deepak chahar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025లో భాగంగా ఆదివారం రోజు చెపాక్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ – చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో సీఎస్కే విజయం సాధించిన విషయం తెలిసిందే. చెపాక్ స్టేడియం స్పీన్ కి అనుకూలించడంతో చెన్నై స్పిన్నర్లు రెచ్చిపోయారు. నూర్ అహ్మద్ 4 ఓవర్లు వేసి కేవలం 18 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు.
దీపక్ చాహర్ ను కొట్టిన ధోని:
అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మహేంద్ర సింగ్ ధోని – దీపక్ చాహర్ మద్య అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. దీపక్ చాహర్ ని విశ్వసనీయ బౌలర్ గా తీర్చిదిద్దడంలో ధోని కీలక పాత్ర పోషించాడు. గతంలో సీఎస్కే విజయాలలో దీపక్ చాహార్ తనదైన ముద్ర వేశాడు. అయితే ఐపీఎల్ 2025 మెగా వేలంలో అన్ని జట్ల ప్లేయర్లు మారిపోయారు. మెగా వేలంలో ఐపీఎల్ లోని 10 ఫ్రాంచైజీలు తమ తమ ప్లేయర్లను బయటకు వదిలేశాయి.
దీంతో ఈ సీజన్ లో ప్లేయర్లంతా ఎన్నో ఏళ్లుగా ఆడుతున్న జట్లను వదిలేసి మరో జట్టులోకి వెళ్లాల్సిన పరిస్థితి. అయితే పాత ప్లేయర్లు కనిపించగానే ఆప్యాయంగా ఒకరినొకరు హత్తుకుంటుంటారు. ఈ క్రమంలోనే ఆదివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా ధోనీని ముంబై ఇండియన్స్ ప్లేయర్ దీపక్ చాహర్ స్లెడ్జ్ చేయాలని చూశాడు. ధోని బ్యాటింగ్ కి వచ్చిన సమయంలో సిల్లీ మిడాఫ్ లో నిలబడి చప్పట్లు కొడుతూ దీపక్ చాహార్ అత్యుత్సాహం ప్రదర్శించాడు.
అంతేకాకుండా ఏదో మాట్లాడుతూ చిన్నగా స్లెడ్జింగ్ చేసినట్లు అనిపించింది. దీంతో చెన్నై స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. అయితే అప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ విజయం ఖాయం కావడంతో సరదాగా ఇలా చేసినట్లు అందరికీ అర్థమైంది. ఇక ఈ మ్యాచ్ లో ధోని రెండు బంతులు ఆడి పరుగులు ఏమి చేయలేదు. మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర సిక్స్ కొట్టి మ్యాచ్ నీ ముగించాడు. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం ప్లేయర్లు కరచాలనం చేసేటప్పుడు.. అత్యుత్సాహం ప్రదర్శించిన దీపక్ చాహారికి తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు మహేంద్రసింగ్ ధోని.
Also Read: Harbhajan Singh – Jofra Archer: ఆర్చర్‌పై భజ్జీ జాత్యహంకార కామెంట్స్… బ్లాక్ టాక్సీ మీటర్!
దీంతో ధోని – చాహర్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ వీడియో పట్ల అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్లేయర్స్ కరచాలనం చేసే సమయంలో తన దగ్గరికి వచ్చిన దీపక్ చాహర్ ని చూసి నవ్వుతూ ధోని.. తన బ్యాట్ తీసుకుని దీపక్ చాహర్ నీ కొట్టాడు. దీంతో ప్రేక్షకులంతా ఒక్కసారిగా గట్టిగా అరిచారు. నిజానికి ధోని – చాహార్ మధ్య గురు శిష్యుల అనుబంధం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే ధోని ఎప్పుడూ చాహరిని సరదాగా ఆటపట్టించడం క్రికెట్ అభిమానులకు తెరిచింది. గతంలో కూడా వీరిద్దరి మధ్య సరదా వాగ్వాదాలు, ఆటపట్టింపులు జరిగాయి.
MS Dhoni giving BAT treatment to Deepak Chahar😭pic.twitter.com/2uYGLkFdpy
— ` (@lofteddrive45) March 23, 2025