BigTV English

DC Vs RCB Preview: రెండు జట్లకి జీవన్మరణ పోరు.. నేడు ఢిల్లీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్!

DC Vs RCB Preview: రెండు జట్లకి జీవన్మరణ పోరు.. నేడు ఢిల్లీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్!

IPL 2024 62nd Match- Royal Challengers Bangalore Vs Delhi Capitals Preview : ఐపీఎల్ సీజన్ 2024లో మరో కీలకమైన మ్యాచ్ కు తెరలేవనుంది. ఎందుకంటే మొదట్లో ఢిల్లీ, ఆర్సీబీ రెండు జట్లు కూడా సరిగ్గా ఆడలేదు. మ్యాచ్ లన్నీ ఓడిపోయి, తప్పిజారి ఒకట్రెండు గెలిచి పడుతూ లేస్తూ ముందడుగు వేశాయి. చివర్లో మాత్రం జూలు వదిల్చి వరుసపెట్టి గెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య బెంగళూరులో నేటి రాత్రి 7.30కి మ్యాచ్ జరగనుంది. ఇక్కడ గెలిచిన జట్టుకే ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే.


ప్రస్తుతం ఆర్సీబీ 10 పాయింట్లతో ఉంది. ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఆ రెండూ గెలిస్తే 14 పాయింట్లతో గాలిలో దీపంలా ఉంటుంది. ఒకరు గెలవాలి, ఒకరు ఓడాలి. ఇలా మారే సమీకరణాల మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది. ప్రస్తుతం మాత్రం ఢిల్లీని నిలువరించగలిగితే, ఒక ప్లే ఆఫ్ కి వెళ్లే జట్టుని కొంచెం నియంత్రించే అవకాశం ఉంటుంది.

ఎందుకంటే ఢిల్లీ ఓడిపోతే 12 పాయింట్ల వద్ద ఆగిపోతుంది. అప్పుడు ఆర్సీబీ 10 నుంచి 12 పాయింట్లకు వెళుతుంది. ఆ తర్వాత  రెండు జట్లకు ఒకొక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంటుంది. ఇవి రెండు కూడా అప్పుడు గెలిస్తే, చెరో 14 పాయింట్లతో నిలుస్తాయి. అక్కడ రన్ రేట్ కీలకం అవుతుంది.


Also Read: చెన్నై గెలుస్తుందా? నిలుస్తుందా? నేడు రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్

లేదు ఈ మ్యాచ్ లో ఢిల్లీయే గెలిస్తే, ఆర్సీబీ ప్లే ఆఫ్ రేస్ నుంచి గౌరవంగా తప్పుకుంటుంది. ఎందుకంటే తనిప్పుడు 10 పాయింట్లతో ఉంది కాబట్టి, ఒకటి ఓడి, ఒకటి గెలిస్తే 12 పాయింట్లు అవుతాయి. అలా అధికారికంగా బయటకి వచ్చేస్తుంది.

ఢిల్లీ విషయానికి వస్తే 12 పాయింట్లతో ఉంది. ఈ జట్టు కూడా మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇప్పుడు వరుసగా రెండూ గెలిస్తే 16 పాయింట్లతో  మిగిలిన జట్లకు గట్టి పోటీ ఇస్తుంది. అక్కడ రన్ రేట్ ప్రాతిపదికన వెళితే ప్లే ఆఫ్ కి వెళుతుంది. లేదంటే ఇంటికి తిరిగి వస్తుంది. అందుకే నేడు జరిగే ఈ మ్యాచ్ ఈ రెండు జట్లకి జీవన్మరణ పోరుగా మారింది.

Tags

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×