Big Stories

Arvind Kejriwal : జెయిల్ నుంచి పాలన సరే.. ప్రచారం ఎలా? ఎన్నికల ముంగిట కేజ్రీకి పరీక్ష!

Arvind Kejriwal arrest

- Advertisement -

Arvind Kejriwal Arrest Latest News (Telugu news live today): ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లారు. పాలన జైలు నుంచే అంటున్నారు ఆప్ నేతలు.. దేశం కోసం ప్రాణాలిస్తా అంటున్నారు కేజ్రీవాల్.. కస్టడీ ఇవ్వాల్సిందే అంటోంది ఈడీ.. స్కామ్‌ కథ తేల్చేస్తామంటోంది సీబీఐ.. అన్ని బాగానే ఉన్నాయి. కానీ తెలాల్సిన కథలు.. తేల్చాల్సిన లెక్కలు ఇంకా ఉన్నాయి? అవెంటో చూద్దాం..

- Advertisement -

అవినీతిని చీపురుతో ఊడ్చేస్తామని చెప్పి అదే గుర్తుతో.. ఆమ్‌ ఆద్మీ పార్టీ పెట్టారు అరవింద్ కేజ్రీవాల్.. కానీ ఇప్పుడా చీపురు పార్టీకే అవినీతి మరక అంటింది. దాన్ని కడుక్కోలేక.. కవర్‌ చేసుకోలేక తికమకపడుతున్నారు ఆప్‌ నేతలు.. పైకి కడిగిన ముత్యంలా కేజ్రీవాల్ రిటర్న్ అవుతారని చెబుతున్నా.. వాస్తవ పరిస్థితులు అలా కనిపించడం లేదు. కానీ కేజ్రీవాల్ అరెస్ట్ టైమింగ్ మాత్రం.. ఆ పార్టీకి తీవ్రంగా డ్యామేజ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈడీ కేసుల్లో ఒక్కసారి అరెస్ట్‌ అయితే బెయిల్ అంత సులభంగా వచ్చే చాన్సే లేదు. ఎందుకంటే ఈడీ చార్జ్‌షీట్‌ వేస్తే కానీ బెయిల్‌కి అప్లై చేసుకోలేం.. చార్జ్‌షీట్‌ వేసేందుకు ఈడీకి 90 రోజుల టైమ్ ఉంటుంది..
ఈ టైమ్‌లో ఎలక్షన్స్‌ ముగిసిపోతాయి..

Also Read: కేజ్రీవాల్‌కు ఆరు రోజుల కస్టడీ.. రూస్ ఎవెన్యూ కోర్టు తీర్పు..

అతి కొన్ని రోజుల్లోనే లోక్‌సభ ఎన్నికలు ఉన్నాయి. ఇది దేశంలోని అన్ని పార్టీలతో పాటు.. ఆప్‌కు కూడా క్రూషియల్ టైమ్.. ఇలాంటి సమయంలో ఆ పార్టీ అధినేత జైలుకు, కోర్టుకు చక్కర్లు కొడుతూ.. న్యాయపోరాటం చేస్తుంటే.. ఆ పార్టీని నడిపించేది ఎవరు? ఆప్‌ కేవలం ఢిల్లీకే పరిమితమైన పార్టీ కాదు. పంజాబ్‌లోనూ అధికారంలో ఉంది. గుజరాత్, హర్యానా, గోవాలో కూడా పార్టీ కార్యకలాపాలు జరుగుతున్నాయి. మరి ఈ రాష్ట్రాల్లో బరిలో దిగాల్సిన అభ్యర్థులను ఫైనల్ చేసేది ఎవరు? ప్రచారం నిర్వహించేది ఎవరు?

ఇవే కాదు మరికొన్ని సమస్యలను ఆప్‌ ఎదుర్కోవాల్సి వస్తోంది. నిజానికి కేజ్రీవాల్‌ జైలు నుంచే పరిపాలిస్తారని ఇప్పటికే డిసైడ్ అయ్యింది. ఈ డెసిషన్‌ ఇప్పుడు కాదు.. ఎప్పుడో తీసుకున్నారు.. లాస్ట్ ఇయర్‌ ఎండింగ్‌లోనే కేజ్రీవాల్ అరెస్ట్ ప్రచారం జరిగింది. అప్పుడే అలర్టైంది ఆప్‌.. పబ్లిక్‌ ఓపినియన్ పోల్ నిర్వహించింది. కేజ్రీవాల్ అరెస్ట్ అయితే రిజైన్ చేయాలా? లేక జైలు నుంచే పాలన చేయాలా? అనే క్వశ్చన్స్‌ పెట్టింది.. ఇందులో కేజ్రీవాలే రూల్ చేయాలని ఓట్లు వచ్చాయని ఆప్ ప్రకటించింది. సో ఇప్పుడదే నిర్ణయాన్ని ఫాలో అవుతుంది. కానీ ఇక్కడో లిటిగేషన్ ఉంది.. సీఎం అంటే మంత్రులు, అధికారులతో రివ్యూ మీటింగ్స్ నిర్వహించాలి..కానీ అది సాధ్యం కాదు. దీని వల్ల ఎలాంటి రాజకీయ సంక్షోభమైనా ఏర్పడవచ్చు. అన్నింటికంటే డేంజర్ ఏంటంటే.. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం కూడా ఉంది.ఇప్పటికే ఈ ఆప్షన్‌ను పరిశీలిస్తున్నారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్.. సో ఢిల్లీ విషయంలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు..

