Gavaskar-Kambli : భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ గొప్ప మనస్సు చాటుకున్నాడు. ముఖ్యంగా తన CHAMPS ఫౌండేషన్ ద్వారా సునీల్ గవాస్కర్ వినోద్ కాంబ్లీ కి సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. ప్రతీ నెల రూ.30వేల చొప్పున అందజేయనున్నట్టు తెలిపారు. నిరుపేద మాజీ అంతర్జాతీయ క్రీడాకారులకు ఈ ఫౌండేషన్ సహాయం చేస్తుంది. వాస్తవానికి ఈ ఫౌండేషన్ 1999లో ప్రారంభం అయింది. కష్టాల్లో ఉన్న కాంబ్లీకి ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు రావడం శుభపరిణామం అని చెప్పవచ్చు. 2025 ఏప్రిల్ 1 నుంచి CHAMPS ఫౌండేషన్ ద్వాారా వినోద్ కాంబ్లీ బతికి ఉన్నంత వరకు రూ.30వేల చొప్పున నెలకు ఇస్తాని హామీ ఇచ్చారు సునీల్ గవాస్కర్.
Also Read : Amaravati Cricket Stadium: అమరావతిలో 150 ఎకరాలలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం… 10 టి20 మ్యాచ్ లు !
అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటున్న కాంబ్లీ ని ఇటీవలే వాంఖడే గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో కలిశారు గవాస్కర్. ఆయర పరిస్థితి తెలుసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నప్పటికీ కాంబ్లీ గవాస్కర్ పాదాలను తాకారు. ఆ సమయంలో ఆయన పరిస్థితి తెలుసుకున్న గవాస్కర్ ఈ నిర్ణయం తీసుకున్నారట. భారత్ తరపున 17 టెస్టులు, 104 వన్డే మ్యాచ్ లు ఆడిన వినోద్ కాంబ్లీకి బీసీసీఐ నుంచి నెలకు రూ.30వేల పెన్షన్ కూడా లభిస్తుంది. గవాస్కర్ సహాయంతో నెలవారి ఆదాయం రెట్టింపు అవుతుంది. ఈ మాజీ క్రికెట్ కుటుంబానికి గొప్ప సాయంగా ఉంటుంది. గవాస్కర్ గొప్ప మనస్సు కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
గత ఏడాది డిసెంబర్ లో వినోద్ కాంబ్లీ ఆరోగ్యం గణనీయంగా క్షీణించింది. అతనికి మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ తరువాత అతడిని హాస్పిటల్ లో చేర్చారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ తరుణంలోనే గవాస్కర్ ఫౌండేషన్ కాంబ్లీకి తోడుగా నిలిచింది. వాస్తవానికి జనవరి 11న వాంఖడే స్టేడియం 50వ వార్షికోత్సవం సందర్భంగా సునీల్ గవాస్కర్ వినోద్ కాంబ్లీని కలిశారు. ఆ సమయంలోనే గవాస్కర్ పాదాలను తాకుతూ కాంబ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. ఆ సమావేశం తరువాత సునీల్ గవాస్కర్ ఫౌండేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన తరువాత వినోద్ కాంబ్లీ కి వైద్యం అందిస్తున్న ఇద్దరూ డాక్టర్లను కలిసి మాట్లాడారు.
ప్రస్తుతం పలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వినోద్ కాంబ్లీ కి 1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ సభ్యులు సాయం అందిస్తారని సునీల్ గవాస్కర్ మాట ఇచ్చాడు. ప్రస్తుతం అతను తన మాటను నిలబెట్టుకున్నాడు. మరోవైపు 2013లో కాంబ్లీ కి రెండు సార్లు గుండె కి శస్త్ర చికిత్స లు జరిగాయి. ఆ సమయంలో సచిన్ టెండూల్కర్ ఆర్థిక సాయం అందించాడు. మొత్తానికి ఒక క్రీడాకారుడు ఇబ్బందుల్లో ఉంటే తన తోటి క్రీడాకారులు, సీనియర్లు, జూనియర్లు ఇలా క్రీడాకారులు వినోద్ కాంబ్లీ కి సాయం చేయడం శుభపరిణామం అనే చెప్పవచ్చు. ఇలాంటి సహాయ, సహకారాలు ప్రతీ క్రీడాకారుడికి కూడా ఉండాలని కోరుకుందాం.