BigTV English

Priyanka Chopra: మళ్లీ హాలీవుడ్‌కు ప్రయాణమవుతున్న ప్రియాంక.. మరీ ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’ పరిస్థితి ఏంటి.?

Priyanka Chopra: మళ్లీ హాలీవుడ్‌కు ప్రయాణమవుతున్న ప్రియాంక.. మరీ ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’ పరిస్థితి ఏంటి.?

Priyanka Chopra: మామూలుగా పాన్ ఇండియా డైరెక్టర్లు.. హీరోలు తమతో పనిచేయాలంటే అది పూర్తయ్యే వరకు వేరే సినిమాకు సైన్ చేయకూడదని ముందే అగ్రిమెంట్ చేసుకుంటారు. చాలావరకు హీరోయిన్ల పరిస్థితి కూడా అంతే. పాన్ ఇండియా డైరెక్టర్లతో సినిమా చేస్తున్నారంటే హీరో అయినా, హీరోయిన్ అయినా పూర్తిగా కొన్నేళ్ల పాటు దానికి కమిట్ అవ్వాల్సిందే. ముఖ్యంగా రాజమౌళి విషయంలో అదే జరుగుతుంది. అందుకే ప్రభాస్ లాంటి హీరో రాజమౌళికి పూర్తిగా అయిదేళ్లు రాసిచ్చేశాడు. రామ్ చరణ్, ఎన్‌టీఆర్ కూడా అంతే. ఇప్పుడు మహేశ్ బాబు కూడా పూర్తిగా రాజమౌళి సినిమాపై ఫోకస్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. కానీ ఇందులో హీరోయిన్ మాత్రం వేరే సినిమాపై కూడా ఫోకస్ చేయడానికి సిద్ధమయ్యింది.


తెలుగులో డెబ్యూ

బాలీవుడ్‌లో ఎన్నో ఏళ్లుగా హీరోయిన్‌గా ఎంతో గుర్తింపు సంపాదించుకుంది ప్రియాంక చోప్రా. తను కూడా ఇతర హీరోయిన్లలాగానే బాలీవుడ్ నుండి హాలీవుడ్‌కు వెళ్లాలని కలలు కన్నది. కానీ ఆ కలలు త్వరగా నిజం కాలేదు. బాలీవుడ్ నుండి వచ్చిన తనకు హాలీవుడ్‌లో మొదట్లో ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అయినా కూడా కష్టపడి హాలీవుడ్‌లోకి ఎంటర్ అయ్యి అక్కడ కూడా మంచి పాత్రలు చేసి అందరినీ మెప్పించింది. మెల్లగా బాలీవుడ్‌ను కూడా మర్చిపోయింది. అక్కడే ఒక సింగర్‌ను పెళ్లి చేసుకొని పూర్తిగా అక్కడే సెటిల్ అయిపోయింది. అలా గ్లోబల్ స్టార్‌గా మారిన ప్రియాంక చోప్రా.. తెలుగులో డెబ్యూ ఇవ్వడానికి సిద్ధమవ్వడం అంతటా హాట్ టాపిక్‌గా మారింది.


హాలిడే మూడ్

తెలుగులో రాజమౌళి (Rajamouli), మహేశ్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’లో ప్రియాంక చోప్రా హీరోయిన్ అని ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యి ఒక షెడ్యూల్ కూడా పూర్తయ్యింది. అందుకే మహేశ్, ప్రియాంక ఎవరికి వాళ్లు ఈ బ్రేక్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలోనే ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’ (SSMB 29)ను పక్కన పెట్టి ప్రియాంక చోప్రా ఒక హాలీవుడ్ మూవీని ఓకే చేసిందని సినీ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి దానివల్ల మహేశ్ మూవీపై ఎఫెక్ట్ పడుతుందేమో అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రస్తుతం ఇద్దరూ హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఓకే కానీ అది పూర్తయిన తర్వాత అసలు ప్రియాంక చోప్రా ఏ మూవీ సెట్‌లో అడుగుపెడుతుందా అని అయోమయం మొదలయ్యింది.

Also Read: రీ రిలీజ్‌కు రెడీ అయిన ‘భరత్ అనే నేను’.. అవసరమా బ్రో అంటున్న ఫ్యాన్స్

ఇంగ్లీష్ సినిమాలతో బిజీ

నికోలస్ స్టోల్లర్ దర్శకత్వంలో విల్ ఫెర్రెల్, జాక్ ఎఫ్రెన్ నటిస్తున్న కామెడీ డ్రామాలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్‌గా నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు ‘జడ్జిమెంట్ డే’ అనే టైటిల్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రెజీనా హాల్, జిమ్మీ టాట్రో, బిల్లీ ఈష్నర్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దీనిని ఫెర్రెల్, జెస్సికా ఎల్బామ్, అలెక్స్ బ్రౌన్ కలిసి నిర్మించనున్నారు. అయితే ఇది మాత్రమే కాకుండా ప్రియాంక చోప్రా చేతిలో మరో రెండు ఇంగ్లీష్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. మరి ఈ సినిమాలు అన్నింటితో పాటు ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’ను కూడా ప్రియాంక ఎలా మ్యానేజ్ చేస్తుందా అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×