Warner Watching SRH vs RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి ముందు ఇండియన్స్ కి ఎక్కువగా మన టీమ్ ఇండియా ప్లేయర్లని మాత్రమే అభిమానించేవారు. కానీ ఎప్పుడైతే ఈ ఐపీఎల్ మొదలైందో.. అప్పటినుండి ఇతర దేశాలకు సంబంధించిన ప్లేయర్స్ ని కూడా విపరీతంగా అభిమానించడం మొదలుపెట్టారు. అలా ఫారిన్ ప్లేయర్స్ కేటగిరీలో మన ఇండియన్స్ అత్యధికంగా ఇష్టపడేది డేవిడ్ వార్నర్ ని. అతడు చాలా సంవత్సరాలు హైదరాబాద్ టీం లో ఆడాడు.
అంతేకాకుండా సన్రైజర్స్ కి కెప్టెన్ గా వ్యవహరించి రెండుసార్లు కప్పు కూడా అందుకునేలా చేశాడు. అందుకే డేవిడ్ వార్నర్ అంటే ఇండియన్స్ కి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు చాలా ఇష్టం. వార్నర్ కి కూడా తెలుగు అభిమానులు అంటే ఎంతగానో ఇష్టం. ఈ క్రమంలోనే అతడు ఓ తెలుగు సినిమాలో కూడా నటించాడు. హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది.
ఈ మూవీ మార్చ్ 28న విడుదల కాబోతోంది. అయితే ఈ మూవీలోనే డేవిడ్ వార్నర్ ఓ కీలక పాత్రలో నటించడమే ఈ మూవీపై క్రేజ్ ని పెంచుతుంది. ఇక ఆదివారం రోజు ఉదయం వార్నర్ హైదరాబాద్ కి రావడం, ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించడం, హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల, వార్నర్ కలిసి డాన్స్ చేయడం.. వార్నర్ ఈ మూవీ గురించి గొప్పగా చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అంతే కాదు తెలుగులో నమస్కారం అంటూ ప్రసంగాన్ని ప్రారంభించి.. తనకి ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఆదివారం రోజు ఉప్పల్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ – రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగింది. ఈ మ్యాచ్ ని హీరో నితిన్, డేవిడ్ వార్నర్ కలిసి వీక్షించారు. మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉండడంతో స్టేడియానికి రాలేకపోయిన వీరు.. ఫోన్ లో మ్యాచ్ ని వీక్షించారు.
ఇందుకు సంబంధించిన వీడియో ని మైత్రి మూవీ మేకర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. ఇక రాబిన్ హుడ్ సినిమాలో డేవిడ్ వార్నర్ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో నవ్వించేలా ఉంటుందని సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాకి స్వయంగా డేవిడ్ వార్నర్ తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పారని తెలుస్తోంది. మరోవైపు 2024 టీ-20 వరల్డ్ కప్ లో భారత్ తో ఆస్ట్రేలియా మ్యాచ్ ఓడిపోవడంతో డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు.
2024 జనవరి 6న టెస్ట్ ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్.. వన్డేలకు కూడా గుడ్ బై చెప్పాడు. ఇక ఇతడికి ఐపీఎల్ లో కూడా అద్భుత రికార్డు ఉంది. రెండుసార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకోవడం తోపాటు 2016 లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు టైటిల్ అందించాడు. కానీ రెండు కోట్ల రూపాయలతో 2025 మెగా యాక్షన్ లోకి వచ్చిన వార్నర్ ని.. ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">