Anchor Shyamala :ప్రముఖ యాంకర్ శ్యామల (Anchor Shyamala) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకవైపు తన అద్భుతమైన వాక్చాతుర్యంతో ఎంతోమందిని అలరించిన ఈమె.. అడపా దడపా సినిమాలలో కూడా నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం రాజకీయ రంగ ప్రవేశం చేసిన శ్యామల.. వైసీపీ తరఫున ఒంటరిగా పోరాటం చేస్తూ తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా రెండు తెలుగు రాష్ట్రాలను హడలెత్తించిన అంశం బెట్టింగ్ యాప్ ప్రమోషన్.. ఇప్పటికే దాదాపు 940 మంది అమాయకులు ఈ బెట్టింగ్ యాప్స్ లో ఇరుక్కొని ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు రాగా.. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై ఒక్కొక్కరిగా కేసు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే.
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేస్ పై శ్యామలా రియాక్షన్..
ఇకపోతే ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఉండే 25 మంది సెలబ్రిటీలపై ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు కింద కేసు ఫైల్ అవ్వగా.. ఒక్కొక్కరు విచారణకు హాజరవుతూ.. తమ తప్పు ఏమీలేదని, తమకు తెలియకుండానే ప్రమోట్ చేసాము అంటూ వివరణ ఇస్తున్నారు. ఇకపోతే విచారణ నుండి బయటపడడానికి హైకోర్టును ఆశ్రయించిన శ్యామలకు తెలంగాణ హైకోర్టు ఊరట కల్పిస్తూ.. ఆమెను అరెస్టు చేయకూడదని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం విచారణకు సహకరిస్తున్న ఈమె తాజాగా మీడియా ముందుకు వచ్చి బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసు గురించి మాట్లాడుతూ..
“ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది ప్రస్తుతం ఈ విషయం కోర్టులో నడుస్తోంది. కాబట్టి ప్రస్తుతం ఈ కేస్ గురించి మాట్లాడలేను. విచారణకు సహకరిస్తున్నాను. చట్టం, న్యాయ వ్యవస్థ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ విషయంలో నిందితులను పట్టుకోవడానికి నా వంతుగా పోలీసులకు సహకరిస్తాను” అంటూ శ్యామల తెలిపారు. ఇక అలాగే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ గురించి మాట్లాడుతూ..” ఎవరైతే దీని బారినపడి నష్టపోయారో వారి కుటుంబాలకు తీర్చరాని నష్టం ఇది. ఇకపై ఒక సిటిజన్ గా బాధ్యతగా ప్రవర్తించడానికి నాతో పాటు మీరు కూడా చెయ్యి కలపండి” అంటూ కూడా శ్యామల తెలిపారు.
ఇక బ్యాంకు స్టేట్మెంట్ ఏదైనా తీసుకున్నారా అని పలు ప్రశ్నలు మీడియా మిత్రులు వేయగా… ప్రస్తుతం వాటి గురించి నేను మాట్లాడలేను అంటూ శ్యామల చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Star Heroine : సాయంలో మహేష్ బాబునే దాటేసింది… ఏకంగా 3వేల మందికి పైగా ఆపరేషన్స్
నిండితుల కోసం గాలిస్తున్న పోలీసులు..
ముఖ్యంగా యూట్యూబర్స్ లక్షలాది మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న తర్వాత బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి, భారీగా డబ్బు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అలాంటి వారిని ఇప్పుడు అరెస్టు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో యూట్యూబర్ నానిని అరెస్టు చేయగా.. యూట్యూబర్ హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, ఇమ్రాన్ ఖాన్ లను అరెస్టు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం వీరు పరారీలో ఉండగా.. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసు గురించి ప్రస్తుతం మాట్లాడలేను: శ్యామల
విచారణకు సహకరిస్తున్నాను
చట్టం, న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది
ఈ విషయంలో నిందితులను పట్టుకోవడానికి పోలీసులకు నా వంతుగా సహకరిస్తా
– శ్యామల https://t.co/WQXGkKKylH pic.twitter.com/WuBjYdTN0V
— BIG TV Breaking News (@bigtvtelugu) March 24, 2025