Star Heroine :ముఖ్యంగా సినిమా రంగంలో అత్యధిక సామాజిక సేవ చేస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకున్న వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) పేరు కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈయన కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడమే కాకుండా చిన్న పిల్లల ప్రాణాలను కాపాడుతూ.. వారి పాలిట భగవంతుడిగా మారిపోయారు. ముఖ్యంగా కొన్ని వందల సంఖ్యలో చిన్నారులకు హార్ట్ సర్జరీ చేయిస్తూ.. వారికి జీవితాన్ని ప్రసాదిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సహాయం చేయడంలో మహేష్ బాబునే మించిపోయింది ఒక సింగర్. తన పాటలతో శ్రోతలను అలరిస్తూ.. అలా వచ్చిన డబ్బులతో ఏకంగా 3వేల మందికిపైగా చిన్నారులకు హార్ట్ సర్జరీ చేయించి, వారి ప్రాణాలను నిలబెట్టింది.
సహాయంలో మహేష్ బాబును మించిపోయిన సింగర్..
ఆమె ఎవరో కాదు ప్రముఖ సింగర్ పాలక్ ముచ్చల్ (Palak Muchhal). తన మధురమైన స్వరంతో పాటలు పాడి, శ్రోతలను అలరించే ఈమె తన వంతు కృషిగా సామాజిక సేవలో కూడా పాలు పంచుకుంటుంది. ఫండింగ్ ద్వారా ఇప్పటివరకు మూడువేల మందికి పైగా పేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించింది. ముచ్చల్ విషయానికి వస్తే.. తన తొలి సంపాదనను కార్గిల్ వీర సైనికుల కోసం త్యాగం చేసిన ఈమె.. ప్రతిరోజు ఉదయం ప్రతి షాప్ ముందుకు వెళ్లి దేశభక్తి గీతాలు పాడుతూ..” కార్గిల్ వీర సైనికులకు మీ వంతు సహాయం చేయండి” అంటూ అడిగేవారు. కళ , సామాజిక సేవను వేరు చేసి చూడకుండా.. రెండూ ఒకటే అంటూ ముందుకు సాగింది. ముఖ్యంగా సినిమాలలో అవకాశాలు దొరకని రోజుల్లో కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి, పేద పిల్లల కోసం విరాళాలు సేకరించిన ఈమె ఒక మ్యూజిక్ ప్రోగ్రాం చేసింది అంటే దాదాపు 10 మంది పేద పిల్లల వైద్యానికి అవసరమైన డబ్బును సేకరిస్తుందట. ఇక ఈమెకు సింగర్ గా మంచి గుర్తింపు రావడంతో పాటు ఆ పేరు విరాళాల సేకరణ కి కూడా బాగా ఉపయోగపడిందని చెప్పవచ్చు.
Sai Dharam Tej: ఆగిపోయిన మెగా హీరో మూవీ.. ఆ కేస్ ఇంకా వెంటాడుతోందా..?
సొంత కష్టంతో 3వేల మందికి పైగా చిన్నారులకు హార్ట్ సర్జరీ..
ఇక పాలక్ మనస్తత్వం ఎలాంటిదంటే.. ‘మీ పాట అద్భుతం” అనే ప్రశంస కంటే.. పేదింటి తల్లిదండ్రులు గొంతు నుంచి వినిపించే..” మీ వల్లే మా బిడ్డ బతికింది” అనే మాటకు ఆమె ఎంతో సంతృప్తి పడుతుంది. వందల సంఖ్యలో వెయిటింగ్ లిస్టులో ఉన్న ఎంతోమంది పిల్లలకు హార్ట్ సర్జరీ చేయిస్తానని ఆ బాధ్యతలను భుజాలకెత్తుకుంది. మనం ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే.. అంతా మంచే జరుగుతుందని, పేద పిల్లలకు అండగా నిలవడానికి ఇది దేవుడు ఇచ్చిన అవకాశం గా భావిస్తున్నాను అంటూ పాలక్ చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా దాదాపు మూడు వేల మందికి పైగా పిల్లలకు హార్ట్ సర్జరీ చేయించి వారి గుండెల్లో దేవతగా మిగిలిపోయిందని నెటిజన్స్ సైతం కామెంట్ చేస్తున్నారు. ఇక మరి కొంతమంది వేలకోట్ల ఆస్తులు ఉన్న వారు కూడా చేయని సహాయం, నీ కష్టంతోనే ఇంత సహాయం చేయడం నిజంగా ప్రశంసనీయదగ్గ విషయం అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికైతే సహాయం చేయడంలో కర్ణుడిని కూడా మించిపోతుందేమో అని కూడా మరికొంతమంది కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.