BigTV English

Digvesh Rathi: వీడు మారడు.. మరోసారి దిగ్వేశ్ ‘నోట్​బుక్’​ సంబరాలు.. వేటు తప్పదా !

Digvesh Rathi: వీడు మారడు.. మరోసారి దిగ్వేశ్ ‘నోట్​బుక్’​ సంబరాలు.. వేటు తప్పదా !

Digvesh Rathi : ఐపీఎల్ 2025 సీజన్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో అస్సలు ఊహించడం కష్టం అవుతుంది. ఇటీవల సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాలు అభిషేక్ సెంచరీ సాధించిన సమయంలో తన జేబులో ఉన్న నోట్ తీసి తన అభిమానులకు చూపించాడు. దీంతో ఆ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలా నిత్యం రోజు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో తరుచూ వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓపెనర్ రికెల్టన్ 32 బంతుల్లో 58 పరుగులు చేశాడు. అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు.


Also Read :  Ponting : మాక్సి మామ బ్యాటింగ్… పాంటింగ్ పై విమర్శలు

ఇక అదే  సమయంలో దిగ్వేష్ రతి బౌలింగ్ చేశాడు. బౌలింగ్ చేయడానికి ముందు స్టేడియంలో తాను సిగ్నేచర్ చేశాడు. ఆ తరువాత వేసిన బంతికే రికెల్టన్ ఆయూష్ బదోనికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో దిగ్వేష్ సంబురాలు చేసుకున్నాడు. ఇక రికెల్టన్ మాత్రం బయటికీ వెళ్లేటప్పుడు చేతిని ఇలా కిందికి ఊపి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం దిగ్వేష్ కి సంబంధించిన సిగ్నేచర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత ముంబై బ్యాటింగ్ చేసింది. ముంబై బ్యాటర్లలో రికెల్టన్ 58, రోహిత్ శర్మ 12, విల్ జాక్స్ 29, సూర్య కుమార్ యాదవ్ 54, తిలక్ వర్మ 06, హార్దిక్ పాండ్యా 5, నమన్ 25, బోస్ 20, దీపక్ చాహర్ 1 పరుగులు చేయడంతో 215 పరుగులు చేశారు.


Also Read : Sarfaraz Khan – Ananya Bangar : గే తో సర్ఫరాజ్ ఖాన్ రిలేషన్… వీడియో వైరల్

లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ 34 పర్వాలేదనిపించినా.. మరో ఓపెనర్ మార్క్రమ్ 11 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో లక్నో కి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. నికోలస్ పూరన్ కాస్త నిలకడగా ఆడినట్టు కనిపించినా ఎక్కువ స్కోర్ చేయలేకపోయాడు. 15 బంతుల్లో 27 పరుగులు చేశాడు. కెప్టెన్ రిషబ్ పంత్ కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. బదోనీ 35 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. డేవిడ్ మిల్లర్ 24 పరుగులు, అబ్దుల్ సమద్ 2, రవి బిష్ణోయ్ 13, ఆవేశ్ ఖాన్ 0, ప్రిన్స్ యాదవ్ 4, దిగ్వేష్ 1 పరుగు మాత్రమే చేయడంతో లక్నో జట్టుకి ఓటమి తప్పలేదు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 3 వికెట్లు తీయగా.. బుమ్రా 4 వికెట్లు తీశాడు. దీంతో అక్కడే లక్నో 7 వికెట్లను కోల్పోయింది. విల్ జాక్స్ 2, బోస్ 1 వికెట్ తీయడంతో 20 ఓవర్లలో 161 పరుగులు మాత్రమే చేయగలిగింది లక్నో సూపర్ జెయింట్స్. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు 54 పరుగుల తేడా తో ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఈ మ్యాచ్ లో  దిగ్వేష్ సిగ్నేచర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం విశేషం.

Related News

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Big Stories

×