IND vs AUS: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి పడిపోయిన టీమిండియా జట్టుకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చాలా కీలకంగా మారింది. ఇక భారత్ – ఆస్ట్రేలియా {IND vs AUS} మధ్య బ్రిస్బెన్ లోని గబ్బా వేదికగా శనివారం మూడో టెస్ట్ ప్రారంభమైన విషయం తెలిసిందే. టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ ఈ మ్యాచ్ కి వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో మొదటి రోజు కేవలం 13.2 ఓవర్లాట మాత్రమే సాధ్యమైంది.
Also Read: Bumrah: బుమ్రాకు ఘోర అవమానం.. కోతి జాతి అంటూ మహిళా కామెంటేటర్ కామెంట్స్!
మొదటిరోజు ఆస్ట్రేలియా జట్టు వికెట్లు కోల్పోకుండా 28 పరుగులు చేసింది. ఇక వర్షం తగ్గకపోవడంతో తొలిరోజు {IND vs AUS} ఆటను అంపైర్లు రద్దు చేశారు. రెండవ రోజు బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆల్ అవుట్ అయింది. 7 వికెట్ల నష్టానికి 405 పరుగులతో మూడవరోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఈ 405 పరుగులకు మరో 40 పరుగులు జోడించింది. మొత్తంగా 445 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఆస్ట్రేలియా బ్యాటర్లు ట్రావిస్ హెడ్ 152, స్మిత్ 101 పరుగులతో ఇద్దరు సెంచరీలు చేసి ఆస్ట్రేలియా జట్టుకి భారీ స్కోరు అందించారు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ప్రస్తుతం నాలుగు వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసి కష్టాల్లో పడింది. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ కేవలం 4 పరుగులతో మరోసారి నిరాశపరిచాడు. ఆ తర్వాత గిల్ ఒక్క పరుగుతోనే పెవిలియన్ చేరాడు. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ కి దిగిన విరాట్ కోహ్లీ మరోసారి తన ఫామ్ లేమిని కొనసాగించాడు. చేసిన తప్పునే మరోసారి చేశాడు కోహ్లీ. ఆఫ్ స్టంప్ కి దూరంగా వెళుతున్న బంతిని వెంటాడి మరి ఫ్లిక్ చేసి అవుట్ అయ్యాడు.
ఇటీవలి కాలంలో ఇలాంటి బాల్స్ ని ఎదుర్కోవడంలో విరాట్ తరచూ విఫలమవుతున్నాడు. ప్రతిసారి ఇదే తరహాలో అవుట్ కావడం చూసి అభిమానులు విసుగెత్తిపోతున్నారు. దూరంగా వెళుతున్న బంతులను డ్రైవ్ చేయాల్సిన అవసరం ఏముందంటూ తలంటుతున్నారు. జోష్ హెజిల్ వుడ్ బౌలింగ్ లో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ కి క్యాచ్ ఇచ్చి కోహ్లీ పెవీలియన్ బాట పట్టాడు. కోహ్లీ ఇదే తరహాలో అవుట్ కావడం ఇది 51 వ సారి. తన కెరీర్ లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన విరాట్ తన బలహీనతను అధిగమించలేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.
Also Read: Sanjiv Goenka: ఢిల్లీ కుట్రలు… పంత్ కు ఎక్కువ ధర పెట్టెలా చేశారు.. భారీ నష్టాల్లో ?
తన ఆట తీరుతో రన్ మిషన్ గా గుర్తింపు తెచ్చుకున్న కోహ్లీ సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. అలాంటి ఈ రన్ మిషన్ పై ఇప్పుడు విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కోహ్లీ ఆట తీరుపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాస్త ఓర్పు కూడా ప్రదర్శించలేవా..? అని ప్రశ్నించారు. నాలుగేళ్లలో కేవలం మూడు సెంచరీలు మాత్రమే కొట్టిన కోహ్లీకి ఇలాంటి బంతిని ఆడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించాడు. కోహ్లీ తీవ్రంగా నిరుత్సాహపరిచాడని, పేలవ షాట్ తో అభిమానులను షాక్ కి గురి చేశాడని అన్నారు గవాస్కర్. ఇక కోహ్లీ అవుట్ అయ్యాక రిషబ్ పంత్ బ్యాటింగ్ కి దిగాడు. అంతలోనే {IND vs AUS} ఆటకి వరుణుడు అంతరాయం కలిగించాడు.