BigTV English

Akash Deep : కొత్త కారు కొన్న ఆకాష్ దీప్ కు నోటీసులు.. కారణం ఇదే..!

Akash Deep : కొత్త కారు కొన్న ఆకాష్ దీప్ కు నోటీసులు.. కారణం ఇదే..!

Akash Deep :  టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో ముఖ్యంగా బర్మింగ్ హోమ్ వేదికగా జరిగిన ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ మ్యాచ్ అందరికీ తప్పక గుర్తుకే ఉండి ఉంటుంది. ఇంగ్లాండ్ పర్యటనలో రెండో టెస్ట్ మ్యాచ్ తరువాత ఈ టిమిండియా బౌలర్ ఒక్కసారిగా సంచలనంగా మారాడు. ఇక ఆ తరువాత 5వ టెస్ట్ లో సాయి సుదర్శన్ ఔట్ కాగానే నైట్ వాచ్ మెన్ గా ఆకాశ్ దీప్ బ్యాటింగ్ కి వచ్చి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 5వ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో 66 పరుగులు చేశాడు.  దీంతో మళ్లీ క్రేజీ అమాంతం పెరిగిపోయింది. ఇక ఇదిలా ఉంటే.. మరోవైపు కొత్త కారుకొని సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. తన కుటుంబంతో కలిసి కొత్త కారుతో ఫొటోతో దిగిన కొద్ది రోజులకే తాజాగా ఆర్టీవో అధికారులు నోటీసులు ఇచ్చారు.


Also Read :  Asia Cup winners : ఇప్పటివరకు ఆసియా కప్ గెలిచిన జట్లు ఇవే.. టీమిండియాకే ఎక్కువ ట్రోఫీలు వచ్చాయా!

భారత క్రికెటర్ ఆకాష్ దీప్ తన “డ్రీమ్” కారును కొనుగోలు చేశాడు, ఒక లగ్జరీ SUVని కొనుగోలు చేశాడు. గత వారం హృదయపూర్వక పోస్ట్‌లో తన సోదరీమణులతో పోజులిచ్చాడు. ఈ నేపథ్యంలోనే అతన్ని  ఊహించని చిక్కుల్లో పడేసింది.  ఆకాశ్ దీప్ కి  లక్నోలోని ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) నోటీసు పంపించినట్టు సమాచారం. ఆకాశ్ దీప్ కి  ఆగస్ట్ 11, సోమవారం నాడు నోటీసు జారీ చేసింది, అసంపూర్తిగా రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ మరియు అవసరమైన హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (HSRP) మరియు మూడవ రిజిస్ట్రేషన్ మార్క్ (TRM) తప్పిపోయిన కారణంగా పబ్లిక్ రోడ్‌లపై కొత్తగా కొనుగోలు చేసిన SUV వినియోగాన్ని నిలిపివేసింది. అన్ని వాహనాల డాక్యుమెంటేషన్ అవసరాలను పాటించాలని మరియు 72 గంటల్లో సంబంధిత అధికారుల ముందు హాజరు కావాలని నోటీసులో భారత యువ పేసర్‌ను ఆదేశించింది.


ఆకాశ్ కి వారు విషెష్ 

ఆకాశ్ దీప్ కొన్న ఆ కారు టాప్ మోడల్ దర రూ.62లక్షలకు ఉంటుందని సమాచారం. ఈ కారు కొనుగోలు చేసిన వెంటనే పలువురు టీమిండియా క్రికెటర్లు ఆకాశ్ కి విషెష్ కూడా చెప్పారు. ప్రస్తుతం ఈ కారుకి సంబంధించి.. ఆర్టీవో నోటీసులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి 2024 ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ తో జరిగిన 5టెస్ట మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా చివరి మూడు టెస్టుల్లో ఆకాశ్ దీప్ తొలిసారిగా భారత టెస్ట్ జట్టులో స్థానం సంపాదించాడు. తొలి రెండు టెస్టులకు ఎంపికైన ఆవేశ్ ఖాన్ స్థానంలో ఆకాశ్ దీప్ కి ఆ సమయంలో చోటు లభించింది. ఆకాశ్ దీప్ అంతకు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్ట తరపున ఐపీఎల్ ఆడాడు. ఇక దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణించి 29 మ్యాచ్ ల్లోనే 103 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. వీటిలో దాదాపు 4సార్లు 5 వికెట్లను తీసిన ఘనత సాధించాడు.

Related News

Team India: టీమిండియా ప్లేయర్ పై టాలీవుడ్ ఆంటీ కన్ను.. ?

Vaibhav SuryaVamshi : వైభవ్ సూర్య వంశీపై దారుణంగా ట్రోలింగ్…సంక్రాంతికి వస్తున్నాం బుడ్డోడు అంటూ

Harry Brook: క్రికెట్ లోనే తొలిసారి… సరికొత్త షాట్ కనిపెట్టిన హ్యారీ బ్రూక్.. ఇది చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే

Triple H: బికినీలో ప్రియురాలు… ట్రిపుల్ హెచ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి

Irfan Pathan : ధోనీ వల్లనే జట్టులో చోటు కోల్పోయా.. ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×