MS Dhoni : టీమిండియా దిగ్గజ క్రికెటర్ ఎం.ఎస్. ధోనీ (M.S Dhoni) గురించి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే.. అతను టీమిండియా (Team India) లో కీలక పాత్ర పోషించాడు. ప్రపంచ వ్యాప్తంగా పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. టీమిండియా (Team India) కి బెస్ట్ కెప్టెన్ గా నిలిచాడు. ధోనీ కెప్టెన్సీలో భారత జట్టు టీ-20 2007 వరల్డ్ కప్, 2007 ఛాంపియన్స్ ట్రోఫీ, 2011 వన్డే వరల్డ్ కప్, ఆసియా కప్ ఇలా అన్ని ఫార్మాట్లలో వరల్డ్, ఆసియా కప్ సాధించడం ధోనీ గొప్పతనం అనే చెప్పాలి. టీమ్ (Team) ను ఎలా చక్కదిద్దాలో.. ధోనీ కి తెలిసినంతా కెప్టెన్సీ మరెవ్వరికీ ఇంకా సరిగ్గా తెలియదు. ఇప్పటికీ కొందరూ కెప్టెన్సీ విషయంలో ధోనీ సలహాలు తీసుకుంటారంటే అతిశయోక్తి కాదు. ఇదిలా ఉంటే.. ధోనీకి కార్ల పిచ్చి ఉంటుంది. దీంతో తాజాగా రోల్స్ రాయిస్ వింటేజ్ కారులో ధోనీ షికారు చేస్తున్న కారు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : Chris Gayle : డ్రెస్సింగ్ రూంలో ఏడ్చేసిన క్రిస్ గేల్…ఆ బాలీవుడ్ హీరోయిన్ టార్చర్ భరించలేక!
సాధారణంగా టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ (M.S Dhoni) కేవలం క్రికెట్ మైదానంలోనే కాదు.. మైదానం బయట కూడా వార్తల్లో నిలుస్తుంటాడు. ఈ సారి ఆయన తన అరుదైన కారుతో రోడ్డు పై కనిపించి అందరినీ ఆశ్యర్యపరిచాడు. ముఖ్యంగా ధోనీ రిటైర్మెంట్ అయిన తరువాత కూడా ఫ్యాన్స్ దృష్టి అంతా ధోనీపైనే ఉండటం విశేషం. తాజాగా రాంచిలోని ధోనీ ఫామ్ హౌస్ నుంచి అరుదైన రోల్స్ రాయిస్ కారుతో బయటికి వచ్చారు. అయితే ఈ కారు 1980 నాటి వింటేజ్ రోల్స్ రాయిస్ సిల్వర్ వ్రైత్ II. ఇది చూసేందుకు చాలా క్లాసిక్ గా.. రాజసం ఉట్టిపడేవిధంగా కనిపించింది. ఇక ధోనీ తన రోల్స్ రాయిస్ కారులో రోడ్డు మీదకు రాగానే రోడ్డుపై ఉన్న అభిమానులు అంతా ఒక్కసారిగా చూసి ఆశ్చర్యపోయారు. దీని ధర సుమారు $8,500 ఉంటుందట.
ముఖ్యంగా అరుదైన కారు.. తమ అభిమాన క్రికెటర్ ను చూసి చాలా మంది యువకులు ధోనీ కారు వెనకాల చాలా దూరం పరుగులు పెట్టారు. కొందరూ తమ మొబైల్ ఫోన్ లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం వింటేజ్ కారు సోషల్ మీడియాలో వైరల్ మారింది. రోల్స్ రాయిస్ వంటి చాలా ఖరీదైన కారును ధోనీ డ్రైవింగ్ చేయడం చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ధోనీ గ్యారెజీలో కేవలం రోల్స్ రాయిస్ కార్లు మాత్రమే కాదు.. చాలా రకాల కార్లు ఉండటం విశేషం. వీటిలో 1969 ఫోర్డ్ మస్టాంగ్ 429 ఫాస్ట్ బ్యాక్, ఫెరారీ 599 జీటీఓ, మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ, నిస్సాన్ జొంగా, హమ్మర్ ్2, జీప్ గ్రాండ్ చెరోకీ ట్రాక్ హక్ వంటి కార్లు చాలానే ఉన్నాయి. ఇక ధోనీకి ఈ వాహనాల ఉన్న ప్రేమ.. వాటిని కాపాడుకునే విధానం చాలా మందికి స్పూర్తినిస్తుందనే చెప్పవచ్చు.
Thala Dhoni in Vintage Rolls Royce. 💛🥹 pic.twitter.com/ZWayLRomDB
— Johns. (@CricCrazyJohns) September 8, 2025