IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ ప్రస్తుతం కొనసాగుతోంది. గత ఏడాది కేకేఆర్ ఛాంపియన్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది మాత్రం ఏ జట్టు టైటిల్ గెలుస్తుందనేది చెప్పడం చాలా కష్టం అనే చెప్పాలి. ఎందుకంటే ఏ జట్టు ఎప్పుడూ ఎలా ఆడుతుందో ఎవ్వరూ అస్సలు ఊహించడం లేదు. ఈ సీజన్ లో తొలి స్థానంలో గుజరాత్ టైటాన్స్, రెండో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు కొనసాగుతుండగా.. చివరి స్థానం మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ ఉండటం విశేషం.
Also Read : Gavaskar-Kambli : గవాస్కర్ గొప్ప మనసు… నెలకు రూ. 30 వేలు ఇస్తున్నాడు !
ఈ సీజన్ లో ముఖ్యంగా మూడు జట్లు వెనుకంజలో కొనసాగుతున్నాయి. వాటిలో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు. ప్రారంభం నుంచి ఈ జట్లు పాయింట్ల పట్టికలో వెనుకంజలో కొనసాగుతున్నాయి. అయితే ముంబై మాత్రం కాస్త ముందంజలో కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు చివరి రెండు స్థానాలకు పోటీ పడుతున్నాయి. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరువాత మూడు మ్యాచ్ లు ముంబై ఇండియన్స్ తో వాంఖడే స్టేడియంలో, మళ్లీ ముంబై తో హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడనుంది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ తో చెపాక్ స్టేడియంలో తలపడనుంది సన్ రైజర్స్ హైదరాబాద్.
అలాగే ముంబై తన తదుపరి 3 మ్యాచ్ లు వాంఖడే స్టేడియం లో SRH తో తలపడనుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ తో వాంఖడే స్టేడియంలోనే జరుగనుంది. ఆ తరువాత సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఉప్పల్ లో తలపడనుంది. చెన్నై సూపర్ కింగ్స్ తన తరువాత 2 మ్యాచ్ లు ముంబై ఇండియన్స్ తో వాంఖడే స్టేడియంతో తలపడనుండగా.. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ తో చెపాక్ స్టేడియంలో తలపడనుంది. ఈ ముగ్గురిలో ఒక్కరికీ అస్సాం స్పాట్ ఖాయమని నెటిజన్స్ పేర్కొనడం గమనార్హం. ఈ మూడు జట్లు అసలు వెనుకంజలో ఉండటానికి కారణం ఏంటి.? అని అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఇప్పటి వరకు చివరి స్థానంలో ఉన్న హైదరాబాద్ జట్టు మొన్న పంజాబ్ మ్యాచ్ తో 245 పరుగులు ఛేజ్ చేయడంతో మళ్లీ హైదరాబాద్ పుంజుకుంటుందని అభిమానులు పేర్కొంటున్నారు. చెన్నై జట్టు కూడా మొన్న లక్నో సూపర్ జెయింట్స్ పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ లో చివర్లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, శివమ్ దూబె రాణించడంతో కష్టాల్లో చెన్నైని విజయతీరాలకు చేర్చారు. ఈ సీజన్ లో గుజరాత్, ఢిల్లీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ లు వరుసగా నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. చివరి స్థానాల్లో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఉండటం విశేషం.
Muggurlo okkadi Assam spot confirm https://t.co/q0xvRYJXWn pic.twitter.com/r75QPelKOU
— Ram 🦅 (@SunRAISAAR) April 15, 2025