Anil Kumble on Virat Kohli: : భారత జట్టు మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి క్రీడాభిమానులకు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఈ రన్ మిషన్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి 2024 ఆగస్టు 18 వ తేదీకి 16 ఏళ్లు పూర్తయింది. 2008 ఆగస్టు 18న కోహ్లీ తన పరుగుల వేటను ప్రారంభించాడు. తన కెరీర్ లో కోహ్లీ ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. అతను సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. తన కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలని ఎదుర్కొన్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కొనసాగుతున్నాడు.
Also Read: Gukesh Dommaraju: షాకింగ్.. ధోని కంటే ఎక్కువ టాక్స్ కడుతున్న గుకేశ్?
వన్డేలో 50 సెంచరీల రికార్డును నమోదు చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డుల్లో ఉన్నాడు. ఇక ధోని తర్వాత భారత్ పగ్గాలు చేపట్టిన విరాట్ ఆరేళ్లపాటు టెస్టుల్లో భారత్ ని నెంబర్ వన్ గా నిలపాడు. అలాగే ప్రపంచంలో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. 2016 ఐపీఎల్ సీజన్ లో పరుగుల వరద పారించి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఫైనల్ వరకు తీసుకువెళ్లాడు. ఇంగ్లాండ్, ఆసిస్ వంటి దేశాలను సైతం వారి సొంత గడ్డపై టెస్టుల్లో ఓడించాడు. అలాంటి కోహ్లీ.. గత కొంతకాలంగా ఆశించినంత మేర రాణించలేకపోతున్నాడు.
కెరీర్ పీక్స్ దశలో మంచినీళ్లు తాగినంత సులువుగా సెంచరీలు కొట్టిన విరాట్ కోహ్లీ.. ఇప్పుడు క్రీజ్ లో నిలబడేందుకే ఇబ్బంది పడుతున్నాడు. దీంతో కోహ్లీపై ఇప్పుడు విమర్శలు వెళ్లువెతుతున్నాయి. అతని ఆట తీరుపై అతని అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా కోహ్లీ నిరాశపరచడంతో సీనియర్ ఆటగాళ్లు విరాట్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. అతని ఆట తీరుపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్తించాడు.
ఇక సోమవారం సాయంత్రం మరో దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే {Anil Kumble} కూడా కోహ్లీపై తీవ్ర విమర్శలు చేశారు. విరాట్ కోహ్లీని ఏ ఒక్కరూ ఎందుకు ప్రశ్నించడం లేదో నాకు అర్థం కావడం లేదని అన్నారు. గత ఐదేళ్లుగా టెస్టుల్లో కోహ్లీ ప్రదర్శన ఆశాజనకంగా లేదని, ఇక బ్యాగులు ప్యాక్ చేసుకొని లండన్ లో సెటిల్ అయ్యేందుకు కోహ్లీకి ఇదే సరైన సమయమని {Anil Kumble} తీవ్రంగా వ్యాఖ్యానించారు.
Also Read: Rohit Sharma: నీకు బుర్ర ఉందా..? రోహిత్ శర్మ సీరియస్.. వీడియో వైరల్
అయితే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి – భారత మాజీ కోచ్ అనిల్ కుంబ్లే {Anil Kumble} కి మధ్య వివాదం అప్పుడప్పుడు తెరపైకి వస్తూనే ఉంటుంది. వీరిద్దరి మధ్య వివాదం పై మాజీ కంఫ్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్ తన పుస్తకంలో సైతం రచించారు. కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ వినోద్ రాయ్ తన పుస్తకంలో విరాట్ కోహ్లీ – అనిల్ కుంబ్లె మధ్య వివాదం గురించి ” నాట్ జస్ట్ ఎ నైట్ వాచ్మెన్ – మై ఇన్నింగ్స్ ఇన్ ది బీసీసీఐ” లో బయటపెట్టారు. తాజాగా అనిల్ కుంబ్లె చేసిన వ్యాఖ్యల పట్ల విరాట్ కోహ్లీ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.