KCR Speech: తెలంగాణ కోసం పదవులను తృణపాయంగా వదిలేసిన చరిత్ర మాది అని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఆనాడు కాంగ్రెస్ తెలంగాణ ఇస్తామని ప్రకటించి కూడా వెనక్కి తీసుకుందని ఆయన గుర్తు చేశారు.. తెలంగాణ ఉద్యమం సమయంలో సకల జన సమ్మె వంటావార్పుతో గడగడలాడించామని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో మూడేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయని.. అప్పుడు గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
పంజాబ్‌ను తలదన్నేలా పంటలు పండించాం..
‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి జరిగింది. తలసరి ఆదాయం రూ.90వేల నుంచి మూడున్నర లక్షలకు తీసుకొచ్చాం. మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టుకున్నాం. పంజాబ్ ను తలదన్నేలా పంటలు పండించాం’ అని అన్నారు.
ప్రాణాలకు తెగి అమరణ దీక్షకు దిగా
‘1956లో బలవంతంగా ఆంధ్రాలో విలీనం చేసింది నెహ్రూనే. తెలంగాణ బిడ్డల్ని ఇందిరా ప్రభుత్వం కాల్చిచంపింది. తెలంగాణ ఇస్తామని నమ్మించి పొత్తు పెట్టుకున్నారు. తర్వాత మనల్ని 14 ఏళ్లు ఏడిపించారు. తెలంగాణ కోసం 36 పార్టీలతో సమ్మతి లేఖలు తెచ్చాం. రాజీనామాలు చేసి బయటకొచ్చి ఉద్యమం చేశాం. ప్రాణాలకు తెగించి ఆమరణ దీక్షకు దిగా. దీక్షకు భయపడి కాంగ్రెస్ కాంగ్రెస్ తెలంగాణ ప్రకటన చేసింది. తర్వాత ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. మూడేళ్ల తర్వాత రాజకీయ అవసరం కోసం.. తెలంగాణ ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రకటించింది’ అని చెప్పారు.
జీఎస్‌డీపీని నెంబర్-1 స్థాయికి తీసుకెళ్లాం
‘ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా తీసుకున్నాం. అనేక రంగాల్లో తెలంగాణను ముందు ఉంచాం. పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో ఎన్నో అవార్డులు వచ్చాయి. తెలంగాణ అంటే ఒకప్పుడు వెనుకబడి ఉన్న ప్రాంతం. తలసరి ఆదాయాన్ని భారీగా పెంచాం. జీఎస్‌డీపీని నెంబర్-1 స్థాయికి తీసుకెళ్లాం. అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించాం. మూడున్నర లక్షల టన్నుల వడ్లు పండించుకున్నాం’ అని కేసీఆర్ అన్నారు.
గోల్ మాల్ చేయడంలో కాంగ్రెస్ ని మించిన వారు లేరు
పారిశ్రామిక రంగంపై దృష్టి పెట్టాం. ఐటీ ఎగుమతులను రూ.2.5 లక్షల కోట్లకు పెంచాం. వెయ్యికి పైగా గురుకులాలు ఏర్పాటు చేశాం. 33 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశాం. మా హయాంలో మతకల్లోలాలు లేవు. లక్షలాది గొర్రెలను పంపిణీ చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది. ఏ మాయమాటలు చెప్పారని ఇలా చేశారు. గోల్ మాల్ చేయడంలో కాంగ్రెస్ ని మించిన వారు లేరు. అబద్దాలు చెప్పడంలో వారికి సాటి ఎవరూ లేరు’ అని అన్నారు.
ఎవరికైనా తులం బంగారం వచ్చిందా..?
‘ఇంట్లో ఇద్దరికీ పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఢిల్లీ నుంచి వచ్చి నకిలీ గాంధీలు హామీలు ఇచ్చారు. రైతు బంధు రూ.15వేలు ఇస్తామన్నారు. రూ.2వేలు ఉన్న పెన్షన్లు రూ.4 వేలు చేస్తామన్నారు. దివ్యాంగులకు రూ.6వేల పెన్షన్ ఇస్తామన్నారు. చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామన్నారు. కల్యాణలక్ష్మీ ద్వారా తులం బంగారం ఇస్తామన్నారు. ఎవరికైనా తులం బంగారం వచ్చిందా..?’ అని కేసీఆర్ నిలదీశారు.
ఆవేదనతో మాట్లాడుతున్నా.. అర్థం చేసుకోండి..
‘మంచిగా ఉన్న తెలంగాణను దగా చేశారు. చాలా ఆవేదనతో మాట్లాడుతున్నా. నా కళ్ల ముందే తెలంగాణ ఇలా కావడం నాకు దు:ఖాన్ని కలిగిస్తోంది. మా హయాంలో భూముల రేట్లు బాగా పెరిగాయి. కాంగ్రెస్ చేతగాని పాలనతోనే ఈ పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ ను నమ్మి జనం బోల్తా పడ్డారు’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
పోలీసులు డైరీలలో రాసిపెట్టుకోండి..
పోలీసులు డైరీలలో రాసిపెట్టుకోండి. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎవరూ ఆపలేరు. పోలీసులు ఎందుకు కేసులు పెడుతున్నారు. పోలీసులకు రాజకీయాలు ఎందుకు..? పోలీసులు మీ డ్యూటీ మీరు చేయండి. ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు మద్దతుగా ఉంటే కేసులు పెడుతున్నారు. పోలీసులు ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.
మళ్లొచ్చేది మనమే…
ఓట్లు ఎప్పుడు వస్తాయా..? అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరో మూడేళ్లలో ఎన్నికలు వస్తాయి. అప్పుడు ఎవరు మనల్ని ఆపేదేలేదు. అప్పుడు బీఆర్ఎస్ వంద శాతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది’ అని కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.
ALSO READ: BIG BREAKING: కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు.. రాష్ట్రంలో నెంబర్-1 విలన్ ఎవరంటే..?