ఆప్‌ అనగానే గుర్తొచ్చేది కేజ్రీవాల్‌ మాత్రమే.. ఆయనలా మరో నేత ఆ పార్టీలో ఎదగలేదు. పంజాబ్‌లో అధికారంలోకి రావడానికైనా.. ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకైనా.. ఆయన చరిష్మానే ఉపయోగపడింది. మరి ఆయనే జైలులో ఉంటే ప్రచారం సంగతేంటి? ఆప్‌ ఎన్నికల ప్రచారాన్ని ఎవరు లీడ్ చేస్తారు? పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ బాధ్యతలు నెత్తిన వేసుకుంటారా? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.

కేజ్రీవాల్ అరెస్ట్‌తో ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనేది కూడా ఇప్పుడు కాస్త ఇంట్రెస్టింగే.. ఎందుకంటే అవినీతిపరులంతా జైలుకు వెళ్లాల్సిందే.. అంటూ ఇన్నాళ్లు చెప్పిన బీజేపీ.. సరిగ్గా ఎన్నికల ముందు అరెస్ట్ చేసింది. అయితే ఇది రాజకీయ కక్ష సాధించే అని ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు.. దీంతో చాలా మంది అలానే ఫీలయ్యే చాన్స్ ఉంది..అదే జరిగితే ఆయనకు డ్యామేజ్‌ కంటే సింపతి వచ్చే చాన్సే ఎక్కువ. ఇవన్నీ ఇలా ఉంటే.. సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఒకప్పటి ఉద్యమ సహచరుడు, లోక్‌పాల్ బిల్లు ఉద్యమ నేత అన్నాహాజరే కీలక వ్యాఖ్యలు చేశారు..

Also Read: యూపీ బోర్డ్ ఆఫ్ మదర్సా చట్టం రాజ్యాంగ విరుద్ధం..

తనతో కలిసి పనిచేసి లిక్కర్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన కేజ్రీవాల్.. చివరకు లిక్కర్ పాలసీలు చేశారన్నారు హజారే.. సొంత పనుల కోసం పాలసీలు చేశారు కాబట్టే ఈడీ అరెస్ట్ చేసింది.ఇందులో తప్పేముందని కుండ బద్ధలు కొట్టేశారు.. ఆయన అక్కడితో ఆగలేదు.. కేజ్రీవాల్‌తో కలిసి పని చేసినందుకు సిగ్గుపడుతున్నానన్నారు.. మద్యం పాలసీపై కేజ్రీవాల్‌కు 2 సార్లు లేఖలు రాశాను ..పట్టించుకోలేదు. అలాంటి కేజ్రీవాల్‌కు ఎలాంటి సలహా ఇచ్చే ఆలోచన కూడా లేదన్నారు. ఇది హాజరే వర్షన్.. ఒక్కసారి పాస్ట్‌కు వెళితే అసలు అరవింద్ కేజ్రీవాల్.. అధికారం గురించి ఏంమాట్లాడారు అన్నది వింటే మీరు షాకవుతారు..

అదేంటో.. అధికార పీఠంలోనే ఏదో సమస్య ఉంది.ఈ కుర్చీ ఎక్కగానే జనాలు మారిపోతారు..ఎవరైతే ఉద్యమాలు చేశారో.. వారే మళ్లీ అవినీతి చేస్తారు.. ఇలాంటి సమస్య ఎదురైతే ఎలా అని తెగ ఆందోళన పడిపోయారు కేజ్రీవాల్ అప్పుడు.. కానీ అదేంటో ఏ నోటితో అయితే చెప్తూ ఆందోళన పడ్డారో.. అదే కేజ్రీవాల్ అధికార పీఠం ఎక్కారు.. అదే కేజ్రీవాల్ లిక్కర్ పాలసీ చేశారు.. అదే కేజ్రీవాల్ అవినీతి కేసుల్లో ఇరుక్కున్నారు.అదే కేజ్రీవాల్ ఇప్పుడు జైల్లో ఉన్నారు..
ఇది డెస్టీనీనా? లేక సీఎం కుర్చి పాపమా?

.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News