IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ డబుల్ ధమాకా ఉండనుంది. ఆదివారం అలాగే ఉగాది కావడంతో ఇవాళ రెండు మ్యాచ్లు నిర్వహించనుంది ఐపీఎల్ యాజమాన్యం. అయితే మొదటి మ్యాచ్ డేంజర్ జట్టు సన్రైజర్స్ ది కావడం విశేషం. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ తో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడబోతోంది. విశాఖపట్నంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా… ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభం అవుతుంది.
మధ్యాహ్నం మూడు గంటల సమయంలో టాస్ ప్రక్రియ ఉంటుంది. అయితే మొదటి మ్యాచ్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్…. రెండో మ్యాచ్లో దారుణంగా ఓడిపోయింది. అయితే ఇవాళ మూడవ మ్యాచ్ లో గెలిచి గాడిలో పడేందుకు రంగం సిద్ధం చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ టీం కాబట్టి హైదరాబాద్ గెలుస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. మరి ఇవాల్టి మ్యాచ్ లో హైదరాబాద్ ఆటగాళ్లు ఎలా ఆడతారో చూడాలి. 300 కొట్టేందుకు ప్రయత్నించకుండా మ్యాజిక్ గెలిచేందుకు ప్రయత్నించాలని కోరుతున్నారు ఫ్యాన్స్.
ఇక అటు ఇవాళ… రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ గౌహతిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. సాయంత్రం ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఏడు గంటల సమయంలో టాస్ ఉండనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇటు చెన్నై సూపర్ కింగ్స్ ఒక మ్యాచ్ గెలిచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయింది. కాబట్టి రాజస్థాన్ రాయల్స్ జట్టును చిత్తు చేసి మల్లి గాడిలో పడేందుకు ప్లాన్ వేస్తోంది చెన్నై సూపర్ కింగ్స్.
SRH VS DELHI Teams
ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాబబుల్ XII: జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్ (WK), KL రాహుల్, అక్షర్ పటేల్ (c), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాబబుల్ XII: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (wk), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (c), హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, సిమర్జీత్ సింగ్, ఆడమ్ జంపా
RR VS CSK
రాజస్థాన్ రాయల్స్ XII: యశస్వి జైస్వాల్, సంజు సామ్సన్, రియాన్ పరాగ్ (కెప్టెన్), నితీష్ రాణా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మైర్, శుభమ్ దుబే, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహీష్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, కుమార్ కార్తికేయ/సందీప్ శర్మ
చెన్నై సూపర్ కింగ్స్ XII: రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్ (c), శివమ్ దూబే, దీపక్ హుడా/విజయ్ శంకర్, సామ్ కర్రాన్, రవీంద్ర జడేజా, MS ధోని (WK), R అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరానా