికెట్ తీసుకున్న ప్రయాణీకులు తమ బెర్త్ లో కూర్చొని హ్యాపీగా జర్నీ చేసే అవకాశం ఉంటుంది. రైళ్లలో రద్దీ కూడా ఉండకపోవడంతో ప్రశాంతంగా ప్రయాణాన్ని కొనసాగించవచ్చు.

రైల్వే ప్రణాళిక ఏంటి?

నిజానికి ప్రతి ఏటా సుమారు 800 కోట్ల మందికి పైగా జనాలు రైల్వే ప్రయాణం చేస్తున్నారు. వీరి కోసం సుమారు 13 వేల ప్యాసింజర్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే.. చాలా సందర్భాల్లో వీరిలో అందరికీ కన్ఫర్మ్ టికెట్ లభించదు. చాలా మంది వెయిటింగ్ టికెట్లపై ప్రయాణిస్తారు. ఈ జర్నీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 2027 నాటికి ప్రయాణీకులు అందరికీ కన్ఫర్మ్ టికెట్లు అందించాలని రైల్వే ఆలోచిస్తోంది. ఇప్పటికే ఈ దిశగా పనులు మొదలయ్యాయి. ఏటా 1000 కోట్ల మంది ప్రయాణించేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా రైళ్ల సంఖ్యను పెంచాలని భావిస్తోంది.

Read Also:  దేశంలో రిచెస్ట్ రైల్వే స్టేషన్ ఇదే, టాప్ 5లో తెలుగు స్టేషన్ కూడా..

Related News

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Big Stories

×