BigTV English

Ponting : మాక్సి మామ బ్యాటింగ్… పాంటింగ్ పై విమర్శలు

Ponting : మాక్సి మామ బ్యాటింగ్… పాంటింగ్ పై విమర్శలు

Ponting : ఆస్ట్రేలియా క్రికెటర్ మ్యాక్స్ వెల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అతను ఐపీఎల్ లో తనకంటూ ముద్ర వేసుకునేవాడు. ప్రస్తుతం మ్యాక్స్ వెల్ పంజాబ్ కింగ్స్ కి ఆడుతున్నాడు. గతంలో కూడా పంజాబ్ కింగ్స్ ఆడాడు. మధ్యలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. నిన్న రాత్రి పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ బ్యాట్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో బ్యాట్ తిప్పి ఒక ఫోర్ బాదాడు. ఇక ఆ తరువాత బంతిని బ్యాట్ తిప్పకుండా రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ లాగానే ఆడటంతో వరుణ్ చక్రవర్తి వేసిన బంతి వికెట్లను తాకడంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.


Also Read : Sarfaraz Khan – Ananya Bangar : గే తో సర్ఫరాజ్ ఖాన్ రిలేషన్… వీడియో వైరల్

మ్యాక్స్ వెల్ ఏంటి..? ఇలా ఔట్ అయ్యాడని అందరూ చర్చించుకోవడం విశేషం. మరోవైపు పంజాబ్ కింగ్స్ కోచ్ పాంటింగ్ స్ట్రాటజీ పై క్రీడా వర్గాల నుంచి సైతం విమర్శలు వినిపిస్తున్నాయి. ఫామ్ లో ఉన్న శశాంక్ సింగ్ , నేహాల్ వధేరాను కాదని మ్యాక్స్ వెల్ ను నెం.4లో బ్యాటింగ్ పంపారు. కానీ ఆయన పేలవ ఫామ్ లో ఉన్నాడు. అతను మరోసారి సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితం అయ్యాడు. కోచ్ పాంటింగ్ కి భారత ప్లేయర్ల పై నమ్మకం లేదని మాజీ ప్లేయర్ మనోజ్ తివారి మండిపడ్డారు. పంజాబ్ కింగ్స్ వేలంలో ఐదుగురు ఆస్ట్రేలియా ప్లేయర్లను తీసుకోవడం పై కూడా గతంలో విమర్శలు వినిపించాయి.


ఇక నిన్న రాత్రి పంజాబ్ కింగ్స్ జట్టు వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిిన మ్యాచ్ వర్షార్పణమైంది. దీంతో రెండు జట్లకు చెరో పాయింట్ వచ్చింది. ఈడెన్ గార్డెన్ లో తొలి ఇన్నింగ్స్ పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా కేవలం 1 ఓవర్ మాత్రమే ఆడింది. 7 పరుగులు చేసింది. వికెట్లు కోల్పోలేదు. దీంతో వర్షం రావడంతో మ్యాచ్ రద్దు అయింది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఈ మ్యాచ్ లో అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. ప్రభ్ మన్ సింగ్ 49 బంతుల్లో 83 పరుగులు చేయగా.. ప్రియాంశ్ ఆర్య 35 బంతుల్లో 69 పరుగులు చేశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 25 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మ్యాక్స్ వెల్ 7 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు.  పంజాబ్ కింగ్స్ 4 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో వైభవ్ 2 వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి 1, రస్సెల్ 1 వికెట్ తీశారు. ప్రధానంగా పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఆస్ట్రేలియా సీనియర్ ఆటగాడు మ్యాక్స్ వెల్ మాత్రం కాస్త నిరాశ పరిచాడనే చెప్పవచ్చు. దీంతో మ్యాక్స్ వెల్ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేయడం విశేషం.

 

Related News

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

IND Vs PAK : టీమిండియా పై పాకిస్తాన్ లేడీ సంచలన వ్యాఖ్యలు.. మీరు ఇంటికి వెళ్లిపోండి అంటూ!

IND Vs PAK : మరోసారి రెచ్చిపోయిన పాకిస్థాన్..వంక‌ర బుద్దులు ఏ మాత్రం పోలేదుగా !

Haris Rauf’s wife : హారిస్ రౌఫ్ భార్యకు పెను ప్రమాదం… తుక్కుతుక్కు అయిన కారు !

SL VS PAK : ఆసియా క‌ప్ లో నేడు శ్రీలంక‌-పాక్ మ‌ధ్య పోరు.. చావో రేవో..!

Big Stories

×