BigTV English
Advertisement

Virat Kohli: కోహ్లీకి రూ.1000 కోట్లకు పైగా ఆస్తులు.. ఆదాయ వివరాలు ఇవే..

Virat Kohli: కోహ్లీకి రూ.1000 కోట్లకు పైగా ఆస్తులు.. ఆదాయ వివరాలు ఇవే..
Virat Kohli

Virat Kohli: విరాట్‌ కోహ్లీ అంటే డ్యాషింగ్ బ్యాట్స్‌మెనే మనందరికీ. బౌలర్లపై విరుచుకుపడతాడు. ఫోర్లు, సిక్స్‌లు బాదేస్తాడు. సెంచరీలతో చెలరేగిపోతాడు. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తుతాడు. షార్ప్ ఫీల్డింగ్‌ చేస్తాడు. ప్రత్యర్థులపై దూకుడుగా ఉంటాడు. ఇంతే మనకు తెలిసింది. కానీ, ఆట వెనుక మరెంతో ఉంది. క్రికెట్‌తో కాసుల పంట పండిస్తున్నాడు కోహ్లీ. అప్పట్లో సచిన్.. ఇప్పుడు విరాట్. మధ్యలో ధోనీ. బెస్ట్ బిజినెస్‌మెన్‌గా ఎదిగారు.


విరాట్ కోహ్లీ టీమిండియాలో అత్యంత విలువైన ఆటగాడు. గేమ్‌తోనే కాకుండా.. అడ్వర్టైజ్‌మెంట్లు, బ్రాండ్ ప్రమోషన్లు, పెట్టుబడులతో దండిగా సంపాదిస్తున్నాడు. ఏకంగా వెయ్యి కోట్లకుపైనే ఆస్తులు ఉంటాయని అంచనా. తాజాగా, ‘స్టాక్ గ్రో’ అనే సంస్థ లెక్క ప్రకారం.. కోహ్లీ నికర ఆస్తుల విలువ రూ.1050 కోట్లు. ఇన్‌కమ్‌లో మిగతా అంతర్జాతీయ ఆటగాళ్లందరికంటే మనోడే టాప్.

విరాట్ కోహ్లీ ఆదాయ వనరుల వివరాలు ఇలా ఉన్నాయి…
–టీమ్‌ఇండియా ‘A+’ కాంట్రాక్ట్‌ ద్వారా బీసీసీఐ నుంచి 7 కోట్ల ఆదాయం.
–ప్రతి టెస్టు మ్యాచ్‌కు రూ.15 లక్షలు
–ఒక్కో వన్డేకు రూ.6 లక్షలు,
–టీ20 మ్యాచ్‌కు రూ.3 లక్షలు
–ఐపీఎల్‌లో ఆర్సీబీ నుంచి ఏటా 15 కోట్లు


–బ్లూట్రైబ్‌, యూనివర్సల్‌ స్పోర్ట్స్‌బిజ్‌, ఎంపీఎల్‌, స్పోర్ట్స్‌ కాన్వో లాంటి 7 స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు.

–కోహ్లీ ఖాతాలో.. ఎఫ్‌సీ గోవా ఫుట్‌బాల్‌ క్లబ్‌, ఓ టెన్నిస్‌ జట్టు, ప్రో రెజ్లింగ్‌ లీగ్ ఉన్నాయి.

–18 బ్రాండ్లకు కోహ్లీ ప్రచారకర్త. ఒక్కో యాడ్‌కు రూ.7.5 కోట్ల నుంచి 10 కోట్లు. మొత్తంగా యాడ్స్ ద్వారా రూ.175 కోట్ల సంపాదన.

–ఇన్‌స్టాలో విరాట్‌కు 252 మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. ఒక్కో ఇన్‌స్టా పోస్టుకు రూ.8.9 కోట్లు తీసుకుంటాడు. ట్విటర్‌లో పోస్టుకు రూ.2.5 కోట్లు ఛార్జ్ చేస్తుంటాడు.

–కోహ్లీకి ముంబైలో దాదాపు 34 కోట్ల లగ్జరీ హౌజ్.. గురుగ్రామ్‌లో 80 కోట్ల ఖరీదైన స్థిరాస్తులు.

–విరాట్ గ్యారేజీలో సుమారు 31 కోట్లు విలువ చేసే పలు ప్రముఖ కంపెనీల లగ్జరీ కార్స్ ఉన్నాయి.

Related News

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

OTT Movie : పొలంలో శవాల పంట… తలలేని మొండాలతో ఊరు ఊరంతా వల్లకాడు… అల్టిమేట్ యాక్షన్ తో అదరగొట్టే మూవీ

Plane Crash: రన్ వే నుంచి నేరుగా సముద్రంలోకి.. ఘోర విమాన ప్రమాదం, స్పాట్ లోనే..

Mohan Babu University: హైకోర్టులో మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ ఊరట… విద్యా కమిషన్‌కు మొట్టికాయలు

Harish Rao On BC Reservations: కాంగ్రెస్‌తో కలిసి పోరాడేందుకు సిద్ధం: హరీశ్ రావు

OTT Movie : పెళ్ళాం ఉండగా మరో అమ్మాయితో… తండ్రే దగ్గరుండి… గుండెను పిండేసే నిహారిక విషాదాంత కథ

New Traffic Rules: అలా చేశారో లైసెన్స్ గోవిందా.. కొత్త ట్రాఫిక్ రూల్స్ తో జాగ్రత్త సుమా!

Big Stories

×