BigTV English

Government School: నాన్న.. ప్లీజ్ మా హోమ్ వర్క్ చూడండి.. పాపం ఈ పిల్లల ఆవేదన చూడండి..

Government School: నాన్న.. ప్లీజ్ మా హోమ్ వర్క్ చూడండి.. పాపం ఈ పిల్లల ఆవేదన చూడండి..

Government School Students: గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా ఈ రోజుల్లో చాలా మంది పేరెంట్స్ కు చిన్నచూపు ఉంటుంది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూళ్లల్లో చదివిస్తూ ఉంటారు. అయితే ప్రభుత్వం బడుల్లో చదివి సివిల్స్ క్రాక్ చేసి కలెక్టర్, ఎస్పీ ఉద్యోగాలు, గ్రూప్-1 పోస్టులు కొట్టి డీఎస్పీలు, డిప్యూటీ కలెక్టర్లు అయిన వాళ్లు కోకొల్లలు. చాలా మంది గొప్ప వ్యక్తులు గవర్నమెంట్ స్కూళ్లలో చదివిన వారు ఉన్నారు. అయితే కొందరు మాత్రం పైసలు పెట్టి ప్రైవేట్ స్కూళ్లలో తమ పిల్లలను చదివిస్తారు.


ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా గవర్నమెంట్ స్కూళ్లు..

అయితే, ప్రస్తుతం తెలంగాణలో కొన్ని ప్రభుత్వ బడులు ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా రాణిస్తున్నాయి. చదువులో విద్యార్థులు గొప్పగా రాణిస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ల చెందిన విద్యార్థులకు మేం ఏం తక్కువ కాదని చెబుతున్నారు. అటు చదువులో, ఇటు ఆటల్లో చురుకుగా ఉంటున్నారు. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు తాము అనుకుంటే ఏదైనా సాధిస్తామని ప్రూఫ్ చేస్తున్నారు. ఇలా ప్రైవేట్ సెక్టార్ లో, గవర్నమెంట్ సెక్టార్ లో ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థాయికి వెళ్లినవారు చాలా మంది ఉన్నారు. అయితే తాజాగా.. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో బలపాల గ్రామ మండల ప్రజా పరిషత్ విద్యార్థులు రాసిన ఉత్తరాలు చూస్తుంటే అందిర్నీ ఆలోచింపజేస్తున్నాయి.


Also Read: NTPC-NGEL: డిగ్రీ ఉన్న వారికి గోల్డెన్ ఛాన్స్.. ఈ జాబ్ వస్తే లక్షల్లో జీతం.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..

పిల్లల ఆలోచనకు గ్రేట్ చెప్పాల్సిందే..

స్కూల్ విద్యార్థులు రాసిన ఉత్తరాలల్లో ఏం ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంట్లో పేరెంట్స్ అందరూ సెల్ ఫోన్ చూస్తూ మమ్మల్ని మరిచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ 5వ తరగతి విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఉత్తరాలు రాసి పోస్ట్ చేశారు. ‘నాన్న, నేను బాగా చదువుతున్నాను. మా పాఠశాల ఎంతో బాగుంటుంది. విద్య తో పాటు ఆటలు, పాటలు ఉంటాయి. ప్రైవేట్ పాఠశాలల కంటే ఎంతో ధీటుగా మా బడి ఉంటుంది. గ్రామంలోని తల్లిదండ్రులు అందరూ ఆలోచన చేసి మా బడికి పంపండి’ అని ఉత్తరాలు రాశారు. ప్రాథమిక స్థాయి విద్యార్థులు వినూత్న ఆలోచన అటు విద్యార్థుల తల్లిదండ్రులను, ఇటు చాలా మంది విద్యా ప్రముఖులను ఎంతోగాను ఆలోచింపజేస్తుంది. బలపాల గ్రామ మండల ప్రజా పరిషత్ ప్రాధమిక విద్యార్థులు రాసిన ఉత్తరాలు చూసైనా పేరెంట్స్ ప్రభుత్వ బడులను ప్రోత్సహించాలని సోషల్ మీడియా వేదికగా పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఉత్తరాలు చూసిన మరి కొందరు విద్యావంతులు ఆ పిల్లలను అభినందిస్తున్నారు.

Also Read: CSIR-CRRI: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.63,200, దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×