Dhanashree Verma: భారత క్రికెట్ జట్టు ప్రముఖ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతడి భార్య, ప్రముఖ కొరియోగ్రాఫర్ ధన శ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో ఈ రూమర్స్ కి మరింత బలం చేకూరింది. గత కొంతకాలంగా విరిద్దరూ విడివిడిగానే ఉంటున్నారు.
Also Read: Jagan Mohan on SRH: SRH లో భయంకరమైన బ్యాటర్లు.. 300 స్కోర్ ఈ సారి పక్కా?
ఈమధ్య వీరిద్దరికి విడాకులు కూడా మంజూరు అయినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ రూమర్స్ మద్య ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేడుకగా జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో చాహల్ ఓ అమ్మాయితో కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇది చూసిన నెటిజెన్లు ఆమె ఎవరు..? అని ఆరా తీస్తే ఆర్జె మాహ్వాష్ గా గుర్తించారు.
ఇంకేముంది.. చాహల్ ఆమెతో పీకల్లోతూ డేటింగ్ లో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో చాహల్ భార్య ధనశ్రీ వర్మ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తన భర్త చాహల్ తో దిగిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో రీలోడ్ చేసింది. అతడితో ఉన్న ఫోటోలతో పాటు పెళ్లి ఫోటోలు కూడా ధన శ్రీ వర్మ ఇంస్టాగ్రామ్ లో దర్శనమిచ్చాయి. ఇలా ధనశ్రీ ఇచ్చిన ట్విస్ట్ తో ఇక విడాకుల రూమర్స్ కి చెక్ పడే అవకాశం ఉంది.
ఈ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేందుకే ధనశ్రీ వర్మ ఫోటోలు అన్నింటిని రీ స్టోర్ చేసినట్లు తెలుస్తోంది. గత సంవత్సరం ధనశ్రీ.. చాహల్ తో కలిసి ఉన్న ఫోటోలను ఆర్చీవ్ చేసి కనపడకుండా చేసింది. ఇప్పుడు మళ్లీ ఆ ఫోటోలన్నింటినీ రీస్టోర్ చేసింది. దీంతో చాలామంది నెటిజెన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు విడాకుల ప్రక్రియ మొదలైందని వార్తలు వస్తున్న తరుణంలో ధనశ్రీ ఇలా చేయడం ట్విస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొంతమంది మాత్రం ఫైనల్ మ్యాచ్లో చాహల్ వేరే అమ్మాయితో కనిపించడంతోనే.. ధనశ్రీ ఇలా చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Champions Trophy 2025 : ఒక్క టీమిండియా వెళ్లకుంటేనే… పాక్ కు ఇన్ని కోట్ల నష్టమా..?
ఇక ధనశ్రీ – యుజ్వేంద్ర చాహల్ 2020లో వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల బంధం తర్వాత గత సంవత్సరం వీళ్లు విడాకులకు అప్లై చేసుకున్నారని రూమర్స్ బయటకు వచ్చాయి. ఇటీవల ధనశ్రీ న్యాయవాది అదితి మోహుని ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ధనశ్రీ వర్మ చాహల్ నుండి 60 కోట్ల భరణం డిమాండ్ చేసిందని కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. కానీ ఈ రూమర్స్ ని ధనశ్రీ వర్మ కుటుంబ సభ్యులు ఖండించారు. మొత్తానికి చాహల్ – ధనశ్రీ వ్యవహారంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.