BigTV English

Gill – Rishabh Pant : రిషబ్ పంత్ ను అవమానించిన గిల్.. ఇంత బలుపు ఎందుకు అంటూ ట్రోలింగ్

Gill – Rishabh Pant : రిషబ్ పంత్ ను అవమానించిన గిల్.. ఇంత బలుపు ఎందుకు అంటూ ట్రోలింగ్

 Gill – Rishabh Pant : టీమిండియా క్రికెటర్, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ నిన్న జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ సీజన్ లో అత్యధిక ధరకు కొనుగోలు చేసిన లక్నో జట్టు అతని ప్రదర్శన ప్రారంభంలో ఆకట్టుకోలేకపోయింది. చివరి మ్యాచ్ లో మాత్రం తన ప్రతాపం చూపించాడు. సిక్సులు బాది అభిమానుల మన్ననలు పొందాడు. అయితే   లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పాయింట్ల పట్టికలో  7వ స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆప్స్ నుంచి నిష్క్రమించిన తరువాత లక్నో బ్యాటర్లు బ్యాట్ ని ఝులిపించారు. ఇదిలా ఉంటే.. నిన్న గుజరాత్ జరిగిన మ్యాచ్ లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆటగాళ్లు అంతా షేక్ హ్యాండ్ ఇచ్చుకునే సమయంలో గిల్ నిరాశగా కనిపించారు. రిషబ్ పంత్ షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడేందుకు ప్రయత్నించగా.. గిల్ పట్టించుకోకుండా వెల్లిపోయారు. దీంతో వీరి మధ్య ఏమైందనే చర్చ మొదలైంది.


Also Read : Sara – Shubman Gill: ప్రియుడి కోసం జెర్సీ మార్చిన సారా.. గిల్ తో మళ్ళీ కలిసిపోయిందా !

పంత్ ని పట్టించుకోని గిల్..


పంత్ ని గిల్ పట్టించుకోకపోవడం.. ఇక టెస్ట్ ల్లో కెప్టెన్, వైస్ కెప్టెన్లు వీరు అవుతారనుకుంటున్న ఈ ఆటగాళ్ల మధ్య ఏమైంది..? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఇద్దరి ప్లేయర్ల మధ్య జరిగిన ఈ పరిణామం ఎక్కడికీ దారి తీస్తుందో చూడాలి మరీ. గుజరాత్ టైటాన్స్ జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు 235 పరుగులు చేసింది. చివరి ఓవర్ లో కెప్టెన్ రిషబ్ పంత్ అద్భుతమైన రెండు సిక్సులు బాదాడు. చివరి ఓవర్ మొదటి బంతికే సిక్స్ బాదాడు పంత్. వాస్తవానికి పంత్ ప్రారంభంలో ఫామ్ లో కనిపించలేదు. కానీ చివరి మ్యాచ్ లో మాత్రం అద్భుతంగా బ్యాట్ చేసి అభిమానులను అలరించాడు. ఈ మ్యాచ్ లో 64 బంతుల్లో 117 పరుగులు చేశాడు ఓపెనర్ మిచెల్ మార్ష్. అందులో 8 సిక్సులు, 10 ఫోర్లు ఉండటం విశేషం. మరోవైపు ఓపెనర్ మాక్రమ్ 24 బంతుల్లో 36 పరుగులు చేయగా.. నికోలస్ పూరన్ 27 బంతుల్లో 56 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. రిషబ్ పంత్ 6 బంతుల్లో 16 పరుగులు చేశాడు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 20 ఓవర్ల కి 235 పరుగులు చేసింది.

లక్నో చేతిలో గుజరాత్ ఓటమి.. 

గుజరాత్ బౌలర్లు ఇవాళ అంతగా బౌలింగ్ చేయలేదు. సాయి కిషోర్ బౌలింగ్ లో మార్క్రమ్, అర్షద్ ఖాన్ బౌలింగ్ లో మిచెల్ మార్ష్ మినహా మిగతా బౌలర్లు అంతా వికెట్లు తీయడం విఫలం చెందారు. దీంతో లక్నో బ్యాటర్లు రెచ్చిపోయి భారీ స్కోర్ చేశారు. అయితే ఛేదనలో గుజరాత్ జట్టు కూడా ధాటిగానే ఆడింది. ట్యాప్ 5 బ్యాటర్లలో అందరూ చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించారు. కానీ షారూఖ్ ఖాన్ మినహా ఎవ్వరూ హాఫ్ సెంచరీ సాధించలేకపోయారు. లక్ష్యం పెద్దది కావడంతో టైటాన్స్ కి ఓటమి తప్పలేదు. ఈ సీజన్ లో నిలకడకు మారుపేరుగా నిలిచిన సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ ని మెరుగ్గానే ప్రారంభించినా ఎక్కువ నిలవలేకపోయాడు. శుభ్ మన్ గిల్ 20 బంతుల్లో 35 పరుగులు చేశాడు. బట్లర్ 18 బంతుల్లో 33 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. శుభ్ మన్, బట్లర్ వెంట వెంట ఔట్ కావడంతో గుజరాత్ టైటాన్స్ కష్టాల్లో పడింది. 33 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×