Big Stories

IPL 2024 CSK vs RCB: సీఎస్కే ముందు.. మళ్లీ తలవంచిన ఆర్సీబీ.. కొత్త కెప్టెన్ తో జట్టుని గెలిపించిన ధోనీ

CSK vs RCB Highlights, IPL 2024

- Advertisement -

CSK vs RCB Highlights IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‌ ఘనంగా ప్రారంభమైంది. వేడుకల అనంతరం చెన్నయ్ సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ మొదలైంది. ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఓపెనర్లు విరాట్ కొహ్లీ, కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ వచ్చారు. ఇద్దరూ ఆశాభావంతోనే ప్రారంభించారు. మంచి బిగినింగ్ ఇచ్చారు.

- Advertisement -

41 పరుగుల వద్ద కెప్టెన్ డుప్లెసిస్ 23 బంతుల్లో 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇందులో 8 ఫోర్లు ఉన్నాయి. తర్వాత ఫస్ట్ డౌన్ వచ్చిన పటీదార్ తీవ్రంగా నిరాశపరిచాడు. తను డక్ అవుట్ అయ్యాడు. ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసే మ్యాక్స్ వెల్ తర్వాత ఓవర్ లో డక్ అవుట్ అయ్యాడు. అప్పటికి 5.3 ఓవర్లు మాత్రమే అయ్యాయి. స్కోరు చూస్తే  3 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసిన ఆర్సీబీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

ఈ సమయంలో ఆదుకుంటాడనుకున్న విరాట్ కొహ్లీ 21 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. అప్పుడే ఒక సిక్స్ కొట్టి, మరొక దానికి ట్రై చేసి లాంగ్ ఆన్ లో దొరికిపోయాడు. తర్వాత కెమరాన్ గ్రీన్ (18) అవుట్ అయిపోయాడు. 11.4 ఓవర్లలో ఆర్సీబీ స్కోరు 5 వికెట్ల నష్టానికి 78 పరుగులు. 100 లోపే అంతా అయిపోతుందని అనుకున్నారు.

Also Read: చెలరేగిన రచిన్, దూబే.. బెంగళూరుపై చెన్నై సూపర్ విక్టరీ..

అప్పుడొచ్చారు…దినేష్ కార్తీక్, అనూజ్ రావత్ ఇద్దరూ ఇరగదీసి పాడేశారు. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన అనూజ్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48 పరుగులు చేశాడు. తర్వాత దినేశ్ కార్తీక్ 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. చివరికి ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసి పోరాడే లక్ష్యాన్ని సీఎస్కే ముందు ఉంచింది.

బౌలింగ్ లో ముస్తాఫజర్ రెహ్మాన్ 4, దీపక్ చాహర్ 1 వికెట్టు పడగొట్టారు.

174 పరుగుల లక్ష్యంతో సీఎస్కే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర ఆత్మవిశ్వాసంతో ఆరంభించారు. మహ్మద్ సిరాజ్ వేసిన తొలి బంతినే ఫోర్ కొట్టి గైక్వాడ్ ఘనంగా కెప్టెన్సీని మొదలుపెట్టాడు. 15 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.

తర్వాత రచిన్ రవీంద్ర అయితే దుమ్ము దులిపేశాడు. కేవలం 15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేసి సీఎస్కే గెలుపు సులభతరం చేశాడు. తర్వాత వాళ్లకి ప్రెజర్ తగ్గించాడు. అయితే ఎవరు కూడా తగ్గేదేలేదన్నట్టే ఆడారు.

Also Read: కొత్త టెక్నాలజీ.. స్మార్ట్ రీప్లే సిస్టమ్ వచ్చింది..

రహాన్ (27), డేరి మిచెల్ (22) చేసి అవుట్ అయ్యారు. అయితే శివమ్ దుబె (34 నాటౌట్), రవీంద్ర జడేజా (25 నాటౌట్) ఇద్దరూ సీఎస్కేను విజయతీరాలకు చేర్చారు. ఐపీఎల్ సీజన్ 17 ను ఘనంగా విజయంతో ప్రారంభించారు.

ఈసారి ధోనీ వికెట్ కీపర్ గానే జట్టులో ఉన్నాడు. గైక్వాడ్ కి సలహాలు, సూచనలు ఇస్తూ జట్టుని గెలిపించాడు. సారధిగా ముందుకు నడిపించాడు. ఆర్సీబీలో ఆవేశం తప్ప, ఆలోచన లేదని, అది ధోనీలో ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

బౌలింగ్ లో యష్ దయాల్ 1, కర్ణ్ శర్మ 1, కెమరాన్ గ్రీన్ 2 వికెట్లు పడగొట్టారు. అయితే ప్రధాన పేసర్ సిరాజ్ మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 4 ఓవర్లలో 38 పరుగులు ఇచ్చేశాడు. తనే కాదు, తప్పుమాట… ఇంచుమించు అందరూ అలాగే సమర్పించుకున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